Skip to main content

Hari Chand: మాజీ ఒలింపియన్‌ హరిచంద్‌ కన్నుమూత

India's long-distance runner, Olympian Hari Chand dies at 69
India's long-distance runner, Olympian Hari Chand dies at 69

మాజీ ఒలింపియన్‌ హరిచంద్‌ కన్నుమూశారు. ఆయన వయసు 69 ఏళ్లు. పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌కు చెందిన హరి లాంగ్‌డిస్టెన్స్‌ పరుగులో పలు రికార్డులు నెలకొల్పారు. 1976 మాంట్రియల్, 1980 మాస్కో ఒలింపిక్స్‌లో మెరిసిన ఆయన.. 1978 ఆసియా క్రీడల్లో 5వేల మీటర్లు, 10వేల మీటర్ల పరుగులో స్వర్ణ పతకాలు సాధించారు. మాంట్రియల్‌ ఒలింపిక్స్‌లో 28 నిమిషాల 48.72 సెకన్లలో 10 వేల మీటర్ల పరుగును పూర్తి చేసి.. జాతీయ రికార్డు నెలకొల్పారు. ఈ రికార్డు 32ఏళ్ల పాటు నిలిచింది. మాంట్రియల్‌ క్రీడల్లో హీట్స్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచిన హరి..ఆ తర్వాత మాస్కో ఒలింపిక్స్‌లో(29 నిమిషాల 45.8 సెకన్లు) హీట్స్‌లో పదో స్థానం సాధించారు.

GK Sports Quiz: తమ క్రీడాకారులను ఆసియా క్రీడలకు పంపడానికి నిరాకరించిన దేశం?

Published date : 23 Jun 2022 03:35PM

Photo Stories