Skip to main content

India International Challenge: రన్నరప్‌గా సిక్కి రెడ్డి, రుత్విక

బెంగళూరు: ఇండియా ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణులు గద్దె రుత్విక శివాని, సిక్కి రెడ్డి రజత పతకాలు సాధించారు.
India International Challenge Sikki Reddy, Ruthvika as runners-up
India International Challenge Sikki Reddy, Ruthvika as runners-up

అక్టోబర్ 15న జరిగిన ఫైనల్స్‌లో రుతి్వక శివాని మహిళల సింగిల్స్‌లో... సిక్కి రెడ్డి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఓడిపోయారు. సింగిల్స్‌ తుది పోరులో రుత్విక 19–21, 21–17, 17–21తో తాన్యా (భారత్‌) చేతిలో ఓటమి చవిచూడగా... మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్‌ కపూర్‌ (భారత్‌) జోడీ 16–21, 21–11, 18–21తో అశ్విని పొన్నప్ప–సాయిప్రతీక్‌ (భారత్‌) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో సౌరభ్‌ వర్మ 21–18, 17–21, 21–16తో మిథున్‌ మంజునాథ్‌ను ఓడించి విజేతగా నిలిచాడు.

Also read: ISSF World Championship 2022:18 ఏళ్లకే ప్రపంచ చాంపియన్‌ రుద్రాంక్ష్

Published date : 17 Oct 2022 06:14PM

Photo Stories