Skip to main content

జూన్ 2018 అవార్డ్స్

తెలంగాణ పోలీస్‌కు ది బెస్ట్ వెరిఫికేషన్’ అవార్డు
Current Affairs పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రక్రియను నాలుగు రోజుల్లో పూర్తిచేస్తున్నందుకు తెలంగాణ పోలీస్ శాఖకు ‘ది బెస్ట్ వెరిఫికేషన్ 2017-18’ అవార్డును కేంద్ర విదేశాంగ శాఖ జూన్ 22న ప్రకటించింది. దీంతో వరుసగా మూడోసారి పోలీస్ శాఖ ఈ అవార్డును అందుకోనుంది. ‘వెరీఫాస్ట్’అనే సాఫ్ట్‌వేర్ ద్వారా కేవలం నాలుగు రోజుల్లోనే పాస్‌పోర్టుకు సంబంధించి పోలీస్ వెరిఫికేషన్‌ను పూర్తి చేస్తున్నారు. జూన్ 24 పాస్‌పోర్టు సేవాదివస్ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ది బెస్ట్ వెరిఫికేషన్ 2017-18 అవార్డు
ఎప్పుడు : జూన్ 22
ఎవరు : తెలంగాణ పోలీస్‌శాఖ
ఎందుకు : పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రక్రియను నాలుగు రోజుల్లో పూర్తిచేస్తున్నందుకు

సాహిత్య అకాడమీ అవార్డులు 2018
2018 సంవ త్సరానికి బాలసాహిత్య పురస్కారాలను నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్, సాహిత్య అకాడమీ జూన్ 22న సంయుక్తంగా ప్రకటించాయి. ఈ మేరకు బాలసాహిత్య పురస్కారాలకు 21 మంది, యువ పురస్కారాలకు 21 మంది ఎంపికయ్యారు. 22 భాషలకు చెందిన సాహితీవేత్తలతో కూడిన జ్యూరీ సభ్యుల బృందం కవితలు, చిట్టి కథలు, నవలలను రాసినవారిని ఎంపిక చేసింది. మాజీ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని నవంబర్ 14 న బాలసాహిత్య పురస్కారాలను ప్రదానం చేస్తారు. అవార్డు కింద తామ్ర పత్రం, రూ.50,000 నగదును ప్రోత్సాహకంగా అందజేస్తారు.
విజయనగరం జిల్లాకి చెందిన బాల సాహితీవేత్త నారంశెట్టి ఉమా మహేశ్వరరావు రాసిన ‘ఆనందలోకం’ అనే బాలల నవలకు బాలసాహిత్య పురస్కారం-2018 దక్కింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో బయాలజీ టీచర్‌గా పనిచేస్తున్న బాలసుధాకర్ మౌళి రచించిన ‘ఆకు కదలని చోటు’ అనే కథా సంపుటికి యువకవి పురస్కారం లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం 2018
ఎప్పుడు : జూన్ 22
ఎవరు : నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్, సాహిత్య అకాడమీ

తెలంగాణకు ర్యాపిడ్ అగ్రికల్చర్ గ్రోత్ పురస్కారం
తక్కువ సమయంలో వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతికి గాను తెలంగాణకు ‘స్టేట్ విత్ ర్యాపిడ్ అగ్రికల్చర్ గ్రోత్’ పురస్కారం దక్కింది. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే ప్రదానం చేసిన ఈ అవార్డును రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి జూన్ 24న ఢిల్లీలో అందుకున్నారు. 23 లక్షల విద్యుత్ కనెక్షన్లకు 24 గంటల పాటు కరెంటు సరఫరా చేస్తూ, కోటి ఎకరాలకు సాగు నీరు అందించేందుకు రూ.లక్షా 50 వేల కోట్లతో గోదావరి, కృష్ణా నదులపై కాళేశ్వరం, సీతారామ, పాలమూరు, రంగారెడ్డి, డిండి వంటి పలు ప్రాజెక్టులు చేపట్టామని పోచారం తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా టుడే ‘స్టేట్ విత్ ర్యాపిడ్ అగ్రికల్చర్ గ్రోత్’ అవార్డు
ఎప్పుడు : జూన్ 23
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎందుకు : తక్కువ సమయంలో వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతికి

దీపికారెడ్డికి సంగీత నాటక అకాడమీ అవార్డు
Current Affairs ప్రఖ్యాత కూచిపూడి నృత్యకళాకారిణి దీపికారెడ్డి ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు -2017కి ఎంపికయ్యారు. ఈ మేరకు కూచిపూడి నృత్యానికి చేసిన సేవలకుగాను దీపికారెడ్డిని కేంద్రప్రభుత్వం జూన్ 19న ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ వెంపటి చిన సత్యం వద్ద కూచిపూడిని నేర్చుకున్న ఆమె దీపాంజలి నృత్య కళాశాల ద్వారా కూచిపూడిలో పలువురికి శిక్షణ ఇచ్చారు. అలాగే దూరదర్శన్‌లో ఏ గ్రేడ్ కళాకారిణిగా గుర్తింపు పొందిన దీపికా ప్రాంతీయ సెన్సార్ బోర్డు, నంది చలనచిత్ర అవార్డు జ్యూరీలలో సభ్యురాలిగా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సంగీత నాటక అకాడమీ అవార్డు -2017
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : కూచిపూడి నృత్యకళాకారిణి దీపికారెడ్డి
ఎందుకు : కూచిపూడి నృత్యానికి చేసిన సేవలకుగాను

65వ ఫిలింఫేర్ అవార్డులు 2018
జియో 65వ సౌత్ ఫిలింఫేర్ అవార్డులను జూన్ 16న హైదరాబాద్‌లో ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జీవిత సాఫల్య పురస్కారాన్ని కైకాల సత్యనారాయణ కు అందచేశారు. ఉత్తమ తెలుగు చిత్రం అవార్డును ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ దక్కించుకోగా ఉత్తమ దర్శకుడి అవార్డు రాజమౌళి (బాహుబలి: ది కన్‌క్లూజన్)కి లభించింది. అలాగే ఉత్తమ నటుడిగా విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి), ఉత్తమ నటిగా సాయి పల్లవి (ఫిదా) ఎంపికయ్యారు. విమర్శకుల ఉత్తమ నటుడు అవార్డు వెంకటేశ్ (గురు), విమర్శకుల ఉత్తమ నటి అవార్డు రితికా సింగ్ (గురు) గెలుచుకున్నారు.
తమిళం ఉత్తమ చిత్రం అవార్డును ‘ఆరమ్ సొంతం చేసుకోగా మలయాళంలో ఉత్తమ నటుడిగా ఫాహిద్ ఫాజల్, కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ అవార్డులను అందుకున్నారు.
తెలుగు సినిమా అవార్డుల జాబితా

జీవితకాల సాఫల్య పురస్కారం

కైకాల సత్యనారాయణ

ఉత్తమ తెలుగు చిత్రం

‘బాహుబలి: ది కన్‌క్లూజన్’

ఉత్తమ దర్శకుడు

రాజమౌళి (బాహుబలి: ది కన్‌క్లూజన్)

ఉత్తమ నటుడు

విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి)

విమర్శకుల ఉత్తమ నటుడు

వెంకటేశ్ (గురు)

ఉత్తమ నటి

సాయి పల్లవి (ఫిదా)

విమర్శకుల ఉత్తమ నటి

రితికా సింగ్ (గురు)

ఉత్తమ సహాయ నటుడు

రానా దగ్గుబాటి (బాహుబలి: ది కన్‌క్లూజన్ )

ఉత్తమ సహాయ నటి

రమ్యకృష్ణ (బాహుబలి: ది కన్‌క్లూజన్)

ఉత్తమ సంగీత దర్శకుడు, సాహిత్యం

కీరవాణి (బాహుబలి: ది కన్‌క్లూజన్)

ఉత్తమ తొలి చిత్ర కథానాయిక

కల్యాణి ప్రియదర్శన్

ఉత్తమ ఛాయాగ్రాహకుడు

సెంథిల్ కుమార్ (బాహుబలి: ది కన్‌క్లూజన్)

ఉత్తమ కొరియోగ్రాఫర్

శేఖర్ (ఖైది నెం:150, ఫిదా)

క్విక్ రివ్యూ:
ఏమిటి : 65వ సౌత్ ఫిలింఫేర్ అవార్డులు 2018
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : జియో
ఎక్కడ : హైదరాబాద్

తెలంగాణ వ్యవసాయశాఖకు అగ్రి’ అవార్డు
తెలంగాణ వ్యవసాయశాఖకు ‘అగ్రి-2018’ అవార్డును ఇండియాటుడే సంస్థ జూన్ 19న ప్రకటించింది. వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, తీసుకుంటున్న చర్యలకు ఈ అవార్డు లభించింది. జూన్ 23న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా టుడే అగ్రి-2018’ అవార్డు
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : తెలంగాణ వ్యవసాయశాఖ
ఎందుకు : వ్యవసాయ అభివృద్ధి కోసం తెలంగాణ తీసుకుంటున్న చర్యలకు

బిందేశ్వర్ పాఠక్‌కు జపాన్ పురస్కారం
ప్రముఖ భారత సామాజిక సేవకుడు, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘నిక్కీ ఏసియా ప్రైజ్ ఫర్ కల్చర్ అండ్ కమ్యూనిటీ’ పురస్కారాన్ని ఈనెల 13న టోక్యోలో ప్రధానం చేశారు. పర్యావరణ హితమైన, తక్కువ వ్యయంతో కూడిన మరుగు దొడ్లను లక్షలాది మందికి అందుబాటులోకి తెచ్చారు. ఆసియాలో ప్రాంతీయ వృద్ధి, సైన్స్, టెక్నాలజీ, నవకల్పన, సామాజిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అందించే ఈ బహుమతిని గతంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అందుకున్నారు.

కోహ్లీకీ బీసీసీఐ బెస్ట్ క్రికెటర్ అవార్డు
Current Affairs భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంతర్జాతీయ క్రికెటర్ అవార్డు 2016-17, 2017-18 సీజన్లకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి జూన్ 7న ఎంపికయ్యాడు. అలాగే మహిళల కేటగిరీలో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్లుగా 2016-17లో హర్మన్‌ప్రీత్ కౌర్, 2017-18లో స్మృతి మంధాన ఎంపికయ్యారు.
మరోవైపు జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ 2016-17కి హైదరాబాద్ చెందిన ఠాకూర్ తిలక్‌వర్మ ఎంపికయ్యాడు. జీవిత సాఫల్య పురస్కారం 2016-17 సీజన్‌లో సీఓఏ కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీ ఎంపికవగా ఆమె ఈ అవార్డును తిరస్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బీసీసీఐ బెస్ట్ క్రికెటర్ (పాలీ ఉమ్రిగర్) అవార్డు
ఎప్పుడు : 2016-17, 2017-18 సీజన్లకు
ఎవరు : విరాట్ కోహ్లీ

అనుపమ్‌కు ఐఫా’ జీవిత సాఫల్య పురస్కారం
ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కు ఇంటర్నేషనల్ ఇండియా ిఫిల్మ్ అకాడమీ (ఐఫా) జీవిత సాఫల్య పురస్కారం లభించింది. అనుపమ్ సుమారు 500కి పైగా చిత్రాల్లో నటించారు. ఈ ఏడాది బ్యాంకాక్‌లో జరిగే ఐఫా వేడుకల్లో ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఫా జీవిత సాఫల్య పురస్కారం 2018
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్

పుతిన్‌కు చైనా అత్యున్నత పురస్కారం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చైనా అత్యున్నత పురస్కారమైన ‘ఫ్రెండ్‌షిప్ మెడల్’ ను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ జూన్ 8న బీజింగ్‌లో ప్రదానం చేశాడు. శాంతియుతమైన ప్రపంచం కోసం పుతిన్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. చైనా ఈ మెడల్‌ను ప్రదానం చేయడం ఇదే తొలిసారి. 2017లో రష్యా అత్నున్నత పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ’ ని జిన్‌పింగ్‌కు పుతిన్ ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనా ‘ఫ్రెండ్‌షిప్ మెడల్’ పురస్కారం
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
ఎక్కడ : గ్రేట్‌హాల్ ఆఫ్ పీపుల్ భవనం, బీజింగ్
ఎందుకు : శాంతియుతమైన ప్రపంచం కోసం కృషి చేసినందుకు

జ్యోతి సురేఖకు ఎక్సలెన్సీ అవార్డు
అంతర్జాతీయ విలువిద్య క్రీడలో వరుస విజయాలు సాధిస్తున్న కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయ క్రీడాకారిణి వెన్నెం జ్యోతి సురేఖకు ముంబైకి చెందిన అన్‌బౌండ్ మీడియా సంస్థ ఎక్సలెన్సీ అవార్డును ప్రదానం చేసింది. ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జూన్ 10న నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డు అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జ్యోతి సురేఖకు ఎక్సలెన్సీ అవార్డు
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : అన్‌బౌండ్ మీడియా సంస్థ

సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు గ్లోబల్’ అవార్డు
సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్‌కు ‘ఔట్ స్టాండింగ్ గ్లోబల్ లీడర్‌షిప్’ అవార్డు దక్కింది. ఈ మేరకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ జూన్ 9న ఒక ప్రకటన విడుదల చేసింది. జూన్ 28న దుబాయిలో జరిగే గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్‌లో శ్రీధర్‌కు అవార్డుతోపాటు సింగరేణి సంస్థకు గోల్డ్ మెడల్‌ను అందించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఔట్ స్టాండింగ్ గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు
ఎప్పుడు : జూన్ 9
ఎవరు : సీఎండీ శ్రీధర్

కేరళ కార్టూనిస్టుకి అంతర్జాతీయ అవార్డు
Current Affairs కేరళ కార్టూనిస్టు థామస్ ఆంటోనీ కి కేరికేచర్ కేటగిరీలో వరల్డ్ ప్రెస్ కార్టూన్ అవార్డు లభించింది. ఈ మేరకు పోర్చుగల్ రాజధాని లిస్బన్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఆంటోనీని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. థామస్ మలయాళ పత్రిక మెట్రోవార్తలో ఎగ్జిక్యూటివ్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న వార, దినపత్రికల్లో 2016లో ప్రచురితమైన కార్టూన్లలో ఉత్తమమైన వాటికి, ఫేక్ న్యూస్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ కేటగిరీలో ఈ అవార్డులను ప్రకటించారు. యూరప్, ఆసియా, దక్షిణ అమెరికా ఖండాల్లోని ఎనిమిది దేశాలకు చెందినవారికి ఈ పురస్కారాలు దక్కగా ఆసియా నుంచి థామస్ ఆంటోనీ ఎంపికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేరళ కార్టూనిస్టుకి అంతర్జాతీయ అవార్డు
ఎప్పుడు : మే 30
ఎవరు : థామస్ ఆంటోనీ
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

వృక్ష శాస్త్రవేత్త కమల్‌జిత్ బవాకు లిన్నేయన్ మెడల్
భారత వృక్ష శాస్త్రవేత్త కమల్‌జిత్ బవాకు ప్రఖ్యాత లిన్నేయన్ మెడల్ లభించింది. సొసైటీ ఆఫ్ లండన్ ప్రదానం చేసే ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు బవా. ఈయన ప్రస్తుతం బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ద ఎన్విరాన్‌మెంట్’కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఉష్ణ ప్రదేశాల్లో మొక్కల పరిణామ క్రమం, అటవీ క్షీణత, కలప రకానికి చెందిన అటవీ ఉత్పత్తులు, మధ్య అమెరికా, పశ్చిమ కనుములు, తూర్పు హిమాలయాల్లోని అడవుల్లో జీవ వైవిధ్యంపై చేసిన కృషికి గాను ఆయనకు ఈ బహుమతి దక్కింది.
Published date : 03 Jul 2018 05:44PM

Photo Stories