Skip to main content

James Webb Telescope: రోదసిలో లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌!

17 వలయాలతో వయ్యారాలు పోతున్న జంట తారలివి. జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ వీటిని తాజాగా గుర్తించింది.
Lord of the rings
Lord of the rings

ఎనిమిదేళ్లకోసారి అవి పరస్పరం సమీపంగా వచ్చినప్పుడల్లా రెండింటి వాయు ప్రవాహాలతో రేగే అంతరిక్ష ధూళి ఇలా వలయాల రూపు సంతరించుకుంటోందట. దీన్ని రోదసిలో లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌గా శాస్త్రవేత్తలు అభివర్ణింస్తున్నారు. భూమి నుంచి 50 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ జంట తారలను వూల్ఫ్‌–రాయెట్‌ 140గా వ్యవహరిస్తున్నారు. వీటిలో ఒకటి సూర్యుని కంటే కనీసం 25 రెట్లు పెద్దదట. దాని జీవితకాలం ముగింపుకు వస్తోందని నాసా తెలిపింది. అది నెమ్మదిగా కృశించి బ్లాక్‌హోల్‌గా మారడానికి ఎంతోకాలం పట్టదని చెబుతోంది.  

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 14 Oct 2022 05:20PM

Photo Stories