Skip to main content

AP Schemes: ఏపీలో Family Doctor ఆగస్టు 15 నుంచి మొదలు

ఆంధ్రప్రదేశ్ లో ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలుకు వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఆగస్టు 15 నుంచి ఈ విధానం అమలు చేయాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
Starts AP Family Doctor scheme
Starts AP Family Doctor scheme

ఈ క్రమంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ట్రయల్‌ రన్‌ ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానంపై క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశా వర్కర్, ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీ నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకూ ప్రతి ఒక్కరూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 26 జిల్లాల వారీగా మాస్టర్‌ ట్రైనర్‌లను గుర్తించి, వారికి జూలై 27న విజయవాడలో శిక్షణ ఇచ్చారు. వీరు జిల్లాల్లోని వైద్యులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నూతనంగా అందుబాటులోకి తెస్తున్న ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో ఆశ వర్కర్, ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీ, మెడికల్‌ ఆఫీసర్‌ తదితరుల్లో ఎవరి పాత్ర ఏంటనే దానిపై వైద్య శాఖ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) రూపొందిస్తోంది. గ్రామ సచివాలయాలు కేంద్ర బిందువుగా 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (ఎంఎంయూ)ల ద్వారా ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రజలకు చేరువ చేయనున్నారు.  

also read: Top 10 Richest Women in India 2022

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 28 Jul 2022 06:18PM

Photo Stories