HAL Tejas పై 6 దేశాల ఆసక్తి
తేజస్‌ను త్వరలో మలేషియా కొనుగోలు చేయనుందని తెలిపారు. 2019 ఫిబ్రవరిలో రాయల్ మలేషియన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి ప్రాథమిక టెండర్‌ను హెచ్‌ఏఎల్ స్వీకరించిందని అన్నారు. ట్విన్–సీటర్ వేరియంట్ తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనాలని మలేషియా నిర్ణయించుకుందని వెల్లడించారు. కాలంచెల్లిన రష్యన్ మిగ్–29 ఫైటర్ విమానాల స్థానంలో తేజస్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తోందని పేర్కొన్నారు. ఆగస్టు 5న లోక్‌సభలో ఓ ప్రశ్నకు అజయ్ భట్ సమాధానమిచ్చారు. స్టీల్త్ ఫైటర్ జెట్ల తయారీపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు వివరించారు. ‘అటనామస్ ఫ్లైయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్ర్‌స్టేటర్’ను డీఆర్‌డీఓ విజయవంతంగా పరీక్షించిందని, దీనిపై ఇంతకంటే ఎక్కువ సమాచారం బహిర్గతం చేయలేమని చెప్పారు. భారత వైమానిక దళ(ఐఏఎఫ్) అవసరాల కోసం రూ.48,000 కోట్లతో 83 తేలికపాటి తేజస్ యుద్దవిమానాల కొనుగోలు కోసం రక్షణ శాఖ గత ఏడాది ఫిబ్రవరిలో హెచ్‌ఏఎల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP