Skip to main content

Praggnanandhaa : అంతర్జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ప్రజ్ఞానంద సంచలనం

ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌ అంతర్జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద సంచలనంతో శుభారంభం చేశాడు.
world rapid chess championship
praggnanandhaa

అమెరికా వేదికగా ఎనిమిది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య లీగ్‌ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్‌ మ్యాచ్‌లో తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద 2.5–1.5తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు. ఈ విజయంతో ప్రజ్ఞానందకు 7,500 డాలర్ల (రూ. 5 లక్షల 94 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే), లెవాన్‌ అరోనియన్‌ (అమెరికా), జాన్‌ క్రిస్టాఫ్‌ డూడా (పోలాండ్‌), లియెమ్‌ లీ (వియత్నాం), హాన్స్‌ నీమెన్‌ (అమెరికా), అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌) కూడా ఈ టోర్నీలో ఆడుతున్నారు.

Published date : 17 Aug 2022 07:24PM

Photo Stories