Skip to main content

జూన్ 2018 రాష్ట్రీయం

తెలంగాణలో చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు
తెలంగాణలో 21 జిల్లాలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ల (డీసీపీయు)ను నెలకొల్పేందుకు ప్రభుత్వం జూన్ 17న ఆమోదం తెలిపింది. బాలల హక్కులను పరిరక్షించడంతోపాటు వారు లైంగిక వేధింపులకు గురికాకుండా చేయడానికి ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే పది జిల్లాల్లో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు (డీసీపీయు) ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ల ఏర్పాటు
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : 21 జిల్లాల్లో
ఎందుకు : బాలల పరిరక్షణ కోసం

కాప్-కనెక్ట్’ యాప్ ఆవిష్కరణ
పోలీస్ శాఖలో సమాచార మార్పిడి కోసం పోలీస్ శాఖ రూపొందించిన ‘కాప్-కనెక్ట్’ అనే యాప్‌ను తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి జూన్ 18న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా అప్పటికప్పుడు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఆదేశాలు, సూచనలు, సందేశాల వంటి వాటిని డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు 63 వేల మంది ఒకేసారి చూడవచ్చు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 638 పోలీస్‌స్టేషన్లకు ఒకేసారి ఆదేశాలు జారీ చేయడంతోపాటు వెయ్యి మందితో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడవచ్చు. దీనిని సిబ్బంది ఫోన్ నంబర్ల ఆధారంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా వాడుకలోకి తీసుకురానున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘కాప్-కనెక్ట్’ యాప్ ఆవిష్కరణ
ఎప్పుడు : జూన్
ఎవరు : డీజీపీ మహేందర్‌రెడ్డి
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : పోలీస్ శాఖలో సమాచార మార్పిడి కోసం

వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామా ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యులు ఏప్రిల్ 6న ఇచ్చిన రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ జూన్ 6న ఆమోదించారు. రాజీనామా చేసిన వారిలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామా ఆమోదం
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్

కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు
తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) జూన్ 6న ఆమోదం తెలిపింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి కావలసిన అన్ని అనుమతులు లభించినట్లయింది. కాళేశ్వరం ద్వారా 18.25 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిచనున్నారు. అదే విధంగా 195 టీఎంసీల గోదావరి నీటిని మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఎత్తిపోసి మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ఎల్లంపల్లి ద్వారా లభ్యమయ్యే 20 టీఎంసీలు, భూగర్భ జలాల నుంచి వచ్చే 25 టీఎంసీలతో సహా మొత్తం 240 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఇందులో 237 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి కేంద్ర జల సంఘం అంగీకారం తెలిపింది. చివరగా ప్రాజెక్టుకు సంబంధించిన జలవనరుల మంత్రిత్వ శాఖ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ (పెట్టుబడి అనుమతి) మాత్రమే మిగిలి ఉంది.
కాళేశ్వరానికి ఇప్పటి వరకు లభించిన అనుమతులు
  1. పర్యావరణ ప్రభావ నివేదిక తయారీకి టీఓఆర్
  2. మేడిగడ్డ వద్ద 75 శాతం డిపెండబిలిటీతో 283.3 టీఎంసీలకు హైడ్రాలజీ క్లియరెన్స్
  3. అంతర్రాష్ట్ర అనుమతి
  4. కేంద్ర భూగర్భ జల శాఖ
  5. కన్‌స్ట్రక్షన్ అండ్ మిషనరీస్ డెరైక్టరేట్
  6. అటవీ మంత్రిత్వ శాఖ తుది అనుమతి
  7. పర్యావరణ తుది అనుమతి
  8. ఇరిగేషన్ ప్లానింగ్
  9. ప్రాజెక్టు అంచనా
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాళేశ్వరం ప్రాజెక్టుకు టీఏసీ ఆమోదం
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : కాళేశ్వర

84 కేజీబీవీల్లో ఇంటర్ ప్రారంభం
రాష్ట్రంలోని 84కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం జూన్ 7న ప్రకటించింది. ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేసిన ప్రతి 3 కేజీబీవీల్లో రెండింటిలో సైన్స్ గ్రూపులు, ఒక దాంట్లో ఆర్‌‌ట్స గ్రూపులు ఉంటాయి. ఈ మేరకు కేబ్ కమిటీ చేసిన సిఫార్సులను అనుసరించి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ కాలేజీల్లోనూ కేజీబీవీ విద్యార్థులకు 25 శాతం కోటా ఇవ్వనున్నారు. తెలంగాణలో మొత్తం 475 కేజీబీవీలు ఉన్నాయి.
ప్రస్తుతం కేజీబీవీల్లో ప్రతి సెక్షన్‌కు 20 మందినే తీసుకోవాలన్న నిబంధన ఉండగా దానిని 40కి పెంచి ఆర్‌‌ట్స, సైన్స్ గ్రూపులు ఉండేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన సిఫార్సును కేంద్రం అంగీకరించింది. మరో వైపు రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లోని 6.25 లక్షల మంది బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్‌ను తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. అదే విధంగా కిశోర బాలిక స్వాస్థ్య యోజన పథకం కింద బాలికలకు 6 రూపాయలకు 6 న్యాప్కిన్లు కేంద్ర వైద్య శాఖ అందిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 84 కేజీబీవీల్లో ఇంటర్ ప్రారంభం
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణ

సాక్షి కి ఐసీక్యూసీలో సభ్యత్యం
Current Affairs ‘సాక్షి’ దినపత్రిక 2018-20 సంవత్సరాలకుగాను అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ కలర్ క్వాలిటీ క్లబ్ (ఐసీక్యూసీ)లో సభ్యత్వం పొందింది. ఈ మేరకు వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ పబ్లిషర్స్ (వాన్-ఇఫ్రా) జూన్ 8న ప్రకటించింది. సాక్షి మీడియా గ్రూప్ తెలుగు రాష్ట్రాల్లోని 22 ముద్రణా కేంద్రాల తరఫున పోటీలో పాల్గొనగా అన్నింటికి ఐసీక్యూసీ సభ్యత్వం కల్పించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 22 ఎడిషన్లలో సభ్యత్వం సాధించిన సంస్థగా సాక్షి రికార్డు నెలకొల్పింది.
1994 నుంచి వార్తా పత్రికలు, పబ్లిషింగ్ సంస్థలు ముద్రణలో పాటిస్తున్న నాణ్యతకు సంబంధించి వాన్ ఇఫ్రా పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రమాణాలు పాటించిన దినపత్రికకు ఐసీక్యూసీలో సభ్యత్వం కల్పిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వాన్-ఇఫ్రా ఇంటర్నేషనల్ కలర్ క్వాలిటీ క్లబ్‌లో సభ్యత్వం
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : సాక్షి దినపత్రిక
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఎందుకు : ముద్రణలో ఉత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందుకు

ఆధ్యాత్మిక గురువు భయ్యూ మహరాజ్ ఆత్మహత్య
మధ్యప్రదేశ్‌కి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు భయ్యూ మహారాజ్(50) జూన్ 12న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు భయ్యూ ఇండోర్‌లోని తన నివాసంలో తుపాకీతో కాల్చుకున్నారని ఇండోర్ డీఐజీ హెచ్‌సీ మిశ్రా తెలిపారు.
1968లో మధ్యప్రదేశ్‌లోని సుజల్‌పూర్‌లో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన భయ్యూ అసలు పేరు ఉదయ్‌సింగ్ దేశ్‌ముఖ్. సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో భయ్యూ మహారాజ్‌కు వేల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అలాగే ప్రధాని మోదీతో పాటు దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, సినీ నటులతో భయ్యూకు సత్సంబంధాలు ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆత్మహత్య చేసుకున్న ఆధ్యాత్మిక గురువు
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : భయ్యూ మహారాజ్ (50)
ఎక్కడ : ఇండోర్, మహారాష్ట్ర

తెలుగు రాష్ట్రాల ఎస్‌హెచ్‌జీలకు జాతీయ అవార్డులు
పొదుపు ద్వారా స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుకున్న తెలుగు రాష్ట్రాల్లోని ఐదు స్వయం సహాయక సంఘాలకు జాతీయస్థాయి అవార్డులు లభించాయి. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధుల విభాగం జూన్ 11న ఈ అవార్డులను ప్రదానం చేసింది.
అవార్డులను పొందిన ఎస్‌హెచ్‌జీలు

సంఘం పేరు

గ్రామం

మండలం

జిల్లా

రాష్ట్రం

మహాలక్ష్మి

వడియంపేట

బుక్కరాయసముద్రం

అనంతపురం

ఆంధ్రప్రదేశ్

యారాబ్

నన్నూర్

ఓర్వకల్లు

కర్నూలు

ఆంధ్రప్రదేశ్

శ్రీమహాలక్ష్మి

అలకనారాయణ పురం

చీపురుపల్లి

విజయనగరం

ఆంధ్రప్రదేశ్

ముదిరాజ్

ఎలుకుర్తి

గీసుకొండ

వరంగల్ రూరల్

తెలంగాణ

శ్రీలక్ష్మి మహిళ

దేవునిపల్లి

కామారెడ్డి

కామారెడ్డి

తెలంగాణ

క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వయం సహాయక సంఘాలకు జాతీయ అవార్డులు
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఎందుకు : పొదుపు ద్వారా ఆర్థికంగా మెరుగుపడి నందుకు

రైల్వేల్లో మహిళల భద్రతకు సుభద్ర వాహిని’
రైల్వేల్లో మహిళా ప్రయాణికులకు భద్రత క ల్పించేందుకు ‘సుభద్ర వాహిని’ అనే ప్రత్యేక మహిళా బృందాన్ని తూర్పు కోస్తా రైల్వేలోని వాల్తేరు డివిజన్‌లో జూన్ 11న ప్రారంభించారు. ఈ బృందం ైరె ళ్లు, స్టేషన్లలో నిరంతరం మహిళల భద్రతను పర్యవేక్షిస్తుంటుంది. ఈ మేరకు వాల్తేర్ డివిజన్ మేనేజర్ ముకుల్ శరణ్ మథుర్ 32 మందితో కూడిన ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుళ్లు, మహిళా టీసీల బృందాన్ని ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుభద్ర వాహిని టీం ఏర్పాటు
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : వాల్తేరు రైల్వే డివిజన్ మేనేజర్ శరణ్ మథుర్
ఎందుకు : రైల్వేల్లో మహిళల భద్రతకు
ఎక్కడ : విశాఖపట్నం, తూర్పు కోస్తా రైల్వే

ఆంధ్రప్రదేశ్‌లో భూ సేవ’ కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్‌లో జూలై 1 నుంచి ‘భూ సేవ’ కార్యక్రమం ను ప్రారంభించనున్నట్లు భూ సేవ ప్రాజెక్టు డెరైక్టర్ విజయ్‌మోహన్ జూన్ 12న తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మనుషులకు ఆధార్ తరహాలోనే గ్రామీణ, పట్టణ భూములు/స్థలాలకు 11 అంకెల భూదార్ నంబర్‌ను కేటాయిస్తారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని 12 మండలాలు, 12 మున్సిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని చేపడతారు. ఇప్పటికే కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం, ఉయ్యూరు మున్సిపాలిటీలో భూ సేవ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రక్రియను 2018 అక్టోబర్ నాటికి పూర్తి చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘భూ సేవ’ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : జూలై 1
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : 12 జిల్లాల్లోని 12 మండలాలు, 12 మున్సిపాలిటీలు
ఎందుకు : 11 అంకెల భూదార్ నంబర్‌ను కేటాయించేందుకు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షంగా వేప
Current Affairs ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షంగా వేపచెట్టును ప్రభుత్వం గుర్తించింది. అలాగే రాష్ట్ర పుష్పంగా మల్లె, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పక్షిగా రామచిలుకను గుర్తిస్తూ మే 30న ఉత్తర్వులు జారీ చేసింది. ఔషధ నిలయమైన వేపచెట్టు శాస్త్రీయ నామం అజాడిరక్ట ఇండికా కాగా కృష్ణ జింక శాస్త్రీయ నామం ఆంటిలోప్ సెర్వికాప్రా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాల జాబితా

చిహ్నం

వాడుక పేరు

శాస్త్రీయనామం

రాష్ట్ర వృక్షం

వేప

అజాడిరక్ట ఇండికా

రాష్ట్ర పుష్పం

మల్లె

జాస్మినమ్

రాష్ట్ర జంతువు

కృష్ణజింక

ఆంటిలోప్ సెర్వికాప్రా

రాష్ట్ర పక్షి

రామచిలుక

సిట్టేసిఫోమ్స్


తెలంగాణ ఐటీ వృద్ధి 9.32 శాతం
2017-18 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఐటీ వృద్ధి రేటు 9.32 శాతంగా నమోదుకాగా రూ.93,442 కోట్ల ఐటీ, ఐటీ ఆధారిత ఉత్పత్తులను రాష్ట్రం ఎగుమతి చేసింది. ఈ మేరకు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు జూన్ 1న ఒక నివేదికను విడుదల చేశారు.
2017-18లో జాతీయ సగటు ఐటీ వృద్ధి రేటు 7-9 శాతంగా ఉంది. 2020 నాటికి 16 శాతం ఐటీ వృద్ధి రేటుతో రూ.1.2 లక్షల కోట్ల వార్షిక ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు సాధించి 4 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు, 20 లక్షల మందికి పరోక్ష ఉపాధి కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ ఐటీ వృద్ధి 9.32 శాతం
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

రైతుబంధు’కు స్కోచ్ అవార్డు
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘రైతుబంధు’పథకానికి స్కోచ్ అవార్డు లభించింది. ఈ మేరకు స్కోచ్ గ్రూప్ సంస్థ జూన్ 2న వ్యవసాయశాఖకు లేఖ రాసింది. ఢిల్లీలో జూన్ 23న జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
మే 10న కరీంనగర్ జిల్లాలోని శాలపల్లి-ఇందిరానగర్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైతుబంధు పథకానికి స్కోచ్ అవార్డు
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : స్కోచ్ గ్రూప్ సంస్థ

ఆయిల్‌ఫెడ్‌కు తెలంగాణ ఉత్తమ అవార్డు
భారీ పరిశ్రమల కేటగిరీ కింద ఆయిల్‌ఫెడ్‌కు తెలంగాణ ఉత్తమ సృజనాత్మక అవార్డు జూన్ 4న లభించింది. పామాయిల్ తోటల ద్వారా రైతులకు చేస్తున్న సేవలు, పామాయిల్ గెలల నుంచి రైతులకు రికవరీ శాతం అధికంగా చూపిస్తూ వారికి గిట్టుబాటు ధర కల్పనకు చేస్తున్న కృషికిగాను ఆయిల్‌ఫెడ్‌కు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆయిల్‌ఫెడ్‌కు తెలంగాణ ఉత్తమ అవార్డు
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : భారీ పరిశ్రమల కేటగిరీ కింద
ఎందుకు : రైతులకు సేవలు చేస్తున్నందుకు

ఏపీలో మనఊరు-మనబడి కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రవేశపెట్టిన మనఊరు-మనబడి కార్యక్రమం జూన్ 4న ప్రారంభమైంది. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత, అనుభవం, సమర్థత, అంకితభావం కలిగిన టీచర్లు ఉంటారని ప్రజలకు తెలియజేస్తారు. జూన్ 5 నుంచి 11 వరకు వివిధ కార్యక్రమాల ద్వారా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే కార్యక్రమాలు చేపడతారు
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రారంభమైన మనఊరు-మనబడి
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి

ఏపీఐఐసీకి స్కోచ్ అవార్డు
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ)కి వరుసగా రెండోసారి స్కోచ్ అవార్డు లభించింది. పారిశ్రామిక ప్రాజెక్టుల్లో థర్డ్ పార్టీ మానిటరింగ్ విభాగంలో ఈ అవార్డు దక్కింది. 2017లో స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్స్, స్కోచ్ సిల్వర్ అవార్డులను ఏపీఐఐసీ గెలుచుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్కోచ్ అవార్డు 2018
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : ఏపీ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్
ఎక్కడ : పారిశ్రామిక ప్రాజెక్టుల్లో థర్డ్ పార్టీ మానిటరింగ్ విభాగంలో

సాక్షి’ కార్టూనిస్ట్‌కు అంతర్జాతీయ అవార్డు
‘సాక్షి’ కార్టూనిస్ట్ పామర్తి శంకర్‌కు అంతర్జాతీయ అవార్డు లభించింది. ‘ఎండ్ ఆఫ్ టైజం’ పేరిట ఇరాన్‌లో జరిగిన కార్టూన్ల పోటీలో మయన్మార్‌లో రోహింగ్యాలపై జరిగిన దాడిని ఉద్దేశించి ఆయన గీసిన ఆంగ్‌సాన్ సూకీ క్యారికేచర్ ద్వితీయ బహుమతి పొందింది. ఇప్పటికే వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రీ అవార్డు (2015)తో పాటు పలు అంతర్జాతీయ పురస్కారాలను శంకర్ అందుకున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘సాక్షి’ కార్టూనిస్ట్‌కు అంతర్జాతీయ అవార్డు
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : పామర్తి శంకర్
ఎక్కడ : ‘ఎండ్ ఆఫ్ టైజం’ పోటీలు, ఇరాన్
ఎందుకు : ఆంగ్‌సాన్ సూకీ క్యారికేచర్ కు


బాలల రక్షణకు 1098 హెల్ప్‌లైన్

తెలంగాణలో బాలల రక్షణకు పోలీసు శాఖ 1098 హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించింది. చిన్నారులు ఆపదలో ఉన్నారని ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే పోలీస్ శాఖ త క్షణమే వారిని ఆదుకునే దిశగా చర్యలు చేపడుతుంది. పిల్లలపై ఎవరైనా హింస, అఘాయిత్యం, బాల్య వివాహాలు, యాచన చేయించడం వంటి చర్యలకు పాల్పడినప్పుడు, తప్పిపోయినా లేదా అనాథ బాలలు ఎదురైనప్పుడు ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 1098 హెల్ప్‌లైన్ ప్రారంభం
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : తెలంగాణ పోలీస్ శాఖ
ఎక్కడ : తెలంగాణలో
ఎందుకు : ఆపదలో ఉన్న చిన్నారులను రక్షించేందుకు
Published date : 03 Jul 2018 05:38PM

Photo Stories