NASA: గ్రహశకలాల నుంచి మానవాళిని రక్షించే ప్రయోగం విజయవంతం
గ్రహశకలాల నుంచి మానవాళిని రక్షించే దిశగా కీలక ముందడుగు పడింది. భూగ్రహం వైపు ప్రమాదకరంగా దూసుకొచ్చే గ్రహశకలాల కక్ష్యను మార్చే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన ‘డార్ట్(డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్ట్ టెస్ట్)’ మిషన్ విజయవంతమైంది. ఇందుకోసం డిడిమోస్, డైమార్ఫస్ అనే జంట గ్రహశకలాలను నాసా ఎంచుకుంది. ఈ ప్రయోగంలో భాగంగా నాసా స్పేస్‌క్రాఫ్ట్ డైమార్ఫస్‌ను ఢీకొట్టింది. అంతరిక్షంలో 11.3 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని గ్రహశకలం వద్ద ఇది చోటుచేసుకుంది. డార్ట్ వ్యోమనౌక 22,500 కిలో మీటర్ల వేగంతో ఆ అంతరిక్ష శిలలోకి దూసుకుపోయింది. ఈ ప్రక్రియను వ్యోమనౌక సొంతంగా చేపట్టింది. డార్ట్‌తోపాటు ఉన్న చిన్న ఉపగ్రహం లిసియాక్యూబ్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి.. ఢీకొనడం వల్ల వెలువడిన ధూళిని ఫొటో తీసి భూమికి పంపనుంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP