ఆగస్టు 2017 అవార్డ్స్
Sakshi Education
ఎంపీ కవితకు నారీ ప్రతిభా పురస్కారం
ప్రతిష్టాత్మక నారీ ప్రతిభా పురస్కారాన్ని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అందుకున్నారు. యువత, మహిళా సాధికారత కోసం కృషి చేసినందుకుగాను కేంద్ర మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రెజైస్ (ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వశాఖ, విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అసోసియేషన్ సంయుక్తంగా ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేశాయి. ఈ మేరకు విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అసోసియేషన్ ఇండియా చైర్‌పర్సన్ డాక్టర్ టి.వసంతలక్ష్మి కవితకు ఆగస్టు 24న హైదరాబాద్‌లో అవార్డుతోపాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
మొదటిసారి ప్రవేశపెట్టిన నారీ ప్రతిభా పురస్కార్-2017ను ఎంపీ కవితతోపాటు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన కల్పకం ఏచూరి, ఆషా ప్రకాశ, స్మృతి నాగపాల్, ప్రియా భార్గవ, షిర్లే అబ్రహం అందుకున్నారు. వీరితోపాటు తెలంగాణ ‘షీ’టీమ్స్ బాధ్యతలు చూస్తున్న ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా కూడా అవార్డు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నారీ ప్రతిభా పూరస్కారం
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : ఎంపీ కవిత
ఎందుకు : యువత, మహిళా సాధికారత కోసం కృషి చేసినందుకుగాను
జాతీయ క్రీడా పురస్కారాలు - 2017
ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. 2017 జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలో జరిగింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ వేడుకల్లో అత్యున్నత అవార్డు రాజీవ్‌గాంధీ ఖేల్త్న్రను పారాలింపియన్ దేవేంద్ర జజరియాతో పాటు హాకీ సీనియర్ ఆటగాడు సర్దార్ సింగ్... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. వీరికి జ్ఞాపికతో పాటు రూ.7.5 లక్షల చొప్పున చెక్‌ను అందించారు.
మొత్తంగా 17 మంది క్రీడాకారులు అర్జున అవార్డు దక్కించుకోగా.. ముగ్గురికి ధ్యాన్‌చంద్, ఏడుగురికి ద్రోణాచార్య అవార్డులు అందాయి. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహిస్తారు.
అవార్డు గ్రహీతలు
ఖేల్త్న్ర: దేవేంద్ర జజరియా(పారాథ్లెట్, జావెలిన్ త్రో), సర్దార్‌సింగ్ (హాకీ). అర్జున: సాకేత్ మైనేని (టెన్నిస్), జ్యోతి సురేఖ (ఆర్చరీ), హర్మన్‌ప్రీత్ కౌర్ (క్రికెట్), ఖుష్బీర్ కౌర్, రాజీవ్ (అథ్లెటిక్స్), ప్రశాంతి సింగ్ (బాస్కెట్‌బాల్), దేవేంద్రో సింగ్ (బాక్సింగ్), బెంబేమ్ దేవి (ఫుట్‌బాల్), ఎస్‌ఎస్‌పీ చౌరాసియా (గోల్ఫ్), ఎస్‌వీ సునీల్ (హాకీ), జస్వీర్ సింగ్ (కబడ్డీ), ప్రకాష్ నంజప్ప (షూటింగ్), ఆంథోనీ అమల్‌రాజ్ (టీటీ), సత్యవర్త్ కడియాన్ (రెజ్లింగ్), తంగవేలు, వరుణ్ భటి (పారా అథ్లెట్స్). పుజారా (క్రికెట్).
ద్రోణాచార్య: దివంగత డాక్టర్ ఆర్.గాంధీ (అథ్లెటిక్స్), జీఎస్‌ఎస్‌వీ ప్రసాద్ (బ్యాడ్మింటన్), బీబీ మహంతి (బాక్సింగ్), హీరానంద్ (కబడ్డీ), రాఫెల్ (హాకీ), సంజయ్ చక్రవర్తి (షూటింగ్), రోషన్ లాల్ (రెజ్లింగ్).
ద్యాన్‌చంద్: భూపిందర్ సింగ్ (అథ్లెటిక్స్), సయ్యద్ షాహిద్ హకీమ్ (ఫుట్‌బాల్), సుమరాయ్ టెటే (హాకీ).
క్రీడా పురస్కారాల కమిటీ ప్రతిపాదనలకు ఆమోదం
క్రీడా పురస్కారాల కమిటీ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆగస్టు 19న ఆమోదం తెలిపింది. అయితే ఈ జాబితా నుంచి క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న పారా స్పోర్‌ట్స కోచ్ సత్యనారాయణను ద్రోణాచార్య నామినీ నుంచి తప్పించింది. రియో పారాలింపిక్స్ చాంపియన్, హైజంపర్ మరియప్పన్ తంగవేలు కోచ్ అయిన సత్యనారాయణ (కర్ణాటక) క్రిమినల్ పరువు నష్టం కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదొక్కటి మినహా సీకే ఠక్కర్ నేతృత్వంలోని కమిటీ సిఫారసులన్నింటికీ కేంద్రం ఆమోదముద్ర వేసింది.
అవార్డు గ్రహీతలు
రాజీవ్ ఖేల్త్న్ర: దేవేంద్ర జజారియా, సర్దార్ సింగ్.
అర్జున: జ్యోతి సురేఖ (ఆర్చరీ), సాకేత్ మైనేని (టెన్నిస్), ఖుష్బీర్ కౌర్, రాజీవ్ (అథ్లెటిక్స్), ప్రశాంతి (బాస్కెట్‌బాల్), దేవేంద్రో సింగ్ (బాక్సింగ్), పుజారా, హర్మన్‌ప్రీత్ కౌర్ (క్రికెట్), ఓయినమ్ బెంబెం దేవి (ఫుట్‌బాల్), చౌరాసియా (గోల్ఫ్), సునీల్ (హాకీ), జస్వీర్ సింగ్ (కబడ్డీ), ప్రకాశ్ నంజప్ప (షూటింగ్), ఆంథోనీ అమల్ రాజ్ (టేబుల్ టెన్నిస్), మరియప్పన్ తంగవేలు, వరుణ్ భటి (పారా అథ్లెటిక్స్), సత్యవర్త్ కడియన్ (రెజ్లింగ్).
ద్రోణాచార్య అవార్డు: డా.ఆర్ గాంధీ(అథ్లెటిక్స్), హీరానంద్ కటారియా(కబడ్డీ), జీఎస్‌వీ ప్రసాద్(బ్యాడ్మింటన్), బ్రిజ్ భూషన్ మహంతి(బాక్సింగ్), రోషన్ లాల్(రెజ్లింగ్),రాఫెల్,(హాకీ), సంజయ్ చక్రవర్తి(షూటింగ్)
ధ్యాన్‌చంద్ అవార్డు: భూపిందర్ సింగ్(అథ్లెటిక్స్),సయ్యద్ షాహీద్ హకీం (ఫుట్ బాల్), సుమరాయ్ టకే(హాకీ)
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్రీడా పురస్కారాల కమిటీ ప్రతిపాదనలకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : క్రీడల మంత్రిత్వశాఖ
ఎందుకు : రాజీవ్ ఖేల్త్న్ర, అర్జున అవార్డుల ప్రదానం కోసం
పద్మ అవార్డులకు ఎవరైనా నామినేట్ చేయవచ్చు
వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పద్మ అవార్డులకు నామినేషన్లు ఎవరైనా ప్రతిపాదించవచ్చని కేంద్రం తెలిపింది. ఈ మేరకు 2018 ఏడాదికి పద్మ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ కేంద్ర హోంశాఖ ఆగస్టు 18న ప్రకటన విడుదల చేసింది. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్‌స, ఇంజనీరింగ్, వాణిజ్యం తదితర రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డు అందజేస్తారు.
ప్రజలందరూ తమ ప్రతిపాదనలను అధికారిక వెబ్‌సైబ్ www.padmaawards.gov.in కు సెప్టెంబర్ 15లోగా పంపాలి. కేవలం ఆన్‌లైన్ ద్వారానే ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. పద్మ అవార్డుల కమిటీ అవార్డుల ప్రదానంపై తుది నిర్ణయం తీసుకుంటుంది. గతంలో రాజకీయ నేతలు, మంత్రులు సిఫార్సు చేసినవారికే పద్మ అవార్డులు అందేవి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పద్మ అవార్డుల ఎంపిక ప్రక్రియలో మార్పులు
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : అవార్డులకు ఎవరైనా నామినేషన్లు పంపే అవకాశం
రాజమహేంద్రవరం ఓఎన్‌జీసీకి జాతీయ పురస్కారం
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఓఎన్‌జీసీ అసెట్‌కు ప్రతిష్టాత్మకమైన జాతీయ భద్రతా పురస్కారం (మైన్‌స)-2013 లభించింది. సురక్షితమైన డ్రిల్లింగ్ (ఆ ప్రక్రియలో సిబ్బంది గాయపడిన సందర్భాలు అతి తక్కువగా ఉండడం)లో ఈ పురస్కారానికి ఎంపికైంది. అసెట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, మేనేజర్ డీఎంఆర్ శేఖర్ ఆగస్టు 17న న్యూఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. అసెట్ 2011, 2012 సంవత్సరాల్లో కూడా జాతీయ భద్రతా పురస్కారాన్ని గెలుచుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాజమహేంద్రవరం ఓఎన్‌జీసీ అసెట్‌కు జాతీయ భద్రతా పురస్కారం - 2013
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : సురక్షితమైన డ్రిల్లింగ్ చేపడుతున్నందుకు
‘బస్తర్’ పోలీసులకు అంతర్జాతీయ అవార్డు
ఉత్తమ పోలీసు సేవలకుగాను చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ పోలీసులకు ఈ ఏడాది ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఐఏసీపీ అవార్డు దక్కింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ‘ఆమ్‌ఛో బస్తర్, ఆమ్‌ఛో పోలీస్’ పేరుతో చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావడంతో బస్తర్ పోలీసు విభాగాన్ని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. జిల్లా సూపరింటెండెంట్ ఆప్ పోలీస్ ఆరిఫ్ షేక్ అమెరికాలో అక్టోబర్ 24న జరిగే ప్రదానోత్సవంలో ఈ అవార్డును అందుకోనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బస్తర్ పోలీసులకు ఐఏసీపీ అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 18
ఎందుకు : నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ‘ఆమ్‌ఛో బస్తర్, ఆమ్‌ఛో పోలీస్’ కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు
ఐదుగురికి కీర్తిచక్ర, 17 మందికి శౌర్య పురస్కారాలు
ఉగ్రవాదులపై పోరులో అమరులైన ఇద్దరు సైనికులతో పాటు ఐదుగురు భద్రతా దళాల సిబ్బందిని దేశ రెండో అత్యున్నత గాలంట్రీ అవార్డు అయిన కీర్తిచక్రకు ఎంపికచేశారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 112 శౌర్య పురస్కారాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 14న ఆమోదం తెలిపారు. వీటిలో ఐదు కీర్తి చక్ర, 17 శౌర్యచక్ర, 85 సేనా మెడల్స్, మూడు నౌకాదళ సేనా మెడల్స్, రెండు వాయుసేన మెడల్స్ ఉన్నాయి. హవిల్దార్ గిరిస్ గురుంగ్ (గూర్ఖా రైఫిల్స్), మేజర్ డేవిడ్ మన్‌లన్(నాగా రెజిమెంట్), ప్రమోద్ కుమార్ (సీఆర్‌పీఎఫ్ 49 బెటాలియన్ కమాండెంట్)లు మరణానంతరం కీర్తిచక్రకు ఎంపికయ్యారు. మేజర్ ప్రీతం సింగ్ కున్వర్ (గర్వాల్ రైఫిల్), చేతన్ కుమార్ చీతా (సీఆర్‌పీఎఫ్ సీనియర్ అధికారి)లు కూడా ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. దేశ అత్యున్నత శౌర్య పురస్కారమైన అశోక చక్రకు ఎవరినీ ఎంపిక చేయలేదు.
మే 20న జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక పోరులో హవిల్దార్ గురుంగ్ అమరుడయ్యారు. తీవ్రంగా గాయపడ్డా.. ధైర్య సాహసాల్ని ప్రదర్శిస్తూ ఉగ్రవాది వైపుకు దూసుకెళ్లి కాల్పులు జరిపారు. జూన్ 6న నాగాలాండ్‌లో తీవ్రవాదులతో ఎదురుకాల్పుల్లో మేజర్ మన్‌లన్ ప్రాణాలు కోల్పోయారు. మే 25న కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరులో చూపిన తెగువకు మేజర్ కున్వర్ కీర్తిచక్రకు ఎంపికయ్యారు. సాహస పతకాలకు హోం శాఖ 190 మందిని ఎంపిక చేయగా.. వీరిలో ఛత్తీస్‌గఢ్‌లో మావోల దాడిలో అమరులైన 53 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐదుగురు సైనికులకు కీర్తి చక్ర పురస్కారం
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఏపీ, తెలంగాణకు సేవా పతకాలు
విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే అత్యుత్తమ సేవా పతకాలను కేంద్రం ఆగస్టు 14న ప్రకటించింది. దేశవ్యాప్తంగా 190 మందికి పోలీసు శౌర్య పతకాలు, 93 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 706 మందికి అత్యుత్తమ సేవా పతకాలు కలుపుకొని మొత్తం 990 పతకాలను ప్రకటించింది.
తెలంగాణకు 13 పతకాలు
ఈ సారి తెలంగాణ రాష్ట్రం నుంచి 13 మంది పోలీసు అధికారులు ఈ పతకాలకు ఎంపికయ్యారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్, మెట్రో రైల్ విభాగంలో పని చేస్తున్న అదనపు డీసీపీ ఎ.బాలకృష్ణలకు రాష్ట్రపతి పోలీసు పతకాలు (పీపీఎం) దక్కాయి. కేంద్ర హోం శాఖ ఆగస్టు 14న ఈ మేరకు ప్రకటించింది. మరో 11 మంది పోలీసు అధికారులకు ఇండియన్ పోలీస్ మెడల్స్ దక్కాయి. ప్రత్యేక మహిళా కారాగారం చీఫ్ హెడ్‌వార్డర్ ఎ.ప్రమీలా బాయికి రాష్ట్రపతి కరెక్షనల్ సర్వీస్ మెడల్ దక్కింది.
ఏపీకి 67 పతకాలు
రాష్ట్రం నుంచి 67 మంది పోలీసు అధికారులు సేవా పతకాలకు ఎంపికయ్యారు. ఇందులో 52 పోలీసు శౌర్య, 3 రాష్ట్రపతి విశిష్ట సేవ, 12 అత్యుత్తమ సేవా పతకాలు ఉన్నాయి.
రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు ఈ ఏడాది కిగాను ఏపీలోని విజయవాడ ఏసీబీ జాయింట్ డెరైక్టర్ కేవీ లక్ష్మీనాయక్, కర్నూలు ఆర్‌ఐవో ఏఎస్పీ దొడ్లా నరహరి, విజయనగరం ఏఎస్‌ఐ కొటారి ప్రసాద్ రావులకు దక్కాయి. రాష్ట్రపతి శౌర్య పతకం ఈ ఏడాది ఒక్కరికే ప్రకటించగా.. అది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దివంగత ప్లటూన్ కమాండర్ శంకర్‌రావుకు దక్కింది.
భారతీయ అమెరికన్ ప్రొఫెసర్‌కు జీవనసాఫల్య పురస్కారం
మోడ్రన్ కమ్యూనికేషన్‌స రంగంలో విశిష్ట సేవలు అందించిన భారతీయ అమెరికన్ ప్రొఫెసర్ థామస్ కైలత్‌కు అమెరికా కేంద్రంగా పనిచేసే మార్కోనీ సొసైటీ జీవనసాఫల్య పురస్కారాన్ని అందజేసింది. కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగం అభివృద్ధికి అమూల్యమైన సేవలు అందించడంతో కైలత్‌ను భారత ప్రభుత్వం 2009లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
రేడియోను కనుగొన్న నోబెల్ గ్రహీత గుగ్లిల్మో మార్కోనీ పేరు మీద ఈ సొసైటీని 1975లో స్థాపించారు. మానవులకు సృజనాత్మక సేవలు అందించిన వారికి ఇది జీవన సాఫల్య పురస్కారం అందజేస్తుంది. కై లత్ 1935లో పుణేలో జన్మించారు. స్వదేశంలో ఇంజనీరింగ్ చదివాక 1957లో అమెరికా వెళ్లి ఉన్నత విద్యాభ్యాసం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మార్కోని సొసైటీ జీవన సాఫల్య పురస్కారం - 2017
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : భారతీయ అమెరికన్ ప్రొఫెసర్ థామస్ కైలత్
ఎందుకు : మోడ్రన్ కమ్యూనికేషన్‌స రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను
దేవేంద్ర జఝరియాకు రాజీవ్ ఖేల్త్న్ర
భారత పారా అథ్లెట్ దేవేంద్ర జఝరియా భారత అత్యున్నత క్రీడాపురస్కారం ‘రాజీవ్ ఖేల్త్న్ర’ అందుకోనున్నాడు. ఈ అవార్డు చరిత్రలో ఓ పారాలింపియన్ ఎంపికవడం ఇదే తొలిసారి. అవార్డుల కమిటీ ఇతనితో పాటు భారత హాకీ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌ను ఖేల్త్న్ర కోసం సిఫార్సు చేసింది. దేవేంద్ర జఝరియా పారాలింపిక్స్ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు(2004, 2016) గెలుపొందాడు. ఈ మేరకు రిటైర్డ్ జస్టిస్ సీకే ఠక్కర్ నేతృత్వంలోని అవార్డుల కమిటీ జావెలిన్ త్రోయర్ జఝరియాకు ఖేల్త్న్రలో తొలి ప్రాధాన్యమిచ్చింది. మరో 17 మందిని ‘అర్జున’ అవార్డుకు నామినేట్ చేసింది. తెలుగు క్రీడాకారులు సాకేత్ మైనేని, వెన్నం జ్యోతి సురేఖ ఈ జాబితాలో ఉన్నారు. మహిళల వన్డే ప్రపంచకప్‌లో చెలరేగిన హర్మన్‌ప్రీత్ కౌర్, టెస్టు క్రికెటర్ చతేశ్వర్ పుజారాలు ‘అర్జున’కు నామినేట్ అయ్యారు. త్వరలోనే కేంద్ర క్రీడాశాఖ ఈ జాబితాకు ఆమోదం తెలపగానే జాతీయ క్రీడా దినోత్సవమైన మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి (ఆగస్టు 29) రోజు అవార్డులను ప్రదానం చేస్తారు.
అర్జున అవార్డు నామినీల జాబితా
ఢిల్లీ మెట్రోకు హరిత మెట్రో అవార్డు
భారత్‌లో తొలి హరిత మెట్రో అవార్డుని ఢిల్లీ మెట్రో కైవసం చేసుకుంది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జాతీయ గ్రీన్ మెట్రో సిస్టమ్స్ సమావేశంలో ఇండియన్ గ్రీన్ బిల్డంగ్ కౌన్సిల్(ఐజీబీసీ) ఈ అవార్డుని ఢిల్లీ మెట్రోకి ప్రకటించింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఫేస్ - 3లో స్టేషన్లు, డిపోలు, సబ్ స్టేషన్‌లను హరిత ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించినందుకు గాను ఈ అవార్డు ఇస్తున్నట్లు పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఢిల్లీ మెట్రోకు హరిత మెట్రో అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : ఐజీబీసీ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : హరిత ప్రమాణాలు పాటించినందుకు గాను
ట్రిపుల్ ఐటీ హెచ్‌వోడీకి భారత్ విద్యారత్న అవార్డు
బాసరలోని ట్రిపుల్ ఐటీలో రసాయన శాస్త్ర విభాగం హెచ్‌వోడీ డాక్టర్ రవి వరాల అత్యున్నత భారత్ విద్యారత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఆగస్టు 5న జరిగిన ఓ కార్యక్రమంలో రవి వరాల ఇంటర్‌నేషనల్ బిజినెస్ కౌన్సెల్ ఆధ్వర్యంలో అవార్డు అందుకున్నారు. విద్యాబోధన క్షేత్రంలో తనదైన నైపుణ్యం ప్రదర్శించిన వారికి ఈ అవార్డు అందజేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ విద్యారత్న అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : డాక్టర్ రవి వరాల
ఎక్కడ : న్యూఢిల్లీలో
గోరటి, సుద్దాలకు జాలాది పురస్కారం
సినీ కవి డాక్టర్ జాలాది పేరిట ఏటా ప్రదానం చేస్తున్న జాతీయ ప్రతిభా పురస్కారాలకు.. ఈ ఏడాది సుప్రసిద్ధ ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న, ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజను ఎంపిక చేసినట్లు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆగస్టు 9న విశాఖలోని సిరిపురం ‘వుడా చిల్డ్రన్ ఎరీనా’లో నిర్వహించే జాలాది జయంతి ఉత్సవాల్లో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాలాది జాతీయ ప్రతిభా పురస్కారాలు
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ధ్యాన్‌చంద్ పురస్కారానికి సిఫార్సైన హకీమ్
భారత ఫుట్‌బాల్ దిగ్గజాలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న హైదరాబాదీ సయ్యద్ షాహిద్ హకీమ్‌కు ప్రతిష్టాత్మక ‘ధ్యాన్‌చంద్’ పురస్కారం లభించనుంది. పుల్లెల గోపీచంద్ నేతృత్వంలోని కమిటీ ఆయన పేరును ఈ అవార్డుకు నామినేట్ చేసింది. ఆటగాడిగా, కోచ్‌గా, పరిపాలకుడిగా వివిధ దశల్లో హకీమ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన సీనియర్ బ్యాడ్మింటన్ కోచ్ గంగుల వెంకట ప్రసాద్ కూడా జీవితకాల సాఫల్య పురస్కారం (కోచింగ్) అందుకోనున్నారు. అవార్డుల కమిటీ మొత్తం ముగ్గురి పేర్లను ‘ద్రోణాచార్య’ అవార్డుకు, ఐదుగురి పేర్లను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ (కోచింగ్) అవార్డుకు, మరో ముగ్గురి పేర్లను ధ్యాన్‌చంద్ అవార్డుకు సిఫారసు చేసింది. కేంద్ర క్రీడా శాఖ అధికారిక ఆమోద ముద్ర వేసిన తర్వాత ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వీటిని అందజేస్తారు.
దేవ్‌పటేల్‌కు గేమ్ చేంజర్స్ అవార్డు
స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం ద్వారా ప్రత్యేక గుర్తింపు సాధించిన దేవ్ పటేల్ ప్రతిష్టాత్మక ఆసియా సొసైటీ గేమ్ చేంజర్స్ అవార్డుకు ఎంపికయ్యాడు. 2017 సంవత్సరానికి గాను మరో తొమ్మిది మందితో కలిసి ఆయన ఈ అవార్డు అందుకోనున్నాడు. 2017 నవంబర్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అవార్డుల ప్రదానోత్సవం జరగుతుంది.
కేవలం ఐదారేళ్ల వ్యవధిలోనే దేవ్ పటేల్ ఓ గొప్ప స్టార్‌గా అవతరించాడని, సినిమాలతోపాటు టీవీ షోలలో కూడా తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడని, కేవలం కథానాయకుడిగానేకాదు.. భారత ప్రేక్షకులకు, పాశ్చాత్య దేశాల ప్రేక్షకులకు మధ్య వారధిని నిర్మించాడని పురస్కార గ్రహీతల ఎంపిక కమిటీ వ్యాఖ్యానించింది. ఇక సేవా కార్యక్రమాల కోసం దేవ్‌పటేల్ చేస్తున్న ఖర్చు కూడా చాలా ఎక్కువేనని, అనాథ పిల్లలను ఆదుకునేందుకు ఇప్పటిదాకా 2,50,000 డాలర్లను దేవ్ ఖర్చుచేయడం తమను ఎంతగానో ఆకర్షించిందని జ్యూరీ వ్యాఖ్యానించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేవ్‌పటేల్‌కు ఆసియా సొసైటీ గేమ్ చేంజర్స్ అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : ఆసియా సొసైటీ
భారత వ్యాపారవేత్తకు యూఏఈ పురస్కారం
జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను విడిపించడంలో ప్రత్యేక చొరవ చూపిన భారత వ్యాపారవేత్త ఫిరోజ్ మర్చెంట్‌కు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చెందిన ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఆయన ఇటీవల యూఏఈ ఉపప్రధాని హెచ్‌హెచ్ షేఖ్ నుంచి కమ్యూనిటీ సర్వీస్ మెడల్‌ను స్వీకరించారు.

జ్యోతి సురేఖ (ఆర్చరీ) | చౌరాసియా (గోల్ఫ్) |
సాకేత్ మైనేని (టెన్నిస్) | పుజారా (క్రికెట్) |
ఖుష్బీర్ కౌర్ (అథ్లెటిక్స్) | హర్మన్‌ప్రీత్ కౌర్ (క్రికెట్) |
అరోకిన్ రాజీవ్ (అథ్లెటిక్స్) | ప్రశాంతి సింగ్ (బాస్కెట్‌బాల్) |
దేవేంద్రో సింగ్ (బాక్సింగ్) | ఓయినమ్ బెంబెం దేవి (ఫుట్‌బాల్) |
ఎస్వీ సునీల్ (హాకీ) | జస్వీర్‌సింగ్ (కబడ్డీ) |
ప్రకాశ్ (షూటింగ్) | అమల్‌రాజ్ (టేబుల్ టెన్నిస్) |
సత్యవర్త్ కడియన్ (రెజ్లింగ్) | వరుణ్ భటి (పారా అథ్లెటిక్స్) |
మరియప్పన్ తంగవేలు(పారా అథ్లెటిక్స్) |
ఢిల్లీ మెట్రోకు హరిత మెట్రో అవార్డు
భారత్‌లో తొలి హరిత మెట్రో అవార్డుని ఢిల్లీ మెట్రో కైవసం చేసుకుంది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జాతీయ గ్రీన్ మెట్రో సిస్టమ్స్ సమావేశంలో ఇండియన్ గ్రీన్ బిల్డంగ్ కౌన్సిల్(ఐజీబీసీ) ఈ అవార్డుని ఢిల్లీ మెట్రోకి ప్రకటించింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఫేస్ - 3లో స్టేషన్లు, డిపోలు, సబ్ స్టేషన్‌లను హరిత ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించినందుకు గాను ఈ అవార్డు ఇస్తున్నట్లు పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఢిల్లీ మెట్రోకు హరిత మెట్రో అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : ఐజీబీసీ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : హరిత ప్రమాణాలు పాటించినందుకు గాను
ట్రిపుల్ ఐటీ హెచ్‌వోడీకి భారత్ విద్యారత్న అవార్డు
బాసరలోని ట్రిపుల్ ఐటీలో రసాయన శాస్త్ర విభాగం హెచ్‌వోడీ డాక్టర్ రవి వరాల అత్యున్నత భారత్ విద్యారత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఆగస్టు 5న జరిగిన ఓ కార్యక్రమంలో రవి వరాల ఇంటర్‌నేషనల్ బిజినెస్ కౌన్సెల్ ఆధ్వర్యంలో అవార్డు అందుకున్నారు. విద్యాబోధన క్షేత్రంలో తనదైన నైపుణ్యం ప్రదర్శించిన వారికి ఈ అవార్డు అందజేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ విద్యారత్న అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : డాక్టర్ రవి వరాల
ఎక్కడ : న్యూఢిల్లీలో
గోరటి, సుద్దాలకు జాలాది పురస్కారం
సినీ కవి డాక్టర్ జాలాది పేరిట ఏటా ప్రదానం చేస్తున్న జాతీయ ప్రతిభా పురస్కారాలకు.. ఈ ఏడాది సుప్రసిద్ధ ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న, ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజను ఎంపిక చేసినట్లు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆగస్టు 9న విశాఖలోని సిరిపురం ‘వుడా చిల్డ్రన్ ఎరీనా’లో నిర్వహించే జాలాది జయంతి ఉత్సవాల్లో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాలాది జాతీయ ప్రతిభా పురస్కారాలు
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ధ్యాన్‌చంద్ పురస్కారానికి సిఫార్సైన హకీమ్
భారత ఫుట్‌బాల్ దిగ్గజాలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న హైదరాబాదీ సయ్యద్ షాహిద్ హకీమ్‌కు ప్రతిష్టాత్మక ‘ధ్యాన్‌చంద్’ పురస్కారం లభించనుంది. పుల్లెల గోపీచంద్ నేతృత్వంలోని కమిటీ ఆయన పేరును ఈ అవార్డుకు నామినేట్ చేసింది. ఆటగాడిగా, కోచ్‌గా, పరిపాలకుడిగా వివిధ దశల్లో హకీమ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన సీనియర్ బ్యాడ్మింటన్ కోచ్ గంగుల వెంకట ప్రసాద్ కూడా జీవితకాల సాఫల్య పురస్కారం (కోచింగ్) అందుకోనున్నారు. అవార్డుల కమిటీ మొత్తం ముగ్గురి పేర్లను ‘ద్రోణాచార్య’ అవార్డుకు, ఐదుగురి పేర్లను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ (కోచింగ్) అవార్డుకు, మరో ముగ్గురి పేర్లను ధ్యాన్‌చంద్ అవార్డుకు సిఫారసు చేసింది. కేంద్ర క్రీడా శాఖ అధికారిక ఆమోద ముద్ర వేసిన తర్వాత ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వీటిని అందజేస్తారు.
దేవ్‌పటేల్‌కు గేమ్ చేంజర్స్ అవార్డు
స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం ద్వారా ప్రత్యేక గుర్తింపు సాధించిన దేవ్ పటేల్ ప్రతిష్టాత్మక ఆసియా సొసైటీ గేమ్ చేంజర్స్ అవార్డుకు ఎంపికయ్యాడు. 2017 సంవత్సరానికి గాను మరో తొమ్మిది మందితో కలిసి ఆయన ఈ అవార్డు అందుకోనున్నాడు. 2017 నవంబర్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అవార్డుల ప్రదానోత్సవం జరగుతుంది.
కేవలం ఐదారేళ్ల వ్యవధిలోనే దేవ్ పటేల్ ఓ గొప్ప స్టార్‌గా అవతరించాడని, సినిమాలతోపాటు టీవీ షోలలో కూడా తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడని, కేవలం కథానాయకుడిగానేకాదు.. భారత ప్రేక్షకులకు, పాశ్చాత్య దేశాల ప్రేక్షకులకు మధ్య వారధిని నిర్మించాడని పురస్కార గ్రహీతల ఎంపిక కమిటీ వ్యాఖ్యానించింది. ఇక సేవా కార్యక్రమాల కోసం దేవ్‌పటేల్ చేస్తున్న ఖర్చు కూడా చాలా ఎక్కువేనని, అనాథ పిల్లలను ఆదుకునేందుకు ఇప్పటిదాకా 2,50,000 డాలర్లను దేవ్ ఖర్చుచేయడం తమను ఎంతగానో ఆకర్షించిందని జ్యూరీ వ్యాఖ్యానించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేవ్‌పటేల్‌కు ఆసియా సొసైటీ గేమ్ చేంజర్స్ అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : ఆసియా సొసైటీ
భారత వ్యాపారవేత్తకు యూఏఈ పురస్కారం
జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను విడిపించడంలో ప్రత్యేక చొరవ చూపిన భారత వ్యాపారవేత్త ఫిరోజ్ మర్చెంట్‌కు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చెందిన ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఆయన ఇటీవల యూఏఈ ఉపప్రధాని హెచ్‌హెచ్ షేఖ్ నుంచి కమ్యూనిటీ సర్వీస్ మెడల్‌ను స్వీకరించారు.
Published date : 17 Aug 2017 01:52PM