Skip to main content

డిసెంబర్ 2017 అవార్డ్స్

దేవిప్రియకు కేంద్ర సాహిత్య పురస్కారం
Current Affairs
ప్రముఖ కవి, రచయిత దేవిప్రియను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం-2017 వరించింది. ఆయన పద్యకావ్యం ‘గాలిరంగు’ తెలుగు నుంచి ఉత్తమ కవితా సంపుటి విభాగంలో పురస్కారానికి ఎంపికైంది. కేంద్ర సాహిత్య అకాడమీ ఏటా అందించే వార్షిక అవార్డులను డిసెంబర్ 21 ఢిల్లీలో ప్రకటించింది. మొత్తం 24 భాషల్లో ఉత్తమ రచనలను పురస్కారాలకు ఎంపిక చేసింది.
అలాగే.. కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ అనువాద రచనగా తెలుగు నుంచి వెన్న వల్లభరావు అనువదించిన ‘విరామం ఎరుగని పయనం’రచనకు అవార్డు లభించింది. ప్రముఖ పంజాబీ రచయిత్రి అజీత్ కౌర్ జీవితకథ ‘ఖానాబదోష్’ను వల్లభరావు తెలుగులో ‘విరామం ఎరుగని పయనం’గా అనువదించారు. అవార్డులను ఫిబ్రవరి 12న ఢిల్లీలోని అకాడమీ కేంద్రంలో జరిగే ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. ఉత్తమ కవితా సంపుటికి రూ. లక్ష, ఉత్తమ అనువాద రచనకు రూ. 50 వేల చొప్పున నగదు బహుమతిని అందించనున్నారు.
రన్నింగ్ కామెంటరీ కవిగా సుపరిచితులు..
దైనందిన రాజకీయ, సాంఘిక పరిస్థితుల్ని ప్రతిబింబిస్తూ ‘రన్నింగ్ కామెంటరీ’ కవిగా సుపరిచుతులైన దేవిప్రియ 1951 ఆగస్టు 15న గుంటూరు జిల్లాలో జన్మించారు. సినీరంగంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన దేవిప్రియ... జర్నలిజంలో స్థిరపడి వివిధ పత్రికలకు ఎడిటర్‌గా పనిచేశారు. ‘అమ్మ చెట్టు’ మొదలుకొని ‘గాలిరంగు’ వరకు మొత్తం ఏడు కవితా సంపుటాలను రచించారు. ప్రజాగాయకుడు గద్దర్‌పై ఆంగ్ల డాక్యుమెంటరీ చిత్రం ‘మ్యూజిక్ ఆఫ్ ఎ బ్యాటిల్‌షిప్’ను నిర్మించి దర్శకత్వం వహించారు. దాసి, రంగుల కల వంటి చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించి జాతీయ బహుమతులు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేవిప్రియకు కేంద్ర సాహిత్య పురస్కారం - 2017
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎందుకు : పద్యకావ్యం ‘గాలిరంగు’ తెలుగు నుంచి ఉత్తమ కవితా సంపుటి విభాగంలో

ఓప్రా విన్‌ఫ్రేకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు
Current Affairs
అమెరికా టీవీ స్టార్ ఓప్రా విన్‌ఫ్రే 2018 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ‘ది ఓప్రా విన్‌ఫ్రే షో’తో గుర్తింపు సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం ఓప్రా విన్‌ఫ్రే నెట్‌వర్క్ చానల్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఈ అవార్డునే సెసిల్ బి డిమిల్లే పురస్కారం అని కూడా అంటారు. వీటిని ఏటా హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్(హెచ్‌ఎఫ్‌పీఏ) ప్రకటిస్తుంది. మీడియా ప్రతినిధులు, నిర్మాతలు, నటీనటులు, సామాజిక కార్యకర్తల సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 75వ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : ఓప్రా విన్‌ఫ్రే

కె.విశ్వనాథ్‌కు బాపు జీవిత సాఫల్య పురస్కారం
సినీ దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్‌కు బాపు జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో అధికారికంగా మూడు రోజులుగా నిర్వహించిన బాపు జయంత్యుత్సవాల్లో ఆయనకు అవార్డు ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బాపు జీవిత సాఫల్య పురస్కారం
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : కె.విశ్వనాథ్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్

కేటీఆర్‌కు ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం
పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావును ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’అవార్డుకు ఎంపిక చేసింది. అలాగే పట్టణ మౌళిక వసతుల్లో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణకు మరో పురస్కారం దక్కింది. కొత్త రాష్ట్రాన్ని దేశ యవనికపై తనదైన శైలిలో నిలిపారంటూ కేటీఆర్‌ను ఈ సందర్భంగా బిజినెస్ వరల్డ్ ప్రశంసించింది. మంత్రి నిర్వహిస్తున్న బాధ్యతలు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్న తీరు, దేశవ్యాప్తంగా ఆయనకు లభించిన పేరు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఇంటింటికీ తాగునీరు సరఫరా కోసం పట్టణాల్లో మిషన్ భగీరథ.. అలాగే హరితహారం, డబుల్ బెడ్‌రూం ఇళ్లు లాంటి కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకొని ఉత్తమ పట్టణ మౌలిక సదుపాయాలున్న రాష్ట్రంగా తెలంగాణకు పురస్కారం ప్రకటించామని తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేటీఆర్‌కు ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : బిజినెస్ వరల్డ్

ప్రియాంక చోప్రాకు మదర్ థెరిస్సా స్మారక పురస్కారం
Current Affairs
తన సంపాదనలో కొంత మొత్తాన్ని సమాజ సేవకు వినియోగించినందుకు గుర్తింపుగా ప్రియాంక చోప్రా మదర్ థెరిస్సా స్మారక పురస్కారం అందుకుంది. ప్రియాంక.. మదర్ థెరిస్సా స్ఫూర్తిగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరైలీ ప్రాంతంలో ఉన్న ప్రేమ్‌నివాస్ అనే వృద్ధాశ్రమానికి విరాళాలు ఇచ్చింది. ఇప్పటికే యూనిసెఫ్‌కి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మదర్ థెరిస్సా స్మారక పురస్కారం 2017
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : ప్రియాంక చోప్రా
ఎందుకు : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రేమ్‌నివాస్ అనే వృద్ధాశ్రమానికి విరాళాలు ఇచ్చినందుకు

‘గౌరు’ సినిమాకు బాలల చలన చిత్ర అవార్డులు
Current Affairs
చైనాలో జరుగుతున్న 13వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాల్లో భారతీయ చిత్రం ‘గౌరు’ రెండు అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రంలో బాలనటుడిగా ప్రతిభ కనబర్చినందుకుగాను రిత్విక్ సాహోరె ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకోగా, నటి, గాయకురాలైన ఇలా అరుణ్ ఉత్తమ నటిగా ఎంపికైంది. ఈ చిత్రాన్ని భారత బాలల చలనచిత్ర సంఘం (సీఎఫ్‌ఎస్‌ఐ) నిర్మించింది. రామ్‌కిషన్ నందరామ్ చోయల్ దర్శకత్వం వహించారు. అనారోగ్యంగా ఉన్న తన బామ్మను కాపాడుకునేందుకు రాజస్తాన్‌కు చెందిన గౌరు అనే పదమూడేళ్ల బాలుడు సాగించిన ప్రయాణమే ఈ చిత్ర కథ.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘గౌరు’ సినిమాకు కు బాలల చలన చిత్ర అవార్డులు
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : రిత్విక్ సాహోరె (ఉత్తమ నటుడు), ఇలా అరుణ్ (ఉత్తమ నటి)
ఎక్కడ : అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం, చైనా

ఈటీ ఏషియన్ బిజినెస్ లీడర్స్ అవార్డ్ 2017
ది ఎకనామిక్ టైమ్స్ పత్రిక అందించే ఏషియన్ బిజినెస్ లీడర్ అవార్డుకు 2017 సంవత్సరానికి గాను మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహ్మద్ ఎంపికయ్యారు. గోల్డ్, డైమండ్ బిజినెస్ కేటగిరీలో ఈటీ ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేసింది. రూ.30,000 కోట్ల టర్నోవర్‌తో ప్రపంచంలోనే టాప్-5 బంగారు వ్యాపార సంస్థల్లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్‌‌స సంస్థ ఒకటిగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈటీ ఏషియన్ బిజినెస్ లీడర్స్ అవార్డ్ 2017
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : మలబార్ చైర్మన్ ఎం. పి. అహ్మద్

మహ్మద్ అల్ జౌండెకు బాలల శాంతి బహుమతి
ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి 2017 సంవత్సరానికి సిరియాకు చెందిన 16 ఏళ్ల మహ్మద్ అల్ జౌండెకు లభించింది. సిరియాలోని బాలల శరణార్థుల హక్కుల కోసం పోరాడుతున్నందుకుగాను జౌండేను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కిడ్‌‌సరైట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. నెదర్లాండ్‌‌సలోని హేగ్ నగరంలో డిసెంబర్ 5న జరిగిన కార్యక్రమంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ చేతుల మీదుగా మహ్మద్ ఈ బహుమతిని అందుకున్నాడు. సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో శరణార్థులుగా మారుతున్న బాలల కోసం మహ్మద్ కుటుంబం శరణార్థుల శిబరంలోనే పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను అందిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి 2017
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : మహ్మద్ అల్ జౌండె
ఎందుకు : సిరియాలోని బాలల శరణార్థుల హక్కుల కోసం పోరాడుతున్నందుకు
Published date : 16 Dec 2017 03:34PM

Photo Stories