జనవరి 2021 రాష్ట్రీయం
దేశంలోనే తొలిసారిగా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటివద్దకే రేషన్ సరుకుల సరఫరా వాహనాలను ప్రారంభించింది. తొలుత గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,503 వాహనాలను... కృష్ణా జిల్లా విజయవాడ బెంజిసర్కిల్‌లో జనవరి 21న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహనాలు ప్రారంభమయ్యాయి. రేషన్ సరుకుల కోసం కార్డుదారులు ముఖ్యంగా రోజువారీ కూలీలు, వృద్ధులు, రోగులు ఎదుర్కొంటున్న అవస్థలను తొలిగించేందుకు ఈ వాహనాలను ప్రారంభించారు.
ప్రతి నెలా నాణ్యమైన బియ్యం తీసుకునేందుకు వీలుగా, తిరిగి వినియోగించుకునేలా ఒకసారి ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనున్న నార సంచులను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ముఖ్యాంశాలు....
- రాష్ట్రవ్యాప్తంగా 2021, ఫిబ్రవరి 1వతేదీ నుంచి నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం 9,260 వాహనాలు సిద్ధమయ్యాయి.
- నాణ్యమైన బియ్యం పంపిణీ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏటా రూ.830 కోట్లు అదనపు భారం పడనుంది.
- 9,260 రేషన్ సరుకుల సరఫరా వాహనాల కోసం రూ.539 కోట్ల వ్యయం చేశారు.
- నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించేందుకు ఈ వాహనాలను వివిధ కార్పొరేషన్ల ద్వారా 60 శాతం సబ్సిడీతో ప్రభుత్వం సమకూర్చింది. ఒక్కో వాహనం విలువ రూ. 5,81,000.
- ఈ వాహనాలకు పౌరసరఫరాల సంస్ధ ప్రతి నెలా అద్దె చెల్లిస్తూ ఆరేళ్ల పాటు వినియోగించుకోనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంటివద్దకే రేషన్ సరుకుల సరఫరా వాహనాలు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : విజయవాడ, కృష్ణా జిల్లా
ఎందుకు : రేషన్ సరుకుల కోసం కార్డుదారులు ముఖ్యంగా రోజువారీ కూలీలు, వృద్ధులు, రోగులు ఎదుర్కొంటున్న అవస్థలను తొలిగించేందుకు
పీవీ విజ్ఞాన వేదికను ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు?
బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతదేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ప్రత్యేకతలను భావితరాలకు తెలియజేసేందుకు పీవీ సొంత గ్రామమైన వంగరలో ఓ విజ్ఞానవేదిక రూపుదిద్దుకుంటోంది. తెలంగాణ పర్యాటకాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ వేదిక నిర్మిస్తున్నారు. త్వరలో పనులు మొదలుకానున్నాయి. 2022లో పీవీ జయంతి నాటికి వేదికను ప్రారంభించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ‘‘పీవీ విజ్ఞాన వేదిక’’ పేరుతో నాలుగు ఎకరాల్లో దీన్ని రూపొందిస్తున్నారు. పర్యాటకులు పీవీ గురించి తెలుసుకునేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు. వంగర గ్రామం ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లా బీమదేవరపల్లి మండలంలో ఉంది.
మ్యూజియంగా పీవీ ఇల్లు
వంగర గ్రామంలో పీవీ నరసింహారావు నివసించిన ఇంటిని మ్యూజియంగా అభివృద్ధి చేస్తున్నారు. ఆయన వాడిన వస్తువులు, ఆయన ఛాయాచిత్రాలు ఇందులో ఉంటాయి. ఈ ప్రాజెక్టుకు రూ.11 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం రూ.7 కోట్లు కేటాయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీవీ విజ్ఞాన వేదిక నిర్మాణం
ఎప్పుడు : జనవరి 22
ఎవరు : తెలంగాణ పర్యాటకాభి వృద్ధి సంస్థ
ఎక్కడ : వంగర, బీమదేవరపల్లి మండలం, వరంగల్ అర్బన్ జిల్లా
ఎందుకు : భారతదేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ప్రత్యేకతలను భావితరాలకు తెలియజేసేందుకు
మహిళా ఇన్నోవేషన్ బలోపేతమే లక్ష్యంగా ఏ రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది?
దేశంలో మహిళా ఇన్నోవేషన్ బలోపేతమే లక్ష్యంగా తెలంగాణకి చెందిన ‘వీ హబ్’, గుజరాత్‌కు చెందిన ‘ఐ హబ్’ల మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. జనవరి 16న వర్చువల్ విధానంలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు, గుజరాత్ విద్యా శాఖ మంత్రి భూపేంద్ర సిన్హా చుడాసమ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి విభావరి బెన్ దవే పాల్గొన్నారు. ఒప్పందంలో భాగంగా రెండు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 240 స్టార్టప్‌లకు అన్ని విధాల చేయూత అందిస్తారు.
తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన వీ హబ్ (ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ హబ్-WE HUB) కార్యక్రమం 2018, మార్చి 8న ప్రారంభమైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణకి చెందిన ‘వీ హబ్’, గుజరాత్‌కు చెందిన ‘ఐ హబ్’ల మధ్య పరస్పర అవగాహన ఒప్పందం
ఎప్పుడు : జనవరి 16
ఎక్కడ : వర్చువల్ విధానంలో
ఎందుకు : దేశంలో మహిళా ఇన్నోవేషన్ బలోపేతమే లక్ష్యంగా
ఏపీలోని ఏ జిల్లాలో స్టీల్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది?
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో భారీ స్టీల్ క్లస్టర్‌ను ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలశాఖ డెరైక్టర్ జవ్వాది సుబ్రమణ్యం జనవరి 13న తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పూర్ణోదయ ప్రాజెక్టు కింద విశాఖ నగరం సమీపంలో పూడిమడక వద్ద సుమారు వెయి్య ఎకరాల్లో స్టీల్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. తయారీ వ్యయాన్ని తగ్గించడం ద్వారా ఎగుమతి అవకాశాలను పెంచుకునే లక్ష్యంతో ఈ స్టీల్ క్లస్టర్ ఏర్పాటు కానుంది.
మరోవైపు అనంతపురంలో అపెరల్ పార్కు, చిత్తూరు జిల్లా నగరిలో టెక్స్‌టైల్ పార్కులతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఆటో, ఏరోస్పేస్, ఇంజనీరింగ్ వంటి పదిరంగాల్లో థీమ్ ఆధారిత పార్కులను అభివృద్ధి చేయడానికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారీ స్టీల్ క్లస్టర్‌ను ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : పూడిమడక, విశాఖపట్నం జిల్లా
ఎందుకు : తయారీ వ్యయాన్ని తగ్గించడం ద్వారా ఎగుమతి అవకాశాలను పెంచుకునే లక్ష్యంతో
బయో ఏషియా-2021 సదస్సు థీమ్ ఏమిటి?
2021, ఫిబ్రవరి 22, 23 తేదీల్లో బయో ఏషియా 18వ వార్షిక సదస్సు జరగనుంది. వర్చువల్ విధానంలో జరిగే ఈ సదస్సు పోస్టర్, లోగోను జనవరి 18న హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఆవిష్కరించారు. లైఫ్ సెన్సైస్ రంగానికి తెలంగాణలో ఉన్న అవకాశాలు, సవాళ్లు, పరిష్కారాలను చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘బయో ఏషియా’వార్షిక సదస్సును నిర్వహిస్తోంది.
బయో ఏషియా-2021 సదస్సు థీమ్: మూవ్ ది నీడిల్
ముఖ్యాంశాలు...
- 18వ బయో ఏషియా వార్షిక సదస్సు ఎజెండా కోవిడ్- 19 కేంద్రంగా ఉండనుంది.
- తెలంగాణ రాష్ట్ర లైఫ్ సెన్సైస్ సలహామండలి ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది.
- ప్రస్తుతం బయో ఏషియా సీఈఓగా శక్తి నాగప్పన్ ఉన్నారు.
- సుమారు 50 దేశాలకు చెందిన 1500 మంది నిపుణులు సదస్సులో పాల్గొననున్నారు.
- కరోనా నేపథ్యంలో సదస్సును తొలిసారిగా వర్చువల్ విధానంలో నిర్వహించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2021, ఫిబ్రవరి 22, 23 తేదీల్లో బయో ఏషియా 18వ వార్షిక సదస్సు నిర్వహణ
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : వర్చువల్ విధానంలో
ఎందుకు : లైఫ్ సెన్సైస్ రంగానికి తెలంగాణలో ఉన్న అవకాశాలు, సవాళ్లు, పరిష్కారాలను చర్చించేందుకు
ఏపీ పోలీస్ తొలి డ్యూటీ మీట్ ఏ నగరంలో జరిగింది?
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ తొలి డ్యూటీ మీట్ చిత్తూరు జిల్లాలోని తిరుపతి నగరంలో జరిగింది. తిరుపతి ఎమ్మార్ పల్లి ఏఆర్ గ్రౌండ్‌లో జనవరి 4 నుంచి 7వ తేదీ వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీసు నుంచి వర్చువల్ విధానంలో జనవరి 4న ప్రారంభించారు. ఏపీ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో జరిగిన ఈ మీట్‌లో 13 జిల్లాల నుంచి 200 మంది పోలీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
డ్యూటీ మీట్‌లో భాగంగా... క్రీడలు, ప్రతిభా పాటవాల ప్రదర్శనలతో పాటు ప్రత్యేకంగా సాంకేతికత, నేరాల తీరు, దర్యాప్తు తదితర నైపుణ్యాలపై అవగాహన కల్పించేలా సింపోజియంలు ఏర్పాటు చేశారు. సైబర్ సేఫ్టీ, మహిళల రక్షణ వంటి అనేక కీలక విషయాలను తెలుసుకోవడానికి డ్యూటీ మీట్ వేదికై ంది. మహిళా భద్రతకు సంబంధించి పోలీస్ శాఖ, } పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదిరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ తొలి డ్యూటీ మీట్ నిర్వహణ
ఎప్పుడు : జనవరి 4 నుంచి 7వ తేదీ వరకు
ఎవరు : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ
ఎక్కడ : తిరుపతి, చిత్తూరు జిల్లా
ఎందుకు : సైబర్ సేఫ్టీ, మహిళల రక్షణ వంటి అనేక కీలక విషయాలను పోలీసులు తెలుసుకోవడానికి
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం?
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు బ్రిటన్‌లోని ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రాష్ట్ర పురపాలక శాఖ డెరైక్టర్-కమిషనర్ విజయ్‌కుమార్, కేంబ్రిడ్‌జ విశ్వవిద్యాలయం దక్షిణాసియా రీజనల్ డెరైక్టర్ టీకే అరుణాచలం జనవరి 7న అమరావతిలో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా... రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలతోపాటు పులివెందులలో ఇంగ్లిష్ ల్యాబ్‌లు, మరో మూడు కేంద్రాల్లో డిజిటల్ స్టూడియోలను కేంబ్రిడ్జ్ వర్సిటీ నెలకొల్పనుంది.
రహదారుల అభివృద్ధి కోసం ఎన్‌డీబీతో ఒప్పందం చేసుకున్న రాష్ట్రం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర, జిల్లా రహదారుల అభివృద్ధికి సంబంధించి రూ.472 కోట్ల విలువైన రెండు ప్రాజెక్టుల కోసం... న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ)తో కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి 6న రుణ ఒప్పందం చేసుకున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో ఒప్పందం
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు
రాష్ట్రంలో తొలి పశువుల హాస్టల్ ఎక్కడ ప్రారంభమైంది?
తెలంగాణ రాష్ట్రంలో తొలి పశువుల హాస్టల్ సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామంలో ప్రారంభమైంది. రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ హాస్టల్‌ను జనవరి 8న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. వ్యవసాయంతోపాటు, వ్యవసాయ అనుబంధ పాడి పరిశ్రమను కూడా అభివృద్ధి చేస్తే చిన్న, సన్నకారు రైతులు ఆర్థికంగా పరిపుష్టిని సాధిస్తారని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
సెంట్రీలుగా మహిళలు...
పోలీసుస్టేషన్లు, ఏసీపీ, డీసీపీ కార్యాలయాలతో పాటు పోలీసు కమిషనరేట్‌కూ నిత్యం పహారా అవసరం. ఈ విధులు నిర్వర్తించే వారినే పోలీసు పరిభాషలో సెంట్రీలని అంటారు. ఇప్పటివరకు పురుష కానిస్టేబుళ్లే సెంట్రీలుగా ఉండేవారు. అయితే తెలంగాణలోనే తొలిసారిగా హైదరాబాద్ కమిషనరేట్ అధికారులు.. ఈ విధుల్లో మహిళల్నీ వినియోగించుకోవాలని నిర్ణయించారు. మొదట బషీర్‌బాగ్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఉమెన్ సెంట్రీలను ఏర్పాటుచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ రాష్ట్రంలో తొలి పశువుల హాస్టల్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
ఎక్కడ : పొన్నాల గ్రామం, సిద్దిపేట జిల్లా
సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్ ప్రారంభం
హైదరాబాద్ నగరంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్ ప్రారంభమైంది. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్(రిచ్) ఆధ్వర్యంలో నడిచే ఈ క్టస్టర్‌ను జనవరి 8న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో రాష్ట్రంలో 5 పెద్ద కంపెనీలను ఏర్పాటు చేయడం ద్వారా సంపదతోపాటు లక్ష ఉద్యోగాలు సృష్టించడంపై దృష్టి సారించామని మంత్రి పేర్కొన్నారు.
పీఎం స్టియాక్...
దేశంలో శాస్త్ర పరిశోధన, ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఉద్దేశంతో ప్రధానమంత్రి శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణల సలహామండలి(పీఎం స్టియాక్) నిర్ణయం మేరకు హైదరాబాద్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ కె.విజయ రాఘవన్ తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేస్తున్న నాలుగు నగరాల్లో ఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ, పుణే ఈ జాబితాలో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : శాస్త్ర పరిశోధన, ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు
ఆలయాల పునః నిర్మాణానికి శంకుస్థాపన
కృష్ణా జిల్లా విజయవాడలో గతంలో కూల్చి వేసిన తొమ్మిది ఆలయాల పునః నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 9న శంకుస్థాపన చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భూమి పూజ చేశారు. దీంతో పాటు ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న శ్రీదుర్గ మల్లేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణకు రూ.77 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టనున్న 8 పనులకూ భూమి పూజ నిర్వహించారు. ప్రకాశం బ్యారేజీ సమీపంలో దాదాపు రూ.1.79 కోట్లతో తొమ్మిది ఆలయాలను పునః నిర్మిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు...
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జనవరి 8న షెడ్యూల్ జారీ చేశారు. 2021, జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 మధ్య నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని నిమ్మగడ్డ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొమ్మిది ఆలయాల పునః నిర్మాణానికి శంకుస్థాపన
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : విజయవాడ, కృష్ణా జిల్లా
అమ్మఒడి పథకం రెండో విడత ఎక్కడ ప్రారంభమైంది?
ఆంధ్రప్రదేశ్‌లో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘జగనన్న అమ్మఒడి’ పథకం కింద రెండో ఏడాది నగదు జమ కార్యక్రమం ప్రారంభమైంది. నెల్లూరులోని శ్రీవేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో జనవరి 9న నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నగదు జమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
పథకం-ముఖ్యాంశాలు
- అమ్మఒడి పథకం కింద విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు.
- అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది.
- ఈ పథకంలో విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి.
- 2020, జనవరి 9న చిత్తూరులో తొలిసారిగా ఈ పథకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు.
సీఎం ప్రసంగం-ముఖ్యాంశాలు
- 2022 ఏడాది నుంచి అమ్మ ఒడి కింద నగదుకు బదులుగా తల్లులు కోరుకుంటే ల్యాప్‌టాప్‌లు ఇస్తాం. 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు దీన్ని వర్తింపచేస్తాం.
- 42.33 లక్షల మంది పేద తల్లులకు 2020 ఏడాది రూ.6,400 కోట్లు ఇచ్చాం. 2021 సంవత్సరం 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.6,673 కోట్లు అమ్మఒడి కింద ఇస్తున్నాం.
- 2020 ఏడాది అమ్మఒడి కింద 82 లక్షల మంది పిల్లలకు లాభం కలిగితే ఈ ఏడాది 84 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతోంది.
- ప్రభుత్వ స్కూళ్లలో గతంలో దాదాపు 38 లక్షల మంది విద్యార్థులుంటే ఇప్పుడు 42 లక్షల మంది ఉన్నారు.
- పిల్లలు, మహిళా టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రతి ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో టాయిలెట్లను నిర్మించడమే కాకుండా నిర్వహణ కోసం అమ్మ ఒడిలో ఇచ్చే రూ.15 వేలల్లో రూ.1,000 మినహాయిస్తున్నాం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జగనన్న అమ్మఒడి పథకం రెండో విడత ప్రారంభం
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : శ్రీవేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణం, నెల్లూరు
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌లో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు
బొగ్గుగనుల మంత్రిత్వశాఖతో ఏపీఎండీసీ ఒప్పందం
జార్ఖండ్ రాష్ట్రంలోని అరుదైన కుకింగ్ కోల్ బ్లాక్ (బ్రహ్మదిహ కోల్ బ్లాక్)ను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కైవసం చేసుకుంది. బిడ్డింగ్‌లో ఏపీఎండీసీ ఎల్1గా నిలవడంతో ఆ బొగ్గు క్షేత్రాన్ని ఏపీఎండీసీకి అప్పగించారు. ఈ మేరకు జనవరి 11న ఢిల్లీలో కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వశాఖ - ఏపీఎండీసీ మధ్య ఒప్పందం కుదిరింది.
అత్యంత నాణ్యమైన, అరుదైన బొగ్గు
- జార్ఖండ్‌లోని గిరిడీ కోల్ ఫీల్డ్స్‌లో అత్యంత నాణ్యమైన, అరుదైన ఎస్1 రకం కుకింగ్ కోల్ ఉంది.
- దేశంలో వినియోగమయ్యే ఎస్1 రకం బొగ్గులో 1.5 శాతం మాత్రమే ఇక్కడ ఉత్పత్తి అవుతోంది. మిగిలిన 98.5 శాతం విదేశాల నుంచి దిగుమతి అవుతోంది.
- ఉక్కు కర్మాగారాల్లో బ్లాస్ట్ ఫర్నేస్ (ఉక్కును కరిగించడం) కోసం దీనిని వినియోగిస్తారు.
ఏపీఎండీసీకి 48.25 శాతం...
ఏపీఎండీసీకి లభించిన బహ్మదిహ బోగ్గు గనిలో 25 లక్షల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్లు అంచనా.
- బ్రహ్మదిహ క్షేత్రంలో తవ్వే బొగ్గు అమ్మకం ధరలో 41.75 శాతం జార్ఖండ్ రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా 48.25 శాతం ఏపీఎండీసీదన్నమాట. - బ్రహ్మదిహ బొగ్గు గనిని పొందడంవల్ల ఏపీఎండీసీకి రూ.250 నుంచి రూ.350 కోట్ల వరకు నికర రాబడి వస్తుందని అధికారుల అంచనా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వశాఖతో ఒప్పందం
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ
ఎందుకు : జార్ఖండ్ రాష్ట్రంలోని కుకింగ్ కోల్ బ్లాక్ (బ్రహ్మదిహ కోల్ బ్లాక్) నిర్వహణకు
మాస్ మ్యూచువల్ కెపబిలిటీ సెంటర్ ఎక్కడ ఏర్పాటు కానుంది?
అమెరికాకు చెందిన ప్రముఖ జీవిత బీమా, ఆర్థిక సేవల సంస్థ... మసాచుసెట్స్ మ్యూచువల్ ఇన్సూరెన్స్ (మాస్ మ్యూచువల్) కంపెనీ తమ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం (గ్లోబల్ కెపబిలిటీ సెంటర్)ను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయనుంది. రూ.1,000 కోట్ల పెట్టుబడులతో కంపెనీ తమ సెంటర్‌ను నెలకొల్పనుందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు జనవరి 11న ప్రకటించారు. 1851లో మాస్ మ్యూచువల్ కంపెనీ ఏర్పాటైంది.
జీసీసీలు ఏం చేస్తాయి?
- గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (జీసీసీ)లు నిపుణులైన ఉద్యోగులను, అత్యుత్తమ మౌలిక సదుపాయాలను ఒకేచోట కేంద్రీకృతం చేసి తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తాయి.
- బ్యాక్ ఆఫీసు సేవలు, కార్పొరేట్ వ్యాపార మద్దతు కార్యకలాపాలు, కాల్ సెంటర్ల సేవలు ఇక్కడి నుంచి కొనసాగిస్తాయి.
- ఐటీ సేవల విషయానికి వస్తే... యాప్‌ల అభివృద్ధి, నిర్వహణ, రిమోట్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్ప్ డెస్క్‌లు ఈ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల నుంచే నిర్వహిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : మసాచుసెట్స్ మ్యూచువల్ ఇన్సూరెన్స్ (మాస్ మ్యూచువల్) కంపెనీ
ఎక్కడ : హైదరాబాద్
ఏపీలో తొలి ఐటీ నైపుణ్య శిక్షణా కేంద్రం ఎక్కడ ప్రారంభమైంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఐటీ నైపుణ్య శిక్షణా కేంద్రం విజయవాడ ఆంధ్ర లయోలా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ప్రారంభమైంది. ఈ కేంద్రాన్ని ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఎంసీ సీఈవో ఆర్జా శ్రీకాంత్ జనవరి 7న ప్రారంభించారు. ఈ కేంద్ర ఏర్పాటు కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఐట్యాప్)తో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ఈ కేంద్రం ఏర్పాటైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఐటీ నైపుణ్య శిక్షణా కేంద్రం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)
ఎక్కడ : ఆంధ్ర లయోలా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, విజయవాడ
ఎందుకు : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు
డిజాస్టర్ రెస్సాన్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలు ప్రారంభం
ఏపీ అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ శాఖతోపాటు పోలీస్ శాఖకు సమకూర్చిన 14 డిజాస్టర్ రెస్సాన్స్, 36 ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలు డిసెంబర్ 31న ప్రారంభమయ్యియి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్ గ్రౌండ్‌లోని వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో జెండా ఊపి ప్రారంభించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ... అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ వాహనాలు దేశంలో ముంబై తర్వాత మన రాష్ట్రంలోనే అందుబాటులోకి వచ్చాయన్నారు. విపత్తు నిర్వహణ, అత్యవసర సేవల కోసం ప్రభుత్వం ఈ వాహనాలను అందించిందన్నారు. కంట్రోల్ రూమ్ నుంచి ఘటనా స్థలిని ఈ వాహనాల ద్వారా వీక్షించొచ్చని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 14 డిజాస్టర్ రెస్సాన్స్, 36 ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
ఎక్కడ : ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్ గ్రౌండ్, మంగళగిరి, గుంటూరు జిల్లా
ఎందుకు : విపత్తు నిర్వహణ, అత్యవసర సేవల కోసం
ఏఐ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిపై రూపొందించిన నివేదిక?
ఆధునిక ఐటీ సాంకేతికతలో భాగమైన కృత్రిమ మేధస్సు(ఏఐ) రంగంలో తెలంగాణ రాష్ట్రం 2020 ఏడాది సాధించిన విజయాలతో కూడిన ‘తెలంగాణాస్ ఇయర్ ఆఫ్ ఏఐ-2020 అండ్ బియాండ్’ అనే నివేదికను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు జనవరి 2న హైదరాబాద్‌లో విడుదల చేశారు. రాష్ట్రంలో ఏఐ విధానం అమలును వేగవంతం చేసేందుకు ‘తెలంగాణ ఏఐ మిషన్’(టీ-ఎయిమ్)ను ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
నివేదికలోని ముఖ్యాంశాలు...
- ఏఐ రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు 2020, జనవరి 2న రాష్ట్ర ప్రభుత్వం 2020ని ‘ఇయర్ ఆఫ్ ది ఏఐ’గా ప్రకటించింది.
- ‘ఏఐ ఫ్రేమ్‌వర్క్’ ఆచరణలోకి తెచ్చేందుకు నాస్కామ్ భాగస్వామ్యంతో ‘తెలంగాణ ఏఐ మిషన్’(టి ఎయిమ్) ఏర్పాటు చేసి ఆరు అంచెల వ్యూహాన్ని ప్రభుత్వం రూపొందించింది.
- ఆరోగ్య, రవాణా రంగాలపై దృష్టి కేంద్రీకరించేందుకు ఇంటెల్, ట్రిపుల్ ఐటీ (హైదరాబాద్), పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సహ భాగస్వామ్యంతో ‘ఏఐ పరిశోధన కేంద్రం’ఏర్పాటైంది.
- వ్యవసాయ, న్యాయ రంగాలపై ప్రాథమికంగా దృష్టి సారించేందుకు సెంటర్ ఫర్ ఫోర్ట్ ఇండస్ట్రియల్ రివల్యూషన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహకారంతో ‘సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ డిప్లాయ్‌మెంట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్(క్రెడెట్)’ ఏర్పాటైంది.
- -వరల్డ్ ఎకనామిక్ ఫోరం సాయంతో ‘ఏఐ4ఏఐ’, అగ్రిటెక్ ఇన్నోవేషన్ పైలట్స్, అగ్రిడేటా హబ్, డ్రోన్ల ద్వారా క్రిమి సంహారకాల పిచికారీ వంటి కార్యక్రమాలు నిర్వహించింది.
- రాష్ట్రంలో ఏఐ వాతావరణాన్ని పెంపొందించేందుకు ఇంటెల్, ఎన్‌విడియా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, నాస్కామ్, ఐఐటీ వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
- జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో ఆవిష్కర్తల కోసం అగ్రి డేటా హబ్‌ను నెలకొల్పింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణాస్ ఇయర్ ఆఫ్ ఏఐ-2020 అండ్ బియాండ్ నివేదిక విడుదల
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : ఆధునిక ఐటీ సాంకేతికతలో భాగమైన కృత్రిమ మేధస్సు(ఏఐ) రంగంలో తెలంగాణ రాష్ట్రం 2020 ఏడాది సాధించిన ప్రగతిని తెలిపేందుకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి డీశాలినేషన్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు కానుంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పారిశ్రామిక అవసరాలకు సముద్రపు నీటిని శుద్ధి (డీశాలినేషన్) చేసి వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో తొలి డీశాలినేషన్ ప్లాంట్‌ను నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం మెగా లెదర్ క్లస్టర్లో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. భూగర్భజలాలు కాకుండా పూర్తిగా సముద్రపు నీటినే వినియోగించే విధంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
536.88 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ మెగా లెదర్ క్లస్టర్‌కు రోజుకు 10.5 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుందని అంచనా. ఇందుకోసం రోజుకు 90 మిలియన్ లీటర్లకు పైగా సముద్రపు నీటిని శుద్ధిచేయాల్సి ఉంటుంది. ఇలా శుద్ధి చేయగా వచ్చిన మంచినీటిని వినియోగించి మిగిలిన నీటిని సముద్రంలోకి వదిలేస్తారు.
ఇజ్రాయెల్‌తో ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌లో డీశాలినేషన్ విధానంలో సముద్రపు నీటిని వినియోగించుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానం అందించేలా ఇజ్రాయేల్‌కు చెందిన ఐడీఈ టెక్నాలజీస్‌తో రాష్ట్ర ప్రభుత్వం 2020, ఫిబ్రవరిలో ఒప్పందం కుదుర్చుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ తొలి డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : కృష్ణపట్నం మెగా లెదర్ క్లస్టర్, నెల్లూరు జిల్లా
ఎందుకు : పారిశ్రామిక అవసరాలకు సముద్రపు నీటిని శుద్ధి (డీశాలినేషన్) చేసి వినియోగించుకోవాలని
షీ క్యాబ్స్ కార్యక్రమం ఏ జిల్లాలో ప్రారంభమైంది?
మహిళలకు షీ క్యాబ్స్ పేరుతో అద్దెకు నడిపి ఉపాధి పొందడానికి కార్లను అందజేసే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో పెలైట్ ప్రాజెక్టుగా జనవరి 4న ప్రారంభమైంది. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి ఎంపికైన 18 మందికి డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించి లెసైన్సులు ఇచ్చారు. క్యాబ్ డ్రైవర్స్ ఆత్మరక్షణకు పెప్పర్ స్ప్రే, సెల్‌ఫోన్, జియో లొకేషన్ సౌకర్యం కల్పించారు. ఈ పథకం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా దీనిని అమలు చేయనున్నారు.
ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తకు యంగ్ సైంటిస్ట్ అవార్డు
హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్-ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్త డా. శిబ్ శంకర్ గంగూలీ ‘నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ యంగ్ సైంటిస్టు ప్లాటినం జూబ్లీ అవారు’్డకు ఎంపికయ్యారు. భూగర్భశాస్త్ర, జియో ఫిజికల్ మెథడ్, ఆయిల్ ఫీల్డ్‌లో చేసిన పరిశోధనలకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : షీ క్యాబ్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు
ఎక్కడ : సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
ఎందుకు : మహిళలకు షీ క్యాబ్స్ పేరుతో అద్దెకు నడిపి ఉపాధి పొందడానికి
దేశంలోనే తొలి మెడికల్ డివెజైస్ పార్కు ఏక్కడ ఏర్పాటైంది?
దేశంలోనే తొలి మెడికల్ డివెజైస్ పార్క్ తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటైంది. వైద్య పరికరాల తయారీ కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ప్రభుత్వం ఈ మెడికల్ పార్క్‌ను ఏర్పాటు చేసింది. ఈ పార్క్ ఏర్పాటులో భాగంగా... 250 ఎకరాల్లో ఇప్పటికే మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి కాగా, రెండో దశ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. సుమారు రూ.వేయి కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ పార్క్ ద్వార 4 వేల మందికి ఉపాధి దక్కుతుందని అంచనా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలోనే తొలి మెడికల్ డివెజైస్ పార్క్ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : సుల్తాన్‌పూర్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
ఎందుకు : వైద్య పరికరాల తయారీ కోసం
ఏపీ పోలీస్ తొలి డ్యూటీ మీట్ ఏ నగరంలో జరిగింది?
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ తొలి డ్యూటీ మీట్ చిత్తూరు జిల్లాలోని తిరుపతి నగరంలో జరిగింది. తిరుపతి ఎమ్మార్ పల్లి ఏఆర్ గ్రౌండ్‌లో జనవరి 4 నుంచి 7వ తేదీ వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీసు నుంచి వర్చువల్ విధానంలో జనవరి 4న ప్రారంభించారు. ఏపీ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో జరిగిన ఈ మీట్‌లో 13 జిల్లాల నుంచి 200 మంది పోలీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
డ్యూటీ మీట్‌లో భాగంగా... క్రీడలు, ప్రతిభా పాటవాల ప్రదర్శనలతో పాటు ప్రత్యేకంగా సాంకేతికత, నేరాల తీరు, దర్యాప్తు తదితర నైపుణ్యాలపై అవగాహన కల్పించేలా సింపోజియంలు ఏర్పాటు చేశారు. సైబర్ సేఫ్టీ, మహిళల రక్షణ వంటి అనేక కీలక విషయాలను తెలుసుకోవడానికి డ్యూటీ మీట్ వేదికై ంది. మహిళా భద్రతకు సంబంధించి పోలీస్ శాఖ, } పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదిరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ తొలి డ్యూటీ మీట్ నిర్వహణ
ఎప్పుడు : జనవరి 4 నుంచి 7వ తేదీ వరకు
ఎవరు : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ
ఎక్కడ : తిరుపతి, చిత్తూరు జిల్లా
ఎందుకు : సైబర్ సేఫ్టీ, మహిళల రక్షణ వంటి అనేక కీలక విషయాలను పోలీసులు తెలుసుకోవడానికి
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం?
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు బ్రిటన్‌లోని ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రాష్ట్ర పురపాలక శాఖ డెరైక్టర్-కమిషనర్ విజయ్‌కుమార్, కేంబ్రిడ్‌జ విశ్వవిద్యాలయం దక్షిణాసియా రీజనల్ డెరైక్టర్ టీకే అరుణాచలం జనవరి 7న అమరావతిలో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా... రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలతోపాటు పులివెందులలో ఇంగ్లిష్ ల్యాబ్‌లు, మరో మూడు కేంద్రాల్లో డిజిటల్ స్టూడియోలను కేంబ్రిడ్జ్ వర్సిటీ నెలకొల్పనుంది.
రహదారుల అభివృద్ధి కోసం ఎన్‌డీబీతో ఒప్పందం చేసుకున్న రాష్ట్రం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర, జిల్లా రహదారుల అభివృద్ధికి సంబంధించి రూ.472 కోట్ల విలువైన రెండు ప్రాజెక్టుల కోసం... న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ)తో కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి 6న రుణ ఒప్పందం చేసుకున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో ఒప్పందం
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు