మే 2021 రాష్ట్రీయం
Sakshi Education
వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ప్రారంభమైన తేదీ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020 ఖరీఫ్‌కు సంబంధించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని పంపిణీ చేసింది. మే 25న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి బీమా పరిహారం కింద 15.15 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.1,820.23 కోట్లను కంప్యూటర్‌లో బటన్ నొక్కి జమ చేశారు. అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, తదితర ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి కోల్పోయిన రైతులకు ధీమా కల్పించేందుకు ఉద్దేశించిన ‘‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం’’ తొలుత 2020, డిసెంబర్ 15న ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్ నొక్కి ఈ పథకాన్ని ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020 ఖరీఫ్‌కు సంబంధించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం పంపిణీ
ఎప్పుడు : మే 25
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, తదితర ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి కోల్పోయిన రైతులకు
వైఎస్సార్ మత్స్యకార భరోసా ఫథకం తొలుత ఎక్కడ ప్రారంభమైంది ?
చేపల వేటపై నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ఉద్దేశించిన వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం వరుసగా మూడో ఏడాది అమలైంది. పథకం కింద వరుసగా మూడో ఏడాది 1,19,875 మత్స్యకార కుటుంబాలకు మే 18న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్ నొక్కి రూ.10 వేల చొప్పున రూ.119.88 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. కార్యక్రమం సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ఆక్వా రైతులతో పాటు ఏ ఒక్క మత్స్యకారుడు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ఆక్వా హబ్‌ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఒక్కో హబ్ కింద 120 రిటెయిల్ షాప్‌ల చొప్పున మొత్తం 12 వేల షాప్‌లు వస్తాయని, రెండేళ్లలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నామని వెల్లడించారు. వీటి ద్వారా ఆక్వా ఉత్పత్తులతో పాటు మత్స్యకారుల చేపలకు గిట్టుబాటు ధర లభిస్తుందని చెప్పారు.
2019, నవంబర్ 21న ప్రారంభం...
ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా 2019, నవంబర్ 21న తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కొమానపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం అమలు
ఎప్పుడు : మే 18
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా
ఎందుకు: చేపల వేటపై నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు..
ఇటీవల ఆయుష్మాన్ భారత్‌లో పథకంలో చేరిన దక్షిణాది రాష్ట్రం?
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్‌లో చేరాలని, రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని దీనికి అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి మే 18న ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలుకు సంబంధించి రాష్ట్ర వైద్యశాఖ అధికారులు నేషనల్ హెల్త్ అథారిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఆయుష్మాన్ భారత్...
దేశంలోని పేదలకు రూ.5లక్షల ఆరోగ్య బీమాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆయుష్మాన్ భారత్ (ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2018, సెప్టెంబర్ 23న జార్ఖండ్‌లోని రాంచీలో ప్రారంభించారు. ఈ పథకం కింద 1393 రకాలైన వ్యాధులకు చికిత్స అందిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆయుష్మాన్ భారత్‌లో చేరాలని నిర్ణయం
ఎప్పుడు : మే 18
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఎందుకు: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని...

Published date : 29 Jun 2021 03:02PM