ఫిబ్రవరి 2020 అవార్డ్స్
Sakshi Education
ఆహార రంగంలో కృషికి పురస్కారాలు: బెర్జ్‌ఫోర్స్
ప్రపంచ జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి పరిష్కారాలు సూచించేవారికి ఒక్కొక్కటి 10 లక్షల డాలర్ల (సుమారు రూ.7 కోట్లు) వంతున రెండు పురస్కారాలు ఏటా అందజేస్తామని స్వీడన్‌కి చెందిన ‘కర్ట్ బెర్జ్‌ఫోర్స్ ఫౌండేషన్’ ఫిబ్రవరి 20న ప్రకటించింది. ప్రపంచ ఆహార సరఫరా వ్యవస్థను దెబ్బతీసేలా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సుస్థిర ఆహారానికి తగిన పరిష్కారం చెప్పేవారికి ఒకటి, ఆహార రంగాన్ని సమూలంగా మార్చేసే నవ్యావిష్కరణలకు ఒకటి చొప్పున 2020 ఏడాది నంచే పురస్కారాలను అందిస్తామని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 780 కోట్లు కాగా 2050 నాటికి 1000 కోట్లకు చేరుతుందని అంచనా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆహార రంగంలో కృషికి పురస్కారాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎవరు : కర్ట్ బెర్జ్‌ఫోర్స్ ఫౌండేషన్
మిస్ దివా యూనివర్స్ విజేతగా అడిలైన్
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఫిబ్రవరి 22న జరిగిన ‘లివా మిస్ దివా యూనివర్స్-2020’ పోటీల్లో మంగళూరుకు చెందిన అడిలైన్ క్యాస్టిలినో విజేతగా నిలిచారు. మిస్ దివా సుప్రనేషనల్ కిరీటాన్ని జబల్‌పూర్‌కు చెందిన ఆవృతి చౌదరి గెలుచుకున్నారు. పుణేకు చెందిన నేహా జైస్వాల్ మిస్ దివా రన్నరప్‌గా నిలిచారు. 2020 ఏడాది జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున క్యాస్టిలినో ప్రాతినిథ్యం వహించనుండగా.. ఆవృతి మిస్ సుప్రనేషనల్ పోటీలకు భారత పోటీదారుగా వ్యవహరించనున్నారు. మిస్ దివా పోటీల్లో మాజీ మిస్ యూనివర్స్ లారా దత్తా, ఆంటోనియా పోర్లిడ్, ఆశాభట్, డిజైనర్లు శివన్ భటియా, నరేశ్ కుక్రేజా, నిఖిల్ మెహ్రా, నటులు యామీ గౌతం, ఆదిత్యరాయ్ కపూర్, అనిల్ కపూర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లివా మిస్ దివా యూనివర్స్-2020 విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : అడిలైన్ క్యాస్టిలినో
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ముల్కనూరు పీఏసీఎస్‌కు జాతీయ స్థాయి అవార్డు
వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు ప్రాథమిక సహకార పరపతి సంఘానికి (పీఏసీఎస్) జాతీయ స్థాయి అవార్డు లభించింది. వ్యవసాయ రంగంలో మంచి ప్రగతి సాధిస్తున్న వారి కోసం ఉద్దేశించిన ‘ఔట్‌లుక్ అగ్రికల్చర్ కాన్‌క్లేవ్ అండ్ స్వరాజ్ అవార్డ్స్-2020’లో ఉత్తమ రైతు సహకార సంఘం అవార్డును సాధించింది. ఢిల్లీలో ఫిబ్రవరి 24న జరిగిన ఓ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఎ.ప్రవీణ్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, హరియాణా, మధ్యప్రదేశ్ వ్యవసాయ మంత్రులు జయప్రకాశ్ దలాల్, సచిన్‌యాదవ్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉత్తమ రైతు సహకార సంఘం అవార్డు విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : ముల్కనూరు పీఏసీఎస్
ఎందుకు : వ్యవసాయ రంగంలో మంచి ప్రగతి సాధిస్తున్నందున
రచయిత్రి సత్యవతికి సాహిత్య అకాడమీ అవార్డు
విజయవాడకు చెందిన ప్రముఖ రచయిత్రి పి. సత్యవతికి అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2019 లభించింది. 2013 జనవరి నుంచి 2017 డిసెంబరు వరకు అనువాదం చేసిన రచనల ఆధారంగా ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు ఫిబ్రవరి 24న తెలిపారు. మొత్తం 23 భాషల్లో అనువాదాలను ఎంపికచేయగా.. 23 మంది అనువాద రచయితలను ఈ అవార్డు వరించింది. ‘ది ట్రూత్ అబౌట్ మీ : ఏ హిజ్రా లైఫ్ స్టోరీ’ అనే ఆంగ్ల ఆత్మకథను సత్యవతి తెలుగులో ‘ఒక హిజ్రా ఆత్మకథ’గా అనువదించారు. దీనికే ఈ పురస్కారం లభించింది.
1940లో గుంటూరు జిల్లాలో జన్మించిన సత్యవతి... 200కు పైగా కథలు, అనేక నవలలు రచించారు. ఇల్లు అలకగానే, మంత్రనగరి, పి.సత్యవతి కథలు వంటి కథా సంపుటాలు, ఐదు నవలలతో పాటు అనేక కథలను కూడా అనువదించారు. ఆమె రాసిన ‘వాటిజ్ మై నేమ్’ కథ పదో తరగతిలో పాఠ్యాంశంగా.. ‘విల్ హీ కమ్ హోం’ కథ ఇంటర్‌లో పాఠ్యాంశంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉగాదికి ప్రదానం చేసే కళారత్న (హంస) పురస్కారం, ఇతర పురస్కారాలు ఆమెకు దక్కాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2019
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : పి. సత్యవతి
ఎందుకు : ది ట్రూత్ అబౌట్ మీ : ఏ హిజ్రా లైఫ్ స్టోరీ అనే ఆంగ్ల ఆత్మకథను ఒక హిజ్రా ఆత్మకథగా తెలుగులో అనువదించినందుకు
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానం
తెలుగు రాష్ట్రాలకు చెందిన రచయితలు బండి నారాయణస్వామి, పెన్నా మధుసూదన్ 2019 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. ఢిల్లీలో ఫిబ్రవరి 25న జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబర్ చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకున్నారు. 23 భారతీయ భాషల్లో రచనలకు గాను ఏటా ప్రకటించే సాహిత్య అకాడమీ అవార్డులను 2019, డిసెంబర్ 18న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన బండి నారాయణస్వామి రాయలసీమ చరిత్ర ఆధారంగా తెలుగులో రాసిన శప్తభూమి నవలకు, తెలంగాణ జడ్చర్లకు చెందిన పెన్నా మధుసూదన్ సంస్కృతంలో రాసిన ప్రజ్ఞాచాక్షుషం కావ్యానికి కేంద్ర సాహిత్య పురస్కారాలు లభించాయి.
విజయవాడకు చెందిన ప్రముఖ రచయిత్రి పి.సత్యవతికి ‘ఒక హిజ్రా ఆత్మకథ’ రచనకు గాను అనువాద విభాగంలో సాహిత్య అకాడమీ అవార్డు దక్కిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానం
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : బండి నారాయణస్వామి, పెన్నా మధుసూదన్
ఎక్కడ : న్యూఢిల్లీ
నో బ్యాగ్ డే వీడియోకు జాతీయ అవార్డు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న ‘నో బ్యాగ్ డే’ కార్యక్రమంపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన వీడియో ప్రోగ్రాముకు జాతీయ అవార్డు లభించింది. జాతీయ స్థాయిలో జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) నిర్వహించిన అత్యుత్తమ ఆడియో, వీడియో ప్రోగ్రాములలో ‘నో బ్యాగ్ డే’ వీడియోకు ప్రథమ స్థానం లభించింది. కేరళలోని కొచ్చిలో ఎన్‌సీఈఆర్టీ ఫిబ్రవరి 22 నుంచి 24వ తేదీ వరకు ‘24వ ఆల్ ఇండియా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఆడియో వీడియో ఫెస్టివల్, ఐసీటీ మేళా-2020’ను నిర్వహించింది. ఫిబ్రవరి 24న ఎన్‌సీఈఆర్‌టీ జాయింట్ డెరైక్టర్ అమరేంద్ర బెహర్ చేతుల మీదుగా ఎస్సీఈఆర్టీ డెరైక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌సీఈఆర్టీ జాతీయ అవార్డు విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : ఎస్సీఈఆరీ నో బ్యాగ్ డే కార్యక్రమం
ఎక్కడ : కొచ్చి, కేరళ
ఆదర్శరైతు ఆకేపాటికి సృజనాత్మక రైతు అవార్డు
వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం హస్తవరానికి చెందిన ఆదర్శరైతు ఆకేపాటి వరప్రసాద్‌రెడ్డికి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ) సృజనాత్మక రైతు-2020 అవార్డు లభించింది. 2020 మార్చి 3న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించనున్నారు. దేశవ్యాప్తంగా 47 మంది రైతులు జాతీయస్థాయి అవార్డులకు ఎంపికయ్యారు.
డాక్టర్ కార్ల్ జూన్‌కు జినోమ్ వ్యాలీ అవార్డు
కేన్సర్ మహమ్మారికి వినూత్న చికిత్సను అందుబాటులోకి తెచ్చిన అమెరికా శాస్త్రవేత్త డాక్టర్ కార్ల్ హెచ్.జూన్‌కు జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ-2020 అవార్డు అందించనున్నట్లు బయో ఆసియా నిర్వాహకులు ప్రకటించారు. కార్ల్ జూన్‌తో పాటు ప్రజారోగ్య రంగంలో విశేష కృషి చేసిన అంతర్జాతీయ ఫార్మా కంపెనీ నోవార్టిస్ సీఈవో డాక్టర్ వాస్ నరసింహన్‌లకు కూడా ఈ అవార్డు అందించనున్నట్లు తెలిపారు. ఫార్మా రంగంతోపాటు, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలను విసృ్తతంగా చర్చించే బయో ఆసియా ఆయా రంగాల్లో విశిష్ట కృషి చేసిన వారికి జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డులు అందిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహించే బయో ఆసియా ఇప్పటికే ఆసియా మొత్తానికి అతిపెద్ద జీవశాస్త్ర సంబంధిత వేదికగా పరిణమించిన సంగతి తెలిసిందే. 2020 ఏడాది బయో ఆసియా సమావేశం ఫిబ్రవరి 17 నుంచి మూడు రోజులపాటు జరగనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ-2020 అవార్డు విజేతలు
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : డాక్టర్ కార్ల్ హెచ్.జూన్, డాక్టర్ వాస్ నరసింహన్
ఎందుకు : వైద్య రంగంలో విశేషకృషి చేసినందుకు
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ గిన్నిస్ రికార్డు
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. విజయవాడలోని ఆంధ్రా లయోలా కళాశాల ఆడిటోరియంలో ఫిబ్రవరి 15న నిర్వహించిన కార్యక్రమంలో 8 గంటల్లో 10,217 మంది నుంచి రక్తదాన అంగీకార పత్రాలు స్వీకరించడం ద్వారా గిన్నిస్ రికార్డు నమోదైంది. గిన్నిస్ ప్రతినిధి రిషీనాథ్ నుంచి రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్ డాక్టర్ ఎ.శ్రీధర్‌రెడ్డి, కృష్ణాజిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్‌ను అందుకున్నారు. తొలుత ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని 30 కళాశాలలకు చెందిన విద్యార్థులు రక్తదాన అంగీకార పత్రాలు అందచేయడం ద్వారా గిన్నిస్ రికార్డును సునాయాసంగా అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ గిన్నిస్ రికార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎక్కడ : విజయవాడ
ఎందుకు : 8 గంటల్లో 10,217 మంది నుంచి రక్తదాన అంగీకార పత్రాలు స్వీకరించడం ద్వారా
ఏపీ జలవనరుల శాఖకు సీబీఐపీ అవార్డు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖకు ‘సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇరిగేషన్ అండ్ పవర్’ (సీబీఐపీ) అవార్డు లభించింది. ఢిల్లీలో ఫిబ్రవరి 19న నిర్వహించిన సీబీఐపీ 93వ వార్షికోత్సవంలో కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా, కేంద్ర జల సంఘం చైర్మన్ ఆర్కే జైన్ చేతుల మీదుగా ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి ఈ అవార్డును స్వీకరించారు. దేశంలోనే సమగ్ర నీటి యాజమాన్య విధానాలను అత్యున్నత ప్రమాణాలతో అమలు చేయడం ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసి, ఆయకట్టుకు సమర్థవంతంగా నీళ్లందించినందుకు ఏపీకి ఈ అవార్డు దక్కింది.
మరోవైపు ఏపీ జలవనరుల సమాచారం, నిర్వహణ వ్యవస్థ (ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్)కు సేవలు అందిస్తోన్న ‘వాస్సార్ ల్యాబ్స్’కు అత్యత్తుమ కన్సల్టెన్సీగా అవార్డును ప్రదానం చేశారు.
సీబీఐపీ..
దేశంలో జల వనరులు, విద్యుత్ రంగాల్లో ‘అత్యుత్తమ’ విధానాలను అమలు చేయడానికి సీబీఐపీని కేంద్రం ఏర్పాటు చేసింది. జలవనరుల వినియోగం, విద్యుదుత్పత్తి, సరఫరాల్లో నష్టాల నివారణ తదితర విభాగాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన రాష్ట్రాలను సీబీఐపీ ఎంపిక చేసి అవార్డులు ఇస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ జలవనరుల శాఖకు సీబీఐపీ అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : కేంద్ర జల్ శక్తి శాఖ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : సమగ్ర నీటి యాజమాన్య విధానాలను అమలు చేసినందుకు
ఏపీ పీసీబీకి ఈ-గవర్నెన్స్ అవార్డు
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి ఈ-గవర్నెన్స్ లో జాతీయ అవార్డు లభించింది. ముంబైలో ఫిబ్రవరి 8న జరిగిన జాతీయ సదస్సులో పీసీబీ సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్‌కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సాహ్ని ఈ అవార్డును అందజేశారు. కాలుష్య నియంత్రణకు రియల్ టైమ్ సొల్యూషన్ మానిటరింగ్ సిష్టమ్‌ను (ఆర్‌టీపీఎంఎస్) అమలు చేస్తున్నందుకు పీసీబీకీ ఈ అవార్డు వచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ పీసీబీకి ఈ-గవర్నెన్స్ లో జాతీయ అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : కాలుష్య నియంత్రణకు రియల్ టైమ్ సొల్యూషన్ మానిటరింగ్ సిష్టమ్‌ను (ఆర్‌టీపీఎంఎస్) అమలు చేస్తున్నందుకు
తెలంగాణకు జాతీయ ఈ-గవర్నెన్స్ పురస్కారం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నూతన సాంకేతికతను (ఎమర్జింగ్ టెక్నాలజీ) అనుసరించడంలో తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న ప్రతిభకు జాతీయ ఈ-గవర్నెన్స్ పురస్కారం లభించింది. కేంద్ర అణు ఇంధన, అంతరిక్ష మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా తెలంగాణ ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ ఓఎస్‌డీ రమాదేవి లంకా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ముంబైలో ఫిబ్రవరి 8న ముగిసిన 23వ జాతీయ ఈ-గవర్నెన్స్ 2019 -20 సమావేశాల్లో ఈ అవార్డును అందజేశారు. రాష్ట్రంలోని చిట్‌ఫండ్ కంపెనీల కార్యకలాపాల్లో ‘టీ-చిట్స్’పేరిట నూతన ఐటీ సాంకేతికత ‘బ్లాక్ చెయిన్’వినియోగానికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.
రామగుండం ఎన్టీపీసీకి జాతీయ అవార్డు
ఎన్టీపీసీ 17వ జాతీయస్థాయి ప్రొఫెషనల్ సర్కిల్ సదస్సు- 2020లో ఎన్టీపీసీ రామగుండం సంస్థకు చెందిన సంకల్ప్ జట్టు ద్వితీయ అవార్డు అందుకుంది. మధ్యప్రదేశ్‌లోని ఎన్టీపీసీ ఖర్గోన్‌లో రెండు రోజుల పాటు జరిగిన ప్రొఫెషనల్ సర్కిల్ సదస్సులో 16 జట్లు పాల్గొన్నాయి. ఉపయ్(ఎన్టీపీసీ ఖర్గోన్) జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. ఎన్టీపీసీ రామగుండం జట్టు బెస్ట్ సదరన్ రీజియన్ అవార్డు సొంతం చేసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణకు జాతీయ ఈ-గవర్నెన్స్ పురస్కారం
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : చిట్‌ఫండ్ కంపెనీల కార్యకలాపాల్లో ‘టీ-చిట్స్’పేరిట నూతన ఐటీ సాంకేతికత ‘బ్లాక్ చెయిన్’వినియోగానికి గుర్తింపుగా
సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు మహంతం పురస్కార్
సింగరేణి సంస్థ ఐదేళ్లుగా జాతీయ స్థాయిలో అమ్మకాలు, లాభాల్లో అత్యధిక వృద్ధిరేటు సాధించేలా కృషి చేసిన సంస్థ సీఎండీ శ్రీధర్‌కు ‘భారతీయ మహంతం పురస్కార్ 2019-20 (ది లీడర్)’ అవార్డు లభించింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఫిబ్రవరి 7న జరిగిన ఓ కార్యక్రమంలో మొరాకో రాయబారి అబ్దెలిల్లాహ్ అల్ హోస్ని, మాల్దీవ్‌స రాయబారి మహ్మద్ జిన్నా చేతుల మీదుగా శ్రీధర్ ఈ అవార్డు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారతీయ మహంతం పురస్కార్ 2019-20 (ది లీడర్) విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : సింగరేణి సీఎండీ శ్రీధర్
ఎక్కడ : బ్యాంకాక్, థాయ్‌లాండ్
ఎందుకు : సింగరేణి సంస్థ అమ్మకాలు, లాభాల్లో అత్యధిక వృద్ధిరేటు సాధించేలా కృషి చేసినందుకు
ఏపీఎస్ ఆర్టీసీకి ఏఎస్‌ఆర్టీయూ ఎక్స్‌లెన్స్ అవార్డు
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్‌ఆర్టీయూ) సంస్థ అందించే ప్రతిష్టాత్మక ఎక్స్‌లెన్స్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)కి ప్రథమ స్థానం దక్కింది. ‘ఐటీ ఇన్ డిజిటలైజేషన్’ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ పురస్కారం ఆర్టీసీని వరించింది. ఈ పోటీల్లో దేశంలోని 64 రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు పాల్గొనగా, ఏపీఎస్ ఆర్టీసీకి అవార్డు లభించింది. ఢిల్లీలో జనవరి 31న జరిగిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయమంత్రి విజయ్‌కుమార్ సింగ్ చేతుల మీదుగా ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ఈ అవార్డు కింద రూ.10 లక్షల నగదు పురస్కారం అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏఎస్‌ఆర్టీయూ ఎక్స్‌లెన్స్ అవార్డు విజేత
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఐటీ ఇన్ డిజిటలైజేషన్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు

Published date : 01 Mar 2020 03:05PM