Berlin Marathon : కిప్‌చోగె కొత్త ప్రపంచ రికార్డు
Sakshi Education
కెన్యా దిగ్గజ అథ్లెట్, ఒలింపిక్ చాంపియన్ ఎలీడ్ కిప్‌చోగె మారథాన్‌లో తన పేరిట కొత్త ప్రపంచ రికార్డును లిఖించుకున్నాడు.
ప్రతిష్టాత్మక బెర్లిన్ మారథాన్‌లో 37 ఏళ్ల కిప్‌చోగె 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 1 నిమిషం 9 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2018 బెర్లిన్ మారథాన్‌లోనే 2 గంటల 1 నిమిషం 39 సెకన్లతో తానే నెలకొలి్పన ప్రపంచ రికార్డును కిప్‌చోగె సవరించాడు.
Also read: India Vs Australia : టీ20 సీరీస్ భారత్ కైవసం
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 27 Sep 2022 06:26PM