29న ఏఎన్‌యూ దూరవిద్య ప్రవేశ పరీక్ష
Sakshi Education
ఏఎన్‌యూ (గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) దూర విద్యాకేంద్రం నిర్వహించే డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2016-17 బ్యాచ్‌లో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్ష ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈనెల 29న నిర్వహిస్తున్నామని దూర విద్యాకేంద్రం డెరైక్టర్ ఆచార్య పి.శంకరపిచ్చయ్య తెలిపారు.
ఏపీలో 22, తెలంగాణలో 34 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. డిగ్రీ కోర్సులకు ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఈనెల 27, 29 తేదీల్లో ఏఎన్‌యూ దూరవిద్య అధ్యయన కేంద్రాల్లో తత్కాల్ విధానంలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించామని వెల్లడించారు.
Published date : 26 Jan 2017 12:25PM