Skip to main content

ఏప్రిల్ 2019 అవార్డ్స్

చెన్నకేశవరావుకు అంబేడ్కర్ జాతీయ అవార్డు
Current Affairs ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షెడ్యూల్డ్ కులాల రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు కె.చెన్నకేశవరావుకు అంబేడ్కర్ రత్న జాతీయ అవార్డు లభించింది. అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా బెంగళూరులో ఏప్రిల్ 22న నిర్వహించిన కార్యక్రమంలో చెన్నకేశవరావుకు ఈ అవార్డును అందజేశారు. కొన్నేళ్లుగా ఆయన ఏపీలో దళిత హక్కుల సొసైటీ ద్వారా పోరాటాలు చేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంబేడ్కర్ రత్న జాతీయ అవార్డు
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : కె.చెన్నకేశవరావు

మిషన్ భగీరథకు హడ్కో అవార్డు
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టుకి కేంద్ర గృహనిర్మాణ, నగరాభివృద్ధి సంస్థ (హడ్కో) అవార్డు లభించింది. ఢిల్లీలో ఏప్రిల్ 25న జరిగిన 49వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. దీంతో మిషన్ భగీరథకి మూడోసారి హడ్కో అవార్డు లభించినట్లయింది. మౌలిక వసతుల కల్పనలో వినూత్న విధానాలను అమలుచేస్తున్న రాష్ట్రాలకు ప్రతీ ఏటా హడ్కో అవార్డు ఇస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర గృహనిర్మాణ, నగరాభివృద్ధి సంస్థ (హడ్కో) అవార్డు
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : మిషన్ భగీరథ ప్రాజెక్టు

కవి శివారెడ్డికి సరస్వతీ సమ్మాన్
Current Affairs గుంటూరుకి చెందిన ప్రముఖ కవి కె. శివారెడ్డికి ప్రతిష్టాత్మక సరస్వతీ సమ్మాన్-2018 పుస్కారం లభించింది. ఆయన రచించిన ‘పక్కకి ఒత్తిగిలితే...’ అనే కవితా సంపుటి గాను ఈ అవార్డు దక్కింది. 2016లో ఈ కవితా సంపుటి విడుదలైంది. ఒక తెలుగు రచనకు ఈ పురస్కారం లభించడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా 22 భాషల్లో వెలువడే రచనల్లోంచి మంచి సాహితీ విలువలతో కూడిన రచనలకు కేకే బిర్లా ఫౌండేషన్ సరస్వతీ సమ్మాన్‌ను అందజేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సరస్వతీ సమ్మాన్-2018 పుస్కారం
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : కె. శివారెడ్డి
ఎందుకు : ‘పక్కకి ఒత్తిగిలితే...’ అనే కవితా సంపుటి రచనకు

ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పురస్కారం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రష్యా దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ ద అపోస్తల్’ లభించింది. భారత్, రష్యాల మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామాన్ని మరింత బలోపేతం చేయడంలో మోదీ అసమాన కృషి చేసినందుకుగాను ఆయనను ఈ పురస్కారంతో గౌరవించనున్నట్టు రష్యా ప్రభుత్వం ఏప్రిల్ 12న ప్రకటించింది. భారత్, రష్యా స్నేహ సంబంధాల పునాదులు బలంగా ఉన్నాయని, భవిష్యత్తులో ఇవి మరింత వెలుగొందుతాయని ఈ సందర్భంగా మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాని మోదీకి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ ద అపోస్తల్ పురస్కారం
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : రష్యా
ఎందుకు : భారత్, రష్యాల వ్యూహాత్మక భాగస్వామాన్ని బలోపేతం చేయడంలో కృషి చేసినందుకుగాను

న్యూయార్క్ టైమ్స్‌కు పులిట్జర్ అవార్డు
ది న్యూయార్క్ టైమ్స్, ది వాల్ స్ట్రీట్ జర్నల్‌లకు పులిట్జర్ అవార్డు-2018 లభించింది. అమెరికాలో న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో ఏప్రిల్ 16న జరిగిన కార్యక్రమంలో అవార్డులను బోర్డు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబానికి సంబంధించి ఆస్తుల గురించి వివరాలను ప్రపంచానికి వెల్లడించినందుకు న్యూయార్క్ టైమ్స్‌కు ఈ అవార్డు దక్కింది.
మరోవైపు సమాజ సేవ కేటగిరీలో సౌత్ ఫ్లోరిడా సన్ సెంటినెల్ పత్రిక అవార్డు దక్కింది. ఫ్లోరిడాలోని పార్క్‌లాండ్‌లో ఉన్న ఓ పాఠశాలలో 2018 ఫిబ్రవరిలో జరిగిన కాల్పుల ఉదంతంలో స్కూల్ యాజమాన్యం, అధికారుల వైఫల్యంపై కథనాలు ప్రచురించినందుకుగాను సెంటినెల్ పత్రికకు అవార్డును ప్రకటించారు. అలాగే బ్రేకింగ్ న్యూస్ కేటగిరీలో పిట్స్‌బర్గ్ పోస్ట్ గెజిట్‌కు పులిట్జర్ అవార్డు వచ్చింది. సినగాగ్‌లో 2018 అక్టోబర్‌లో జరిగిన కాల్పుల ఉదంతాన్ని కవర్ చేసినందుకుగాను గెజిట్‌కు ఈ అవార్డు లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పులిట్జర్ అవార్డు-2018
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : ది న్యూయార్క్ టైమ్స్, ది వాల్ స్ట్రీట్ జర్నల్

ప్రధాని మోదీకి యూఏఈ అతున్నత పుర స్కారం
Current Affairs భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అత్యున్నత పురస్కారం ‘జాయెద్ మెడల్’ లభించింది. ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి విశేషంగా కృషి చేసినందుకు గుర్తింపుగా మోదీని ఈ పురస్కారంతో గౌరవిస్తున్నట్లు యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా జాయెద్ అల్ నహ్యాన్ ఏప్రిల్ 4న ప్రకటించారు. యూఏఈ-భారత్ మధ్య చారిత్రక, సమగ్ర వ్యూహాత్మక సంబంధాలను మోదీ అత్యున్నత స్థాయికి చేర్చారని అబూధాబీ యువరాజు, యూఏఈ సైనిక దళాల డిప్యూటీ కమాండర్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేర్కొన్నారు. వివిధ దేశాల అధినేతలు, అధ్యక్షులు, రాజులకు యూఏఈ జాయెద్ మెడల్‌ను అందజేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాని నరేంద్ర మోదీకి జాయెద్ మెడల్
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకు

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు స్కైట్రాక్స్ అవార్డులు
Current Affairs జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు-జీహెచ్‌ఐఎల్ (శంషాబాద్ ఎయిర్‌పోర్టు)కు రెండు స్కైట్రాక్స్ అవార్డులు లభించాయి. లండన్‌లో మార్చి 28న నిర్వహించిన ప్యాసింజర్ ఎక్స్‌పో కార్యక్రమంలో జీహెచ్‌ఐఎల్‌కు ఈ అవార్డులను అందజేశారు. దేశంలో ప్రాంతీయ విమానాశ్రయాల విభాగంలో ఉత్తమఎయిర్‌పోర్టుగా జీహెచ్‌ఐఎల్ పురస్కారం గెలుచుకుంది. అలాగే విమానాశ్రయ సిబ్బంది సేవల విభాగంలో మధ్య ఆసియాలోనే మెరుగైన విమానాశ్రయంగాను జీహెచ్‌ఐఎల్‌కు అవార్డు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో అందుతున్న సేవలపై స్కైట్రాక్స్ ఈ పుర స్కాలను ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెండు స్కైట్రాక్స్ అవార్డుల విజేత
ఎప్పుడు : మార్చి 28
ఎవరు : జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు-జీహెచ్‌ఐఎల్
ఎక్కడ : లండ న్, ఇంగ్లండ్

ముంబై విమానాశ్రయానికి ఏసీఐ అవార్డు
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) ఏషియా పసిఫిక్ గోల్డ్ అవార్డు లభించింది. పర్యావరణహిత విమానాశ్రయాలకు ఏసీఐ ఏప్రిల్ 3న అవార్డులను ప్రకటించింది. జీవీకే గ్రూపునకు చెందిన ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ముంబై ఎయిర్ పోర్ట్‌ను నిర్వహిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏసీఐ ఏషియా పసిఫిక్ గోల్డ్ అవార్డు
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
Published date : 19 Apr 2019 06:25PM

Photo Stories