జూలై 2020 అవార్డ్స్
Sakshi Education
వైరా కేవీకేకు దీన్ దయాల్ ప్రోత్సాహన్ అవార్డు
రైతులకు ఉత్తమ విస్తరణ, వైజ్ఞానిక సేవలు అందించినందుకుగాను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రతిష్టాత్మకమైన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ కృషి ప్రోత్సాహన్ అవార్డు పొందింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) 92వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని జూలై 16న ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరె¯Œ్స ద్వారా జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఈ అవార్డును ప్రకటించారు. అలాగే జమ్మికుంట కేవీకేలో డ్రై కన్వర్టేడ్ వైట్ రైస్ విధానంలో వరి సాగు చేయడమే కాక, సోషల్ మీడియా ద్వారా ఇతర జిల్లాల రైతులను కూడా ఈ పద్ధతి వైపు మళ్లించేందుకు చేసిన కృషికిగాను మహిళా రైతు ఆర్.లక్ష్మీఐసీఏఆర్ అవార్డు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ కృషి ప్రోత్సాహన్ అవార్డు విజేత
ఎప్పుడు: జూలై 16
ఎవరు: ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)
ఎందుకు: రైతులకు ఉత్తమ విస్తరణ, వైజ్ఞానిక సేవలు అందించినందుకుగాను
గిన్నిస్ రికార్డుల్లోకి 2018-19 టైగర్ సర్వే
భారత్‌లో పులుల సంఖ్యను లెక్కించేందుకు 2018-19లో భారత ప్రభుత్వం నిర్వహించిన సర్వే.. గిన్నిస్ ప్రపంచరికార్డు సృష్టించింది. ప్రపంచంలో అతిపెద్ద కెమెరా ట్రాపింగ్ వైల్డ్‌లైఫ్ సర్వేగా ఇది రికార్డుకెక్కింది. దేశంలో 2,967 పులులు ఉన్నట్లు సర్వే తేల్చింది. ప్రపంచంలోని మొత్తం పులుల్లో 75 శాతం పులులు భారత్‌లో ఉన్నాయి. పులుల గణన సర్వే 2018-19లో భాగంగా 1,21,337 చదరపు కిలోమీటర్ల (46,848 చదరపు మైళ్లు) విస్తీర్ణంలో 26,838 ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి 34,858,623 ఫొటోలను చిత్రీకరించాయి. ఇందులో 76,651 ఫొటోలు పులులకు సంబంధించినవి.
చదవండి: 2018-19 పులుల గణన నివేదిక-సమగ్ర సమాచారం
క్విక్ రివ్యూ :
ఏమిటి : అతిపెద్ద కెమెరా ట్రాపింగ్ వైల్డ్‌లైఫ్ సర్వేగా గిన్నిస్ రికార్డు
ఎప్పుడు : జూలై 11
ఎవరు : 2018-19 టైగర్ సర్వే
టాటా చంద్రశేఖరన్‌కు యూఎస్‌ఐబీసీ అవార్డు
టాటా గ్రూపు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, లాక్‌హీడ్ మార్టిన్ సీఈవో జిమ్ టైక్లెట్ 2020 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక యూఎస్‌ఐబీసీ గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు అందుకోనున్నారు. ఈ విషయాన్ని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్‌ఐబీసీ) జూలై 14న ప్రకటించింది. ‘‘అద్భుతమైన నాయకత్వం, భారత్-అమెరికా సంబంధాల పురోగతికి కృషి చేసిన వారికి గుర్తింపుగా ఏటా యూఎస్‌ఐబీసీ గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డులను అందించడం కొనసాగుతోంది’’ అని యూఎస్‌ఐబీసీ తెలిపింది. ఎన్.చంద్రశేఖరన్, జిమ్ టైక్లెట్ ఇద్దరూ యూఎస్ ఇండియా సీఈవో ఫోరమ్‌కు సహ అధ్యక్షులుగా ఉన్నారు. గతంలో సన్‌ఫార్మా దిలీప్ సంఘ్వి, గూగుల్ సుందర్ పిచాయ్, అమెజాన్ జెఫ్ బెజోస్ తదితరులు ఈ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎస్‌ఐబీసీ గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు విజేతలు
ఎప్పుడు : జూలై 14
ఎవరు : నటరాజన్ చంద్రశేఖరన్, జిమ్ టైక్లెట్
ఎందుకు : అద్భుతమైన నాయకత్వం, భారత్-అమెరికా సంబంధాల పురోగతికి కృషి చేసిన వారికి గుర్తింపుగా
ఇస్రో చైర్మన్ శివన్‌కు వాన్ కర్మన్ పురస్కారం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ కైలాసవాడివో శివన్‌కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వాన్ కర్మన్ అవార్డు-2020 లభించింది. స్పేస్ టెక్నాలజీలో విశేష కృషి చేసినందుకుగాను శివన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్టోన్రాటిక్స్ సంస్థ (ఐఏఏ) ప్రకటించింది. 2021, మార్చిలో పారిస్ వేదికగా జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును శివన్‌కు అందజేయనున్నారు. ఐఏఏ 1982 నుంచి ఏటా ఈ పురస్కారాన్ని స్పేస్ టెక్నాలజీలో మహోన్నత విజయాలు సాధించిన వారికి జీవితకాల అవార్డుగా అందజేస్తోంది. ఏరో డైనమిక్స్‌లో అమెరికాకు చెందిన థియోడర్ వాన్ కర్మన్ అనే ఏరో స్పేస్ ఇంజినీర్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును నెలకొల్పారు. గతంలో భారత్ నుంచి ఈ అవార్డును యూఆర్ రావు, కస్తూరి రంగన్ అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వాన్ కర్మన్ అవార్డు-2020 విజేత
ఎప్పుడు : జూలై 14
ఎవరు : ఇస్రో చైర్మన్ కైలాసవాడివో శివన్
ఎందుకు : స్పేస్ టెక్నాలజీలో విశేష కృషి చేసినందుకుగాను

Published date : 18 Aug 2020 03:18PM