Skip to main content

Daspletosaurus: రాక్షసబల్లుల రారాజు.. డస్‌ప్లెటొసరస్‌

మనకు ఇప్పటిదాకా తెలిసిన రాక్షసబల్లుల్లో అతి భయంకరమైన టీ రెక్స్‌ (టైరనోసార్‌ రెక్స్‌)లో కొత్త జాతి.

టీ రెక్స్‌ను కూడా తలదన్నేంతటి భారీ శరీరం, కళ్ల పక్కగా మొలుచుకొచ్చిన‌ కొమ్ములతో భీతిగొలిపేలా ఉండేదట. రాక్షసబల్లులకు రాజుగా చెప్పదగ్గ ఈ జీవి 7.6 కోట్ల ఏళ్ల కింద ఉత్తర అమెరికాలో స్వేచ్ఛావిహారం చేసేదట. మోంటానాకు ఈశాన్య ప్రాంతంలో దొరికిన పుర్రెలు తదితరాల శిలాజాల ఆధారంగా దీని ఉనికిని సైంటిస్టులు తాజాగా నిర్ధారించారు. ఇది బహుశా టీ రెక్స్‌కు అత్యంత పూర్వీకురాలు అయ్యుండొచ్చని వారంటున్నారు. పాత, కొత్త టీ రెక్స్‌ జాతుల మధ్య దీన్ని మిస్సింగ్‌ లింక్‌గా అభివర్ణిస్తున్నారు. ఏకంగా 12 మీటర్ల పొడవు, 4 మీటర్ల ఎత్తుండే టీ రెక్స్‌లు 6.8 కోట్ల నుంచి 6.6 కోట్ల ఏళ్ల క్రితం దాకా జీవించాయని చెబుతారు.

➤ నక్షత్రాల అవిర్భావం గుట్టు విప్పిన భారత టెలిస్కోప్‌!

 

Published date : 12 Dec 2022 12:28PM

Photo Stories