Skip to main content

Hyderabad: ఫ్లో కెమిస్ట్రీలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయనున్న రాష్ట్రం?

COE in Flow Chemistry

తెలంగాణ రాష్ట్రంలో ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ రంగాల పురోగతిని కొనసాగించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. దీనికోసం ఫార్మా దిగ్గజాలతో కలిసి ఫ్లో కెమిస్ట్రీలో కొత్తగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీఓఈ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని డాక్టర్‌ రెడ్డీస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌సైన్సెస్‌ ఆవరణలో ఏర్పాటయ్యే ఈ కేంద్రం వల్ల ఫార్మారంగంలో బహుళ ప్రయోజనాలతో కూడిన ఆవిష్కరణలు ఊపందుకుంటాయి. సీఓఈ ఏర్పాటుకు ముందుకొచ్చిన కన్సార్టియంతో ప్రభుత్వం నవంబర్ 25న ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంపై జీవీ ప్రసాద్‌ (డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌), డాక్టర్‌ సత్యనారాయణ చావా (లారస్‌ ల్యాబ్స్‌), శక్తి నాగప్పన్‌ (లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌)తోపాటు డాక్టర్‌ శ్రీనివాస్‌ ఓరుగంటి (డాక్టర్‌ రెడ్డీస్‌ లైఫ్‌సైన్సెస్‌ ఇనిస్టిట్యూట్‌) సంతకాలు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పాల్గొన్నారు.

మిథనాల్‌ నుంచి హైడ్రోజన్‌ను తయారు చేసే పరికరాన్ని రూపొందించిన ఐఐటీ?

సులువుగా,  తక్కువ ఖర్చుతో అప్పటికప్పుడు మిథనాల్‌ నుంచి అత్యంత స్వచ్ఛమైన హైడ్రోజన్‌ వాయువును తయారు చేసేందుకు ఐఐటీ వారణాసి పరిశోధకులు ఓ పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరాన్ని పెట్రోల్‌ బంకుల్లో స్థాపించి మెంబ్రేన్‌ టెక్నాలజీ ఆధారంగా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయొచ్చు. లా ఉత్పత్తయ్యే వాయువుతో హైడ్రోజన్‌తో నడిచే వాహనాలకు ఇంధనంగా వాడుకోవచ్చు. అలాగే దీని నుంచి తయారైన విద్యుత్‌ను ఎలక్ట్రిక్‌ వాహనాలకు చార్జింగ్‌ చేసుకునేందుకు, మొబైల్‌ టవర్లకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఉపయోగపడుతుంది.
 

చ‌ద‌వండి:  దేశంలోని ఏ రాష్ట్రంలో రాంజీ గోండ్‌ మ్యూజియం ఏర్పాటు కానుంది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఫ్లో కెమిస్ట్రీలో కొత్తగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీఓఈ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయం
ఎప్పుడు   : నవంబర్ 25
ఎవరు    : తెలంగాణ  ప్రభుత్వం   
ఎక్కడ    : డాక్టర్‌ రెడ్డీస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌సైన్సెస్‌, హైదరాబాద్‌
ఎందుకు : ఫార్మారంగంలో బహుళ ప్రయోజనాలతో కూడిన ఆవిష్కరణల కోసం..

డౌన్‌లోడ్‌చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌చేసుకోండి.

యాప్‌డౌన్‌లోడ్‌ఇలా...
డౌన్‌లోడ్‌వయా గూగుల్‌ప్లేస్టోర్‌

Published date : 26 Nov 2021 08:04PM

Photo Stories