Hockey India అధ్యక్షుడిగా దిలీప్ తిర్కీ కి పగ్గాలు
భారత్ తరఫున 412 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన దిగ్గజం, మాజీ కెప్టెన్ దిలీప్ తిర్కీ ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు. తిర్కీకి పోటీగా మరెవరూ బరిలో నిలవకపోవడంతో పోటీ లేకుండా ఈ మాజీ ఆటగాడికి అధ్యక్షుడయ్యే అవకాశం లభించింది. అధ్యక్ష పదవికి తుది ఫలితాలు అక్టోబర్ 1న రావాల్సి ఉన్నా... పోటీకి దిగిన రాకేశ్ కట్యాల్, భోలానాథ్ సింగ్ సెప్టెంబర్ 23న తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో తిర్కీ ఎంపికను ప్రకటించారు. ప్రపంచ హాకీ అత్యుత్తమ డిఫెండర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన 44 ఏళ్ల తిర్కీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడాన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) లాంఛనంగా ఆమోదించింది. మూడు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న తిర్కీ అర్జున, పద్మశ్రీ అవార్డులు అందుకున్నాడు. ఏ దేశం తరఫునైనా 400 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా తిర్కీ గుర్తింపు పొందాడు.
Also read: IPL 2023 :మళ్లీ ఈ ఫార్మాట్‌లోనే ఐపీఎల్ .. : సౌరవ్ గంగూలీ
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP