Skip to main content

MICT Badminton : సిక్కి జోడీకి టైటిల్‌

మాల్దీవ్స్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో టైటిల్‌ సాధించింది.
Sikki-Kapoor pair loses in semifinals
Sikki-Kapoor pair loses in semifinals

అక్టోబర్ 23న జరిగిన ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్‌ కపూర్‌ (భారత్‌) జోడీ 21–16, 21–18తో టాప్‌ సీడ్‌ తనీనా–కొసీలా మామెరి (అల్జీరియా) ద్వయంపై విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఆకర్షి కశ్యప్‌ (భారత్‌) 24–22, 21–12తో ఇరా శర్మ (భారత్‌)పై నెగ్గి విజేతగా నిలిచింది. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో సుమీత్‌ రెడ్డి–రోహన్‌ కపూర్‌ (భారత్‌) జోడీ 21–23, 21–19, 21–17తో చలోంపన్‌–నాంతకర్న్‌ (థాయ్‌లాండ్‌) జంటపై గెలిచి టైటిల్‌ దక్కించుకుంది.    

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 25 Oct 2022 05:36PM

Photo Stories