National Level All Style Martial Arts Championship – 2023: నేషనల్ లెవల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ షిప్ –2023
Sakshi Education
తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో నిర్వహించిన 16వ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పెద్దాపురం విద్యార్థులు ప్రతిభ కనబర్చారు.
నేషనల్ లెవల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ షిప్ –2023 పేరిట ఈ నెల 3వ తేదీన పోటీలు నిర్వహించారు. కరాటే కోచ్ పూజిత ఆధ్వర్యంలో ఏడుగురు విద్యార్థులు జాతీయ స్థాయి ప్రతిభ కనపర్చారు. పట్టణానికి చెందిన టి.యోగేష్, పి.లోకేష్, యు.కీర్తి, డి.పూర్ణభాస్కర్ బంగార పతకం, యు.సాహితి, డి.నిఖిల, డి.చైతన్యలు కాంస్య పతకాలను సాధించినట్లు కోచ్ తెలిపారు.
Asian Table Tennis Championships 2023: టేబుల్ టెన్నిస్‌లో భారత జట్టుకు కాంస్యం
Published date : 08 Sep 2023 11:39AM