ICC Emerging Player: ఎమర్జింగ్ ప్లేయర్ రేసులో అర్ష్‌దీప్
Sakshi Education
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కోసం భారత యువ పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ పోటీ పడుతున్నాడు.
ఈ అవార్డు కోసం ఐసీసీ నామినేట్ చేసిన నలుగురు ఆటగాళ్ల జాబితాలో అర్ష్‌దీప్ ఒకడు. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సన్, న్యూజిలాండ్ చెందిన ఫిన్ అలెన్, అఫ్గనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్‌లు అవార్డు కోసం నామినేట్ అయ్యారు. 21 అంతర్జాతీయ టి20ల్లో అర్ష్‌దీప్ 18.12 సగటుతో 33 వికెట్లు పడగొట్టాడు.
Hockey: ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ సింగ్
Published date : 29 Dec 2022 05:49PM