5 నుంచి ఏఎన్‌యూ దూరవిద్య పరీక్షలు
Sakshi Education
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 2016 విద్యా సంవత్సరానికిగానూ దూర విద్య పరీక్షలు ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని దూరవిద్యా కేంద్రం పరీక్షల కోఆర్డినేటర్ డాక్టర్ కె.వీరయ్య శుక్రవారం తెలిపారు.
పీజీ, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ తదితర కోర్సులకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో41, తెలంగాణలో 30 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. రెండు రాష్ట్రాల నుంచి అన్ని కోర్సులకు కలిపి 29,980 మంది విద్యార్థులు పరీక్షలకు రాయనున్నారని వివరించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను www.anucde.info వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
Published date : 03 Dec 2016 11:22AM