Kinetic Green Energy: కైనెటిక్ ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ యూనిట్ ఎక్కడ ఏర్పాటుకానుంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలో రూ.1,750 కోట్లతో ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌తోపాటు బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ఏర్పాటుచేసేందుకు కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ముందుకొచ్చింది. సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓ అయిన సులజ్జ ఫిరోదియా మొత్వాని, సహ వ్యవస్థాపకులు రితేష్ మంత్రి అక్టోబర్ 1న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా విశాఖలో బ్రాండెడ్ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వారు సీఎంకు తెలిపారు. అలాగే, స్కిల్ డెవలప్‌మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కూడా ఏర్పాటుచేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పూణె సమీపంలోని అహ్మద్‌నగర్‌లో నెలకు 6,000 ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సామర్ధ్యంగల ప్లాంట్‌ని ఈ సంస్థ ఏర్పాటుచేసింది.
చదవండి: రాష్ట్రంలోని ఏ జిల్లాలో బ్లూ స్టార్ తయారీ యూనిట్ ఏర్పాటవుతోంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్
ఎక్కడ : విశాఖపట్నం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్