Skip to main content

Andrey Rublev: రుబ్లెవ్‌ ఖాతాలో తొలి ‘మాస్టర్స్‌’ టైటిల్‌

మోంటెకార్లో ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్ టోర్నీలో రష్యా ప్లేయర్‌ ఆండ్రీ రుబ్లెవ్‌ విజేతగా నిలిచాడు.
Andrey Rublev

మొనాకోలో ఏప్రిల్ 16న జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ రుబ్లెవ్‌ 5–7, 6–2, 7–5తో తొమ్మిదో ర్యాంకర్‌ హోల్గర్‌ రూనె (డెన్మార్క్‌)పై నెగ్గాడు. రుబ్లెవ్‌ కెరీర్‌లో ఇదే తొలి ‘మాస్టర్స్‌’ సిరీస్‌ టైటిల్‌. మూడో సెట్‌లో రుబ్లెవ్‌ 1–4తో వెనుకబడి పుంజుకున్నాడు. విజేత రుబ్లెవ్‌కు 8,92,590 యూరోల (రూ. 8 కోట్లు) ప్రైజ్ మనీతో పాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Lifetime MCC Membership: మిథాలీ, ధోని, యువరాజ్‌లకు ఎంసీసీ జీవితకాల సభ్యత్వం

Published date : 17 Apr 2023 03:42PM

Photo Stories