Skip to main content

Football: కరీమ్‌ బెంజెమాకు ‘గోల్డెన్‌ బాల్‌’

యూరోపియన్‌ అత్యుత్తమ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌కు ప్రదానం చేసే ప్రతిష్టాత్మక పురస్కారం ‘గోల్డెన్‌ బాల్‌’ను ఫ్రాన్స్‌ స్టార్‌ ఆటగాడు, రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్‌ జట్టు సభ్యుడు కరీమ్‌ బెంజెమా సొంతం చేసుకున్నాడు.
Football Golden Ball for Karim Benzema
Football Golden Ball for Karim Benzema

గత సీజన్‌లో చాంపియన్స్‌ లీగ్‌ టైటిల్‌ను, స్పానిష్‌ లీగ్‌ టైటిల్స్‌ను మాడ్రిడ్‌ క్లబ్‌ గెల్చుకోవడంలో 34 ఏళ్ల కరీమ్‌ కీలకపాత్ర పోషించాడు. 2009 నుంచి మాడ్రిడ్‌ జట్టుకు ఆడుతున్న కరీమ్‌ 223 గోల్స్‌ సాధించాడు. 24 ఏళ్ల తర్వాత (1998లో జిదాన్‌) ఫ్రాన్స్‌ ప్లేయర్‌కు ‘గోల్డెన్‌ బాల్‌’ అవార్డు లభించింది.   

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 19 Oct 2022 06:08PM

Photo Stories