జనవరి 2021 స్పోర్ట్స్
Sakshi Education
రాజస్తాన్ రాయల్స్ డెరైక్టర్‌గా శ్రీలంక క్రికెటర్
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కరను ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ తమ టీమ్ డెరైక్టర్‌గా నియమించింది. 2015లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 46 ఏళ్ల సంగక్కర ప్రస్తుతం మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో (అన్ని ఫార్మాట్లు) అతను 28,000 పైచిలుకు పరుగులు చేశాడు.
పార్టీ నుంచి ఓలి బహిష్కరణ
నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలిని బహిష్కరించాలని మాజీ ప్రధాని ప్రచండ(పుష్ప కమల్ దహల్) నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గం జనవరి 24న నిర్ణయించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందవల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమ్యూనిస్ట్ పార్టీ తెలిపింది. ఓలిని కమ్యూనిస్ట్ పార్టీ సహ అధ్యక్ష పదవి నుంచి 2020, డిసెంబర్‌లో తొలగించిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ: 2020-21 విజేత?
భారత క్రికెట్ జట్టు టెస్టు క్రికెట్ చరిత్రలో మరో విజయాన్ని అందుకుంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ: 2020-21 విజేతగా భారత్ జట్టు నిలిచింది. ట్రోఫీ నిర్వహణలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. జనవరి 19న ముగిసిన చివరి టెస్టులో భారత్ విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ రెండింటిని గెలుచుకోగా.. ఆస్ట్రేలియా ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. మరోక మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సిరీస్‌లో అత్యధికంగా 21 వికెట్లు పడగొట్టిన ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా) ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు.
ఈ నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహించగా, ఆస్ట్రేలియా జట్టుకు టిమ్ పైన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. చివరి మ్యాచ్ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో ఉన్న బ్రిస్బేన్‌లో జరిగింది. బ్రిస్బేన్ మైదానంలో భారత జట్టుకిదే తొలి టెస్టు విజయం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బోర్డర్-గావస్కర్ ట్రోఫీ: 2020-21 విజేత
ఎప్పుడు : జనవరి 19
ఎవరు : భారత క్రికెట్ జట్టు
ఎక్కడ : ఆస్ట్రేలియా
జీవించి ఉన్న ఒలింపిక్ చాంపియన్స్ లో అతిపెద్ద వయస్కురాలు?
హంగేరి మహిళా జిమ్నాస్ట్ అగ్నెస్ కెలెటి జీవించి ఉన్న ఒలింపిక్ చాంపియన్స్ లో అతిపెద్ద వయస్కురాలుగా గుర్తింపు పొందారు. హంగేరిలోని బుడాపెస్ట్‌లో జనవరి 9న కెలెటి తన 100వ పుట్టినరోజును జరుపుకుంది. 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో కెలెటి ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్యాలు సాధించింది. అలాగే 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు సాధించింది. 1957లో ఇజ్రాయెల్‌కు వలస వెళ్లిన ఆమె 2015లో హంగేరికి తిరిగివచ్చింది.
హంగేరి రాజధాని: బుడాపెస్ట్; కరెన్సీ: ఫోరింట్
హంగేరి ప్రస్తుత అధ్యక్షుడు: జెనోస్ ఓడర్
హంగేరి ప్రస్తుత ప్రధానమంత్రి: విక్టర్ ఓర్బన్
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీవించి ఉన్న ఒలింపిక్ చాంపియన్స్ లో అతిపెద్ద వయస్కురాలు
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : హంగేరి మహిళా జిమ్నాస్ట్ అగ్నెస్ కెలెటి
దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభం
భారత దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జనవరి 10న ప్రారంభమైంది. దేశంలోని ఆరు నగరాల్లో జరిగే ఈ టోర్నీని కరోనా నేపథ్య పరిస్థితుల్లో ‘బయో బబుల్’ వాతావరణంలో నిర్వహిస్తున్నారు. ఏ వేదికలోనూ ప్రేక్షకులకు ప్రవేశం లేదు. జనవరి 26 నుంచి నాకౌట్ దశ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌లోని మొతెరా సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తారు. జనవరి 31న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది.
టోర్నీ నిర్వహణలో భాగంగా... మొత్తం 38 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. ఆరేసి జట్లతో కూడుకున్న ఐదు ఎలైట్ గ్రూప్‌లు... ఎనిమిది జట్లతో కూడిన ఒక ప్లేట్ గ్రూప్ ఉంది.
జట్ల వివరాలు-వేదికలు
ఎలైట్ గ్రూప్ ‘ఎ’: జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, కర్ణాటక, రైల్వేస్, త్రిపుర.
వేదిక: బెంగళూరు
ఎలైట్ గ్రూప్ ‘బి’: హైదరాబాద్, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్, తమిళనాడు, అస్సాం.
వేదిక: కోల్‌కతా
ఎలైట్ గ్రూప్ ‘సి’: గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, బరోడా, ఉత్తరాఖండ్.
వేదిక: వడోదర
ఎలైట్ గ్రూప్ ‘డి’: సర్వీసెస్, సౌరాష్ట్ర, విదర్భ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గోవా. వేదిక: ఇండోర్
ఎలైట్ గ్రూప్ ‘ఇ’: ఆంధ్ర, హరియాణా, ముంబై, ఢిల్లీ, కేరళ, పుదుచ్చేరి. వేదిక: ముంబై
ప్లేట్ గ్రూప్: మేఘాలయ, చండీగఢ్, బిహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్.
వేదిక: చెన్నై
రవిశాస్త్రిపై పుస్తకం...
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్, మాజీ క్రికెటర్ రవిశాస్త్రి క్రికెట్ కెరీర్‌పై పుస్తకం రానుంది. 2021 ఏడాది వేసవిలో ఈ పుస్తకం ద్వారా తన క్రికెట్ జీవితం గురించి ఎవరికీ తెలియని పలు ఆసక్తికర విషయాలను శాస్త్రి బయటపెట్టనున్నాడు. ఈ పుస్తకానికి సహ రచయితగా స్పోర్ట్స్ జర్నలిస్ట్ అయాజ్ మెమన్ వ్యవహరించనుండగా... హార్పర్ కోలిన్స్ ఇండియా పబ్లిషర్‌గా ఉండనుంది.

Published date : 02 Mar 2021 03:47PM