ఫిబ్రవరి 2021 స్పోర్ట్స్
Sakshi Education
ఫిలిప్ ఐలాండ్ టెన్నిస్ టోర్నిలో టైటిల్ గెలిచిన క్రీడాకారిణి?
భారత మహిళల నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా తన కెరీర్‌లో తొలి డబ్ల్యూటీఏ టైటిల్‌ను సాధించింది. ఫిలిప్ ఐలాండ్ ట్రోఫీ మహిళల డబుల్స్ విభాగంలో అంకిత తన రష్యా భాగస్వామి కమిల్లా రఖీమోవాతో కలిసి విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఫిబ్రవరి 19న జరిగిన డబుల్స్ ఫైనల్లో అంకిత (భారత్)–కమిల్లా (రష్యా) ద్వయం 2–6, 6–4, 10–7తో అనా బ్లింకోవా–అనస్టాసియా పొటపోవా (రష్యా) జోడీపై గెలుపొందింది. టైటిల్ గెలుపొందిన అంకిత జోడీకి 8000 డాలర్లు ప్రైజ్‌మనీగా లభించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫిలిప్ ఐలాండ్ ట్రోఫీలో మహిళల డబుల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : అంకిత రైనా (భారత్)–కమిల్లా రఖీమోవా(రష్యా) ద్వయం
ఎక్కడ : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
అడ్రియాటిక్ టోర్నిలో స్వర్ణం గెలిచిన తొలి భారత బాక్సర్?
అడ్రియాటిక్ పెర్ల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి అల్ఫియా పఠాన్ స్వర్ణపతకం సాధించింది. మాంటెనెగ్రో దేశంలోని బద్వా పట్టణంలో ఫిబ్రవరి 20న జరిగిన 81 కేజీల విభాగం ఫైనల్లో... 2019 ఆసియా జూనియర్ బాలికల చాంపియన్ అయిన అల్ఫియా 5–0తో డారియా కొజొరెవ్ (మాల్డోవా)ను చిత్తు చేసింది. దీంతో అడ్రియాటిక్ టోర్నీలో స్వర్ణం నెగ్గిన తొలి భారత బాక్సర్‌గా అల్ఫియా నిలిచింది.
మాంటినిగ్రో రాజధాని: పొడ్గారికా; కరెన్సీ: యూరో
మాంటినిగ్రో ప్రస్తుత అధ్యక్షుడు: మిలో డ్యుకనోవిక్
మాంటినిగ్రో ప్రస్తుత ప్రధాని: జ్‌రావ్‌కో క్రివోకపిక్
క్విక్ రివ్యూ:
ఏమిటి : అడ్రియాటిక్ పెర్ల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో స్వర్ణం గెలిచిన భారత క్రీడాకారిణీ
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎవరు : అల్ఫియా పఠాన్(81 కేజీల విభాగం)
ఎక్కడ : బద్వా, మాంటెనెగ్రో
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్–2021 విజేత?
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్... ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో జపనీస్ స్టార్ నయోమి ఒసాకా చాంపియన్‌గా అవతరించింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఫిబ్రవరి 20న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ ఒసాకా 6–4, 6–3తో అమెరికాకు చెందిన 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీని చిత్తు చేసింది. దీంతో ఒసాకా రెండోసారి ఆస్ట్రేలియా గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్నట్లయింది. గతంలో 2019లో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను ఒసాకా గెలిచింది. తాజా విజయంతో ఒసాకా... ఓవరాల్‌గా నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. రెండు యూఎస్ ఓపెన్ (2018, 2020) టైటిల్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి.
మెర్టెన్స్–సబలెంక జంటకు డబుల్స్...
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను రెండో సీడ్ ఎలైస్ మెర్టెన్స్ (బెల్జియం)–అరినా సబలెంక (బెలారస్) జంట కైవసం చేసుకుంది. తుదిపోరులో బెల్జియం–బెలారస్ జోడీ 6–2, 6–3తో చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బరా క్రెజికొవా– కెటరినా సినియకొవా జంటపై అలవోక విజయం సాధించింది.
మిక్స్‌డ్ డబుల్స్‌లో...
మిక్స్‌డ్ డబుల్స్‌లో బార్బరా క్రెజికొవా (చెక్ రిపబ్లిక్)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ విజేతగా నిలిచింది. ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన క్రెజికొవా–రాజీవ్ రామ్ జోడీ 6–1, 6–4తో ఆస్ట్రేలియన్ వైల్డ్‌కార్డ్ జంట సమంత స్టొసుర్–మాథ్యూ ఎడెన్‌పై విజయం సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్–2021 విజేత?
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎవరు : నయోమి ఒసాకా
ఎక్కడ : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పురుషులు సింగిల్స్–2021 విజేత?
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్... ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ తొమ్మిదోసారి చాంపియన్‌గా అవతరించాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఫిబ్రవరి 21న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 7–5, 6–2, 6–2తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)ను ఓడించాడు. తాజా గెలుపుతో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను అత్యధికసార్లు గెల్చుకున్న ప్లేయర్‌గా తన పేరిటే ఉన్న రికార్డును జొకోవిచ్ సవరించాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 27 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 15 కోట్ల 71 లక్షలు), 2000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్‌గా నిలిచిన మెద్వెదేవ్‌కు 15 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 కోట్ల 57 లక్షలు), 1200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
గతంలో...
ఏమిటి : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పురుషులు సింగిల్స్–2021 విజేత?
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్
ఎక్కడ : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
అడ్రియాటిక్ పెర్ల్ టోర్నీలో భారత్‌కు రెండు స్వర్ణాలు
అడ్రియాటిక్ పెర్ల్ అంతర్జాతీయ మహిళల బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. మాంటెనిగ్రోలోని బద్వా పట్టణంలో జరిగిన ఈ టోర్నీలో ఫిబ్రవరి 21న వింకా (60 కేజీలు), సనమచ చాను (75 కేజీలు) భారత్‌కు బంగారు పతకాలు అందించారు. ఫైనల్లో వింకా 5–0తో క్రిస్టినా క్రిపెర్ (మాల్డోవా)పై... సనమచ చాను 6–0తో రాజ్ సాహిబా (భారత్)పై గెలిచారు.
రజతం, కాంస్యం...
48 కేజీల విభాగంలో గీతిక(భారత్) రజతం సాధించింది. ఫైనల్లో గీతిక 1–4తో ఫర్జానా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయింది. 57 కేజీల సెమీఫైనల్లో ప్రీతి(భారత్) 1–4తో బొజానా (మాంటెనిగ్రో) చేతిలో ఓడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

ఏమిటి : అడ్రియాటిక్ పెర్ల్ అంతర్జాతీయ మహిళల బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : వింకా (60 కేజీలు), సనమచ చాను (75 కేజీలు)
ఎక్కడ : బద్వా, మాంటెనిగ్రో
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మాజీ కెప్టెన్?
శ్రీలంక జట్టు ఓపెనర్, మాజీ కెప్టెన్ ఉపుల్ తరంగ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన 16 ఏళ్ల కెరీర్‌లో తరంగ 31 టెస్టుల్లో 1,754 పరుగులు (3 సెంచరీలు)... 235 వన్డేల్లో 6,951 పరుగులు (17 సెంచరీలు)... 26 టి20ల్లో 407 పరుగులు సాధించాడు. 2007, 2011 వన్డే వరల్డ్ కప్‌లలో రన్నరప్‌గా నిలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడిగా ఉన్న 36 ఏళ్ల తరంగ 28 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
ఎడ్జ్‌కొనెక్స్‌తో అదానీ జాయింట్ వెంచర్...
దేశీయంగా డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణ కోసం అమెరికాకు చెందిన ఎడ్జ్‌కొనెక్స్‌తో కలిసి జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఎడ్జ్‌కొనెక్స్‌లో భాగమైన ఎడ్జ్‌కొనెక్స్ యూరప్‌తో తమ అనుబంధ సంస్థ డీసీ డెవలప్‌మెంట్ చెన్నై (డీసీడీసీపీఎల్) ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన క్రికెటర్
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : శ్రీలంక జట్టు ఓపెనర్, మాజీ కెప్టెన్ ఉపుల్ తరంగ
ఆస్ట్రేలియా క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో లీసా స్థాలేకర్
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ లీసా స్థాలేకర్ ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకుంది. పుణేలో జన్మించి ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన ఆమె 2001–13 మధ్య కాలంలో 8 టెస్టులు, 125 వన్డేలు, 54 టి20లు ఆడింది. నాలుగు ప్రపంచకప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్లలో ఆమె సభ్యురాలిగా ఉంది. ‘‘తాజా గౌరవంతో బెలిండా క్లార్క్, రోల్టన్, మెలానీలాంటి స్టార్ క్రికెటర్ల సరసన లీసా చేరింది’’ అని ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ చైర్మన్ పీటర్ కింగ్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న క్రికెటర్
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ లీసా స్థాలేకర్
ఎందుకు : క్రికెట్ క్రీడలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను
అలెన్ బోర్డర్ పురస్కారం గెలుచుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్?
ఆస్ట్రేలియా క్రికెట్ ఫిబ్రవరి 6న ప్రకటించిన వార్షిక అవార్డుల్లో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు రెండు పురస్కారాలు లభించాయి. 2020–21 ఏడాదిగానూ మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణించిన స్మిత్‌కు ‘అలెన్ బోర్డర్ మెడల్’ తోపాటు ‘వన్డే ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం దక్కింది. మహిళల విభాగంలో బెత్ మూనీ ‘బెలిండా క్లార్క్’ అవార్డును తొలిసారి గెల్చుకుంది.
2020–21 బిగ్‌బాష్ టైటిల్ విజేత?
వరుసగా రెండో ఏడాది సిడ్నీ సిక్సర్స్ జట్టు... బిగ్‌బాష్ టి20 టోర్నమెంట్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఫిబ్రవరి 6న జరిగిన ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్ జట్టు 27 పరుగుల ఆధిక్యంతో పెర్త్ స్కార్చర్స్ జట్టును ఓడించింది.
36వ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఎక్కడ జరగుతోంది?
36వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2021ను అస్సాంలోని గువాహటిలో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఈ చాంపియన్‌షిప్‌ను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 6న మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన అగసారా నందిని అండర్–18 బాలికల లాంగ్‌జంప్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. నార్సింగిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని అయిన నందిని లాంగ్‌జంప్ ఫైనల్లో 5.80 మీటర్ల దూరం దూకి పసిడి పతకాన్ని దక్కించుకుంది.
లక్ష్మీకి రజత పతకం...
అండర్–18 బాలికల లాంగ్‌జంప్‌లోనే ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన జెమ్మెల లక్ష్మీ రజత పతకం దక్కించుకుంది. అండర్–20 బాలుర షాట్‌పుట్ ఈవెంట్‌లో తెలంగాణకి చెందిన మొహమ్మద్ మోసిన్ ఖురేషీ కాంస్య పతకం సాధించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 36వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2021 ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : గువాహటి, అస్సాం
టోర్నీ చాంపియన్‌గా అవతరించిన జట్టు?
అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) కప్ పురుషుల టీమ్ టోర్నమెంట్‌లో రష్యా జట్టు తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఇటలీ జట్టుతో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఫిబ్రవరి 7న జరిగిన ఫైనల్లో రష్యా 2–0తో విజయం సాధించింది. ఫలితం తేలిపోవడంతో మూడో మ్యాచ్‌గా జరగాల్సిన డబుల్స్ మ్యాచ్‌ను నిర్వహించలేదు.
మాజీ బాక్సర్ లియోన్ స్పింక్స్ కన్నుమూత
అమెరికా ప్రొఫెషనల్ బాక్సర్, 1976 మాంట్రియల్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లియోన్ స్పింక్స్(67) కన్నుమూశాడు. క్యాన్సర్ కారణంగా అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని హెండర్‌సన్‌లో ఫిబ్రవరి 5న తుదిశ్వాస విడిచారు. లియోన్ స్పింక్స్... 1976 మాంట్రియల్ ఒలింపిక్స్‌లో పురుషుల లైట్ హెవీవెయిట్ విభాగంలో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏటీపీ కప్ పురుషుల టీమ్ టోర్నమెంట్‌లో చాంపియన్
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : రష్యా జట్టు
ఎక్కడ : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
రహదారి భద్రత ప్రపంచ టి20 సిరీస్ ఎక్కడ జరగనుంది?
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రహదారి భద్రత ప్రపంచ టి20 సిరీస్‌లో ఆడనున్నాడు. 2021 మార్చి 2 నుంచి 21 వరకు ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. సెహ్వాగ్, లారా, మురళీధరన్, బ్రెట్ లీ, దిల్షాన్ తదితర మాజీ స్టార్ క్రికెటర్లు కూడా పాల్గొంటారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడం కోసం మహారాష్ట్ర రహదారి భద్రత విభాగం, సునీల్ గావాస్కర్‌కు చెందిన పీఎంజీ గ్రూప్ ఈ టోర్నీని ఏర్పాటు చేసింది.
ఉత్తరాఖండ్ కోచ్ పదవికి వసీమ్ జాఫర్ రాజీనామా
భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ ఉత్తరాఖండ్ రంజీ జట్టు కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. జట్టు ఎంపిక విషయాల్లో ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘం (సీఏయూ) సెక్రటరీ, సెలెక్టర్లు జోక్యం ఎక్కువ కావడంతో తాను కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జాఫర్ తెలిపాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2021 మార్చి 2 నుంచి 21 వరకు రహదారి భద్రత ప్రపంచ టి20 సిరీస్
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : మహారాష్ట్ర రహదారి భద్రత విభాగం, పీఎంజీ గ్రూప్
ఎక్కడ : రాయ్‌పూర్, ఛత్తీస్‌ఘడ్
ఎందుకు : రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడం కోసం
షూటర్ దివ్యాన్ష్ ప్రపంచ రికార్డు
జాతీయ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్‌లో... ప్రపంచ నంబర్‌వన్ షూటర్, టోక్యో బెర్త్ హోల్డర్ దివ్యాన్ష్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఫైనల్స్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 10న జరిగిన ఈవెంట్‌లో దివ్యాన్‡్ష ఫైనల్లో 253.1 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలవడంతో పాటు ప్రపంచ రికార్డును తన పేర లిఖించుకున్నాడు. 252.8 పాయింట్లతో హావోనన్ యు (చైనా) పేరిట ఉన్న రికార్డును దివ్యాన్‡్ష సవరించాడు.
హైదరాబాద్ ఎఫ్‌సీ కోచ్‌గా మనొలో...
ఇండియన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) హెడ్ కోచ్‌గా మాన్యుయెల్ మనొలో మార్కెజ్ మరో రెండేళ్లు కొనసాగనున్నారు. ఆయన 2020, ఆగస్టులో హైదరాబాద్ జట్టు కోచ్‌గా నియమితులయ్యారు. తాజా పొడిగింపుతో ఆయన 2022–23 సీజన్ పూర్తయ్యేదాకా జట్టుకు సేవలందిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఫైనల్స్ ప్రపంచ రికార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : దివ్యాన్ష్ సింగ్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : 253.1 పాయింట్లు స్కోరు చేయడంతో
మహిళల 1,500 మీటర్లలో సరికొత్త ప్రపంచ రికార్డు
ఇథియోపియా మహిళా అథ్లెట్ గుడాఫ్ సెగే... 1,500 మీటర్ల ఇండోర్ విభాగంలో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. నార్తర్న్ ఫ్రాన్స్‌లో జరిగిన మీట్‌లో ఆమె 1,500 మీటర్ల పరుగును 3 నిమిషాల 53.09 సెకన్లలో పూర్తి చేసింది. గతంలో యూరోపియన్ ఇండోర్ చాంపియన్ లౌరా ముయిర్ (3ని.59.58 సెకన్లు) పేరిట ఉన్న రికార్డును సెగే సవరించింది.
ఉత్తమ అథ్లెట్లు నందిని, యశ్వంత్...
జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2021లో తెలంగాణ అమ్మాయి అగసారా నందిని అండర్–18 బాలికల విభాగంలో... ఆంధ్రప్రదేశ్ అబ్బాయి యశ్వంత్ కుమార్ అండర్–20 బాలుర విభాగంలో ‘ఉత్తమ అథ్లెట్’ అవార్డులు గెల్చుకున్నారు. అస్సాంలోని గువాహటిలో ఫిబ్రవరి 10న ఈ పోటీలు ముగిశాయి. నందిని ఈ పోటీల్లో లాంగ్‌జంప్, 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. యశ్వంత్ అండర్–20 బాలుర 110 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 1,500 మీటర్ల పరుగు(ఇండోర్)లో సరికొత్త ప్రపంచ రికార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : గుడాఫ్ సెగే
ఎక్కడ : ఫ్రాన్స్
ఎందుకు : 1,500 మీటర్ల పరుగును 3 నిమిషాల 53.09 సెకన్లలో పూర్తి చేసినందుకు
అంపైరింగ్ బాధ్యతలకు రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్?
ఆస్ట్రేలియా అంపైర్ బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్ జనవరి 28న అంతర్జాతీయ క్రికెట్ అంపైరింగ్ బాధ్యతలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2012నుంచి ఐసీసీ ఎలైట్ అంపైర్స్ ప్యానెల్‌లో సభ్యుడిగా ఉన్న ఆయన 15 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 200 అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించారు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లకు పనిచేసిన ఆయనకు బ్రిస్బేన్‌లో భారత్–ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టు చివరిది.
తొలి అంపైర్‌గా...
3 వన్డే ప్రపంచకప్‌లు, 3 టి20 ప్రపంచకప్‌లతో పాటు 2 మహిళల టి20 ప్రపంచకప్‌లలో కూడా ఆక్సెన్‌ఫోర్డ్ అంపైర్‌గా వ్యవహరించారు. మైదానంలో బ్యాట్స్‌మన్ షాట్‌ల నుంచి తప్పించుకునేందుకు ‘ఆర్మ్ షీల్డ్’ను ఉపయోగించిన తొలి అంపైర్‌గా ఆయన గుర్తింపు పొందారు. అంపైర్ కాకముందు క్వీన్స్‌లాండ్ జట్టుకు 8 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన బ్రూస్... ఇకముందు దేశవాళీ మ్యాచ్‌లకు అంపైర్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ర్జాతీయ క్రికెట్ అంపైరింగ్ బాధ్యతలకు రిటైర్మెంట్ ప్రకటన
ఎప్పుడు: జనవరి 28
ఎవరు: ఆస్ట్రేలియా అంపైర్ బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్
ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడిగా ఎంపికైన భారతీయుడు?
ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధ్యక్షుడిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ఎంపికయ్యారు. నజ్ముల్ హసన్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనయుడైన 32 ఏళ్ల జై షా ఏసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన అతి పిన్న వయస్కుడుగా గుర్తింపు పొందారు.
రంజీ ట్రోఫీకి విరామం
దేశవాళీ ప్రతిష్టాత్మక ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ (మూడు లేదా నాలుగు రోజుల మ్యాచ్‌లు) రంజీ ట్రోఫీకి 2020–2021 సీజన్‌లో బీసీసీఐ విరామమిచ్చింది. కరోనా కారణంగా ఈ సీజన్‌లో చాలా సమయం కోల్పోయిన కారణంగా తాజా సీజన్‌లో ఈ మెగా టోర్నమెంట్‌ను నిర్వహించలేమని జనవరి 30న బీసీసీఐ ప్రకటించింది. 1934–35లో రంజీ ట్రోఫీ మొదలైన తర్వాత టోర్నీ నిర్వహించకపోవడం ఇదే తొలిసారి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధ్యక్షుడిగా ఎంపిక
ఎప్పుడు: జనవరి 30
ఎవరు: బీసీసీఐ కార్యదర్శి జై షా
బీఎఫ్‌ఐ అధ్యక్షునిగా ఎన్నికైన వ్యక్తి?
భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) అధ్యక్ష పదవి మరోసారి అజయ్ సింగ్‌కే దక్కింది. స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ చైర్మన్ కూడా అయిన అజయ్ గురుగ్రామ్‌లో ఫిబ్రవరి 3న జరిగిన ఎన్నికల్లో 37–27 ఓట్ల తేడాతో ప్రత్యర్థి, మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ షెలార్‌పై గెలుపొందారు. నాలుగేళ్లపాటు ఆయన అధ్యక్ష పదవిలో ఉంటారు. హేమంత కుమార్ కలీటా (అస్సాం) సమాఖ్య కొత్త జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.

- గతంలో జొకోవిచ్ 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020లలో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు చాంపియన్‌గా నిలిచాడు.
- 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో జొకోవిచ్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న రోజర్ ఫెడరర్, రఫెల్ నాదల్ (20 చొప్పున)కు చేరువయ్యాడు. జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒకసారి... వింబుల్డన్‌లో ఐదుసార్లు... యూఎస్ ఓపెన్‌లో మూడుసార్లు విజేతగా నిలిచాడు.

Published date : 11 Mar 2021 12:34PM