అక్టోబర్ 5 నుంచి ఓపెన్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు
Sakshi Education
జూబ్లీహిల్స్ (హైదరాబాద్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ (సీబీసీఎస్) పరీక్షలు అక్టోబర్ 5 నుంచి ప్రారంభం అవుతాయని వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆరో సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 5 నుంచి 10 వ తేదీ వరకు, ఐదో సెమిస్టర్ అక్టోబర్ 11 నుంచి 16 వరకు, మొదటి సెమిస్టర్ నవంబర్ 7 నుంచి 13 వరకు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా డిగ్రీ (ఓల్డ్ బ్యాచ్) మూడో సంవత్సరం పరీక్షలు అక్టోబర్ 18 నుంచి 23 వరకు, రెండో సంవత్సరం అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు, మొదటి సంవత్సరం పరీక్షలు నవంబర్ 4 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష తేదీకి 2 రోజుల ముందు వర్సిటీ వెబ్‌సైట్ https://braou. ac.in నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు వారి సంబంధిత అధ్యయన కేంద్రంలో లేదా వర్సిటీ వెబ్‌సైట్‌ను లేదా హెల్ప్‌డెస్క్ 73829 29570/580/590/600 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
Published date : 17 Sep 2020 01:43PM