tel aviv tennis 2022 : బోపన్న జోడీకి టైటిల్
Sakshi Education
భారత టెన్నిస్ సీనియర్ స్టార్ రోహన్ బోపన్న తన కెరీర్‌లో 22వ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు.
అక్టోబర్ 2న జరిగిన టెల్ అవీవ్ ఏటీపీ–250 టోర్నీ ఫైనల్లో టాప్ సీడ్ బోపన్న (భారత్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ 6–2, 6–4తో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–ఆండ్రెస్ మొల్తెని (అర్జెంటీనా) ద్వయంపై గెలిచింది. ఈ ఏడాది 42 ఏళ్ల బోపన్నకిది మూడో డబుల్స్ టైటిల్. పుణే ఓపెన్, అడిలైడ్ ఓపెన్‌లలో అతను రామ్‌కుమార్ జోడీగా డబుల్స్ టైటిల్స్ సాధించాడు. బోపన్న–మిడిల్‌కూప్ జోడీకి 50,180 డాలర్ల (రూ. 40 లక్షల 94 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
Published date : 03 Oct 2022 07:31PM