T20 Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్.. వన్డే, టీ20లో టీమిండియా టాప్..

ఈ ర్యాంకింగ్స్ గతేడాది మే నుంచి జరిగిన అన్ని మ్యాచ్‌లను 100 శాతంగా, గత రెండు సంవత్సరాల్లో జరిగిన మ్యాచ్‌లను 50 శాతంగా పరిగణలోకి తీసుకుని నిర్ణయించబడ్డాయి.
వన్డే, టీ20లో టీమిండియా టాప్..
ప్రస్తుత వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా.. వార్షిక ర్యాంకింగ్స్‌లోనూ టాప్ ప్లేస్ దక్కించుకుంది. గడిచిన రెండేళ్లలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్న టీమిండియా.. గతేడాది టీ20 ప్రపంచకప్, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. తాజాగా విడుదల చేసిన వార్షిక వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ రెండు పాయింట్లు మెరుగుపర్చుకుని పాయింట్ల సంఖ్యను 122 నుంచి 124కు పెంచుకుంది.
వన్డే టాప్ 10 జట్లు
- భారత్
- న్యూజిలాండ్
- ఆస్ట్రేలియా
- శ్రీలంక
- పాకిస్తాన్
- సౌతాఫ్రికా
- ఆఫ్ఘనిస్తాన్
- ఇంగ్లండ్
- వెస్టిండీస్
- బంగ్లాదేశ్
టీ20 టాప్ జట్లు..
- భారత్
- ఆస్ట్రేలియా
- ఇంగ్లండ్
- న్యూజిలాండ్
- వెస్టిండీస్
- సౌతాఫ్రికా
- శ్రీలంక
- పాకిస్తాన్
- బంగ్లాదేశ్
- ఆఫ్ఘనిస్తాన్
టెస్ట్ ర్యాంకింగ్స్..
ఆస్ట్రేలియా: ప్రస్తుత డబ్ల్యూటీసీ ఛాంపియన్‌గా టాప్ ప్లేస్
ఇంగ్లండ్: రెండో స్థానం (ఆస్ట్రేలియా కంటే 13 పాయింట్లు తక్కువ)
సౌతాఫ్రికా: మూడో స్థానం
భారత్: నాలుగో స్థానం (ఇటీవల పరాజయాల వల్ల)
న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఐర్లాండ్ – టాప్ 10లో ఉన్నాయి