Skip to main content

అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీలో ప్రవేశాలకు నోటిఫికేషన్

బంజారాహిల్స్: బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది మార్చి 28 అని యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు ఇంటర్ లేదా దాని తత్సమాన అర్హత గల అభ్యర్థులు 2019-20 విద్యాసంవత్సరం కోసం బీఏ, బీకాం, బీఎస్సీలో మూడేళ్ల డిగ్రీ కోర్సులో ప్రవేశాలు పొందడానికి ఈ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. వారికి 2019 జూలై 1 నాటికి 18 ఏళ్ల వయసు నిండి ఉండాలి. యూనివర్సిటీ పోర్టల్ ద్వారా విద్యార్థులు స్టడీ, పరీక్షా కేంద్రం ఎంచుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు దరఖాస్తు ఫారంలో అడిగిన వివరాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత రూ.300 పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌లో డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. రూ.310 ఆన్‌లైన్‌లో ఫ్రాంచైజీ సెంటర్‌లో చెల్లించి రశీదు పొందాలి. అర్హత పరీక్ష ఏప్రిల్ 28న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెలంగాణ, ఏపీల్లో నిర్వహిస్తారు.
Published date : 29 Jan 2019 02:37PM

Photo Stories