Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జూన్‌ 3 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu June 3rd 2022(డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Daily Current Affairs in Telugu

Santoor Scholar Sopori Eyelid: సంతూర్‌ విద్వాంసుడు భజన్‌ సొపోరి (73) కన్నుమూశారు

Santoor Scholar Sopori Eyelid

  సంతూర్‌ విద్వాంసుడు భజన్‌ సొపోరి (73) కన్నుమూశారు. కొన్నాళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురుగ్రాం ఆస్పత్రిలో గురవారం తుదిశ్వాస విడిచినట్టు కుమారుడు అభయ్‌ తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. సంతూర్‌ మేస్ట్రో పండిట్‌ శివకుమార్‌ శర్మ మరణించిన కొన్ని వారాలకే సొపోరి కూడా వెళ్లిపోవడం సంగీత ప్రపంచంలో విషాదం నింపింది. కశ్మీర్‌కు చెందిన సొపోరి పదేళ్ల వయసులోనే కచేరి చేశారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అలరించారు. హిందీ కశ్మీరీ, డోగ్రీ, సింధీ, ఉర్దూ, భోజ్‌పురీ, పర్షియన్, అరబిక్‌ భాషల్లో 6 వేలకుపైగా పాటలు కంపోజ్‌ చేశారు. గాలిబ్‌ గజల్స్‌కూ బాణీలు కట్టారు. 2004లో పద్మశ్రీ అందుకున్నారు.  

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Viswanathan Anand : ఆనంద్‌కు మరో విజయం

స్టావెంగర్‌: నార్వే చెస్‌ టోర్నమెంట్‌లో భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశాడు. జూన్‌  1 (బుధవారం) రాత్రి జరిగిన క్లాసికల్‌ విభాగం రెండో రౌండ్‌లో ఆనంద్‌ 36 ఎత్తుల్లోనే బల్గేరియాకు చెందిన వసెలిన్‌ తొపలోవ్‌పై విజయం సాధించాడు. ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 52 ఏళ్ల ఆనంద్‌ 10 మంది పాల్గొంటున్న ఈ టోర్నీలో ప్రస్తుతం 6 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. మరో పోరులో మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను అమెరికాకు చెందిన వెస్లీ సో చిత్తు చేశాడు. వీరిద్దరి మధ్య జరిగిన గేమ్‌ 38 ఎత్తుల్లో డ్రాగా ముగియగా ‘సడెన్‌ డెత్‌’లో వెస్లీకి విజయం లభించింది.

The winner of the ‘Finalisima’ is Argentina‘: ఫినలిసిమా’ విజేత అర్జెంటీనా

The winner of the ‘Finalisima’ is Argentina
The winner of the ‘Finalisima’ is Argentina
  • లండన్‌: స్టార్‌ స్ట్రయికర్‌ లియోనల్‌ మెస్సీ రాణించడంతో ‘ఫినలిసిమా’ ట్రోఫీని అర్జెంటీనా గెలుచుకుంది.  3–0 గోల్స్‌ తేడాతో ఇటలీని అర్జెంటీనా ఓడించింది. రెండు ఖండాలు దక్షిణాఫ్రికా, యూరోప్‌ల విజేతల మధ్య పోరు నిర్వహించేలా తొలి సారి ఈ టోర్నీని ప్రవేశపెట్టారు. అర్జెంటీనా, ఇటలీ ఇందులో తలపడ్డాయి.  వెంబ్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు 87,000 మంది ప్రేక్షకులు పోటెత్తారు.
  • సాకర్‌ దిగ్గజం మెస్సీ తన అనుభవాన్నంతా ఉపయోగించి జట్టును విజేతగా నిలిపాడు. ఈ మ్యాచ్‌లో లాటరో మార్టినెజ్‌ (28వ ని.), ఎంజెల్‌ డి మరియా (45+1వ ని.), పాలో డైబల (90+4వ ని.) గోల్‌ చేశారు. అయితే ఈ స్కోరులో మెస్సీ కీలక పాత్ర పోషించాడు. పాదరసంలా కదులుతూ బంతిని అత్యంత చాకచక్యంగా పాస్‌ చేయడంతో అర్జెంటీనా 3 గోల్స్‌ చేసింది. మ్యాచ్‌ ముగిసి న అనంతరం అర్జెంటీనా ఆటగాళ్లంతా మెస్సీకి బ్రహ్మరథం పట్టారు.
  • Download Current Affairs PDFs Here

Shakib Al Hasan Appointed As Bangladesh’s Test Captain: బంగ్లా టెస్టు కెప్టెన్‌గా షకీబ్‌

  •  
  •  
  •  
  •  
  •  

 Sakshi Education

Shakib Al Hasan Appointed As Bangladesh’s Test Captain
Shakib Al Hasan Appointed As Bangladesh’s Test Captain

Shakib Al Hasan Appointed As Bangladesh’s Test Captain: బంగ్లా టెస్టు కెప్టెన్‌గా షకీబ్‌ 
బంగ్లాదేశ్‌ టెస్టు జట్టు కెప్టెన్‌గా సీనియర్‌ ఆటగాడు షకీబుల్‌ హసన్‌ పునర్నియమితుడయ్యాడు. ఇప్పటి వరకు కెప్టెన్‌గా ఉన్న మోమినుల్‌ హక్‌ శ్రీలంకతో సిరీస్‌ ఓటమి తర్వాత రాజీనామా చేయడంతో కొత్త కెప్టెన్‌ ఎంపిక అనివార్యమైంది.   2009నుంచి 2019 మధ్య కాలంలో వేర్వేరు దశల్లో షకీబ్‌ 14 టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహించాడు. ఓవరాల్‌గా 61 టెస్టులు ఆడిన షకీబ్‌ 4113 పరుగులు చేయడంతో పాటు 224 వికెట్లు పడగొట్టాడు.

 

Published date : 03 Jun 2022 06:04PM

Photo Stories