Under-23 World Wrestling Championship: తొలి భారతీయ రెజ్లర్‌గా సాజన్ భన్వాల్
Sakshi Education
పోంటెవెద్రా (స్పెయిన్): ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌ష్ ప్ చరిత్రలో గ్రీకో రోమన్ విభాగంలో పతకం నెగ్గిన తొలి భారతీయ రెజ్లర్‌గా సాజన్ భన్వాల్ గుర్తింపు పొందాడు.
పురుషుల 77 కేజీల విభాగంలో సాజన్ కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతక పోరులో ఉక్రెయిన్‌కు చెందిన దిమిత్రో వాసెత్‌స్కీపై సాజన్ గెలుపొందాడు. నిర్ణీత ఆరు నిమిషాల బౌట్ తర్వాత ఇద్దరూ 10–10 పాయింట్లతో సమంగా నిలిచారు. అయితే ఆఖరి పాయింట్ భారత రెజ్లర్ సాధించడంతో సాజన్‌ను విజేతగా ప్రకటించారు. హరియాణాకు చెందిన సాజన్ నాలుగో ప్రయత్నంలో అండర్–23 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించాడు. 2018, 2019లలో ఐదో స్థానం పొందిన సాజన్ 2021లో 24వ స్థానంలో నిలిచాడు. ఈసారి మాత్రం సాజన్ కాంస్యంతో మెరిశాడు.
Published date : 20 Oct 2022 05:41PM