WPL 2023: గుజరాత్ జెయింట్స్ కెప్టెన్‌గా బెత్ మూనీ
Sakshi Education
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్టీలో పాల్గొనే గుజరాత్ జెయింట్స్ జట్టుకు ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ కెప్టెన్‌గా.. భారత ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలో తొలి డబ్ల్యూపీఎల్ జరగనుంది. 29 ఏళ్ల మూనీ ఇప్పటి వరకు 83 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలు, 18 అర్ధ సెంచరీల సహాయంతో 2,380 పరుగులు చేసింది.
Published date : 28 Feb 2023 01:06PM