ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు కాంస్యం
Sakshi Education
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టుకు కాంస్య పతకం దక్కింది.
మూడో స్థానం కోసం డిసెంబర్ 22వ తేదీన జరిగిన మ్యాచ్‌లో భారత్ 4–3 గోల్స్ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై గెలుపొందింది. టోర్నీలో పాక్‌పై టీమిండియాకు ఇది రెండో విజయం. ఈ ఓటమితో పాకిస్తాన్ నాలుగో స్థానానికి పరిమితమైంది.
తొలిసారిగా చాంపియన్‌గా కొరియా..
ఆసియా చాంపియన్‌గా నిలవాలని ఆశపడ్డ జపాన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. డిసెంబర్ 22వ తేదీన జరిగిన ఫైనల్లో జపాన్ షూటౌట్‌లో 2–4తో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. నిర్ణత 60 నిమిషాల ఆట ముగిసే సరికి ఇరు జట్లు కూడా 3–3 గోల్స్‌తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు షూటౌట్ అనివార్యమైంది. ఇక్కడ పైచేయి సాధించిన కొరియా తొలిసారి ఆసియా చాంపియన్స్‌గా అవతరించింది. 2013లో కూడా ఫైనల్‌కు చేరిన జపాన్, నాడు పాక్ చేతిలో ఓడింది.
Published date : 23 Dec 2021 05:25PM