Free Bus for Women: మహిళలకు శుభవార్త.. ఆధార్ కార్డు లేకున్నా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ గుర్తింపు కార్డులను కండక్టర్‌కు చూపించవచ్చని ఆయన తెలిపారు. ఈ గుర్తింపు కార్డులలో ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు కూడా చెల్లుబాటు అవుతాయని ఆయన స్పష్టం చేశారు.
గతంలో.. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి ఆధార్ కార్డును మాత్రమే గుర్తింపు పత్రంగా అడిగేవారు. అయితే, ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర ఒరిజినల్ ప్రభుత్వ గుర్తింపు పత్రాలను కూడా అనుమతించడంతో, ఆధార్ కార్డు అందుబాటులో లేని మహిళలకు ఇది నిజంగా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.
APSRTC: ఆంధ్రప్రదేశ్‌కి 750 ఎలక్ట్రిక్ బస్సులు.. ఈ నగరాల్లోనే..
ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆధార్ కార్డు ఒక్కటే ఉచిత ప్రయాణానికి ప్రామాణికం కాదని సజ్జనార్ తన X (ట్విట్టర్) ఖాతా ద్వారా తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం 'మహాలక్ష్మి పథకం' ద్వారా 2023 డిసెంబర్ 9వ తేదీ నుంచి అమల్లో ఉంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు ప్రధాన హామీలలో ఒకటి.
India Justice Report: తెలంగాణలో ప్రతీ లక్ష మందికి.. 233 మంది పోలీసులు