FIH Pro League: Indian women's hockey team : భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం

అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) మహిళల ప్రొ లీగ్‌లో పాల్గొన్న తొలిసారే భారత మహిళల జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. అమెరికా జట్టుతో బుధవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున వందన కటారియా (39వ, 54వ ని.లో) రెండు గోల్స్ చేయగా... సోనిక (54వ ని.లో), సంగీతా కుమారి (58వ ని.లో) ఒక్కో గోల్ కొట్టారు. తొమ్మిది జట్లు పాల్గొన్న ఈ ప్రొ లీగ్‌లో భారత్ 14 మ్యాచ్‌లు ఆడి నిరీ్ణత సమయంలోపు ఆరింటిలో విజయం సాధించింది. ‘డ్రా’గా ముగిసిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలో ‘షూటౌట్’లో గెలిచి, రెండింటిలో ‘షూటౌట్’లో ఓడిపోయింది. నిరీ్ణత సమయంలోపు నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఓవరాల్‌గా 30 పాయింట్లతో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 42 పాయింట్లతో అర్జెంటీనా టైటిల్ నిలబెట్టుకోగా... 35 పాయింట్లతో నెదర్లాండ్స్ రన్నరప్‌గా నిలిచింది.
Also read: Arti Prabhakar: అమెరికాలో తొలిసారిగా డైరెక్టర్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ హెడ్ అయిన వ్యక్తి