Dwaine Pretorius: అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రిటోరియస్ గుడ్‌బై
Sakshi Education
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ డ్వెయిన్ ప్రిటోరియస్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని 33 ఏళ్ల ప్రిటోరియస్ స్పష్టం చేశాడు.
2016లో దక్షిణాఫ్రికా తరఫున అరంగేట్రం చేసిన ప్రిటోరియస్ 3 టెస్టులు, 27 వన్డేలు, 33 టి20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 7 వికెట్లు తీసి 83 పరుగులు చేసిన అతను.. వన్డేల్లో 35 వికెట్లు పడగొట్టి 192 పరుగులు.. టి20ల్లో 35 వికెట్లు నేలకూల్చి 261 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ టి20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన దక్షిణాఫ్రికా బౌలర్‌గా ప్రిటోరియస్ (2021లో పాకిస్తాన్‌పై 5/17) ఘనత వహించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ప్రిటోరియస్ ఇక నుంచి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టి20 లీగ్‌లపై, ఇతర పొట్టి ఫార్మాట్‌లపై దృష్టి కేంద్రీకరిస్తానని తెలిపాడు. ప్రస్తుతం ప్రిటోరియస్ ఐపీఎల్ (చెన్నై సూపర్‌కింగ్స్), ద హండ్రెడ్ (వెల్ష్ ఫైర్), కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఎస్‌ఏ20 (డర్బన్ సూపర్ జెయింట్స్) లీగ్‌లలో భాగంగా ఉన్నాడు.
SA20 2023: ఎస్‌ఏ టి20 లీగ్ ప్రైజ్‌మనీ రూ.33.5 కోట్లు
Published date : 10 Jan 2023 05:08PM