Skip to main content

Ropeway in Hyderabad: హైదరాబాద్‌కు పాడ్‌ కార్స్, రోప్‌వేస్‌ - కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి

Ropeway in Hyderabad soon
Ropeway in Hyderabad soon

హైదరాబాద్‌ లో సరికొత్త ప్రజారవాణా వ్యవస్థను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో రాష్ట్ర సర్కారు ముందడుగు వేసింది. ఇప్పటికే విజయవంతంగా సాగుతున్న మెట్రోరైలు, సబర్బన్‌ రైలు, ఎంఎంటీఎస్‌లకు తోడు పర్సనల్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం (పీఆర్‌టీ ఎస్‌)ను ప్రవేశపె ట్టే విషయంలో హైదరాబాద్‌కు ప్రాధాన్యమివ్వా లని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆ ర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జూన్ 23న ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీతో భేటీ అయి.. ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న జనాభా, ఉపాధి అవకాశాలతో మహానగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో ప్రయాణికుల రవాణా డిమాండ్‌ను తీర్చేందుకు పీఆర్‌టీఎస్‌తో పాటు రోప్‌వే సిస్టం వంటి అధునాతన రవాణా సౌకర్యాల (స్మార్ట్‌ అర్బన్‌ మొబిలిటీ సొల్యూషన్స్‌) కల్పన ఆవశ్యకతను మంత్రి వివరించారు. ఇప్పటికే 69 కిలోమీటర్ల మెట్రో రైల్‌ నెట్‌వర్క్, 46 కి.మీ సబర్బన్‌ సర్వీస్, ఎంఎంటీఎస్‌ ఉన్నాయని, వాటికి అనుసంధానంగా 10కి.మీ మేర పీఆర్‌టీఎస్‌ను తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. పీఆర్‌టీఎస్‌ అలాట్‌మెంట్‌కు సంబంధించిన వివరాలన్నీ (స్టాండర్డ్స్, స్పెసిఫికేషన్స్, లీగల్, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌) తమకు అందించాలని కోరారు. 

Also read: Entertainment, Media Industry: 2026 నాటికి రూ. 4.30 లక్షల కోట్లకు దేశీ మీడియా

Published date : 24 Jun 2022 06:07PM

Photo Stories