‘అంబేడ్కర్’ డిగ్రీ కోర్సుల ప్రవేశ గడువు పెంపు
Sakshi Education
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ, పీజీ, డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల ప్రవేశాల గడువును సెప్టెంబర్ 5 వరకు పొడిగించారు.
2017-18 విద్యాసంవత్సరంలో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులూ రెండో సంవత్సరం అడ్మిషన్ ఫీజును 5లోగా ఆన్‌లైన్‌లో చెల్లించాలని వర్సిటీ అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే సమీపంలోని అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.braou.ac.in వెబ్‌సైట్‌లో చూడాలని కోరారు.
Published date : 29 Aug 2018 02:13PM