Vakula Matha Temple: వకుళమాత మహాసంప్రోక్షణ క్రతువులోఏపీ సీఎం వైఎస్ జగన్
Sakshi Education

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి మాతృమూర్తి శ్రీవకుళమాత ఆలయ జీర్ణోద్ధరణ క్రతువును వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని పేరూరు బండపై ఉన్న ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనుల్లో భాగంగా నిర్వహించిన మహా సంప్రోక్షణ కైంకర్యాది కార్యక్రమంలో జూన్ 23న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొన్నారు. 900 ఏళ్ల చరిత్ర కలిగి, 350 ఏళ్ల పాటు శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నిధులతో జీర్ణోద్ధరణ చేశారు. సీఎం వైఎస్ జగన్.. శ్రీవకుళమాత అమ్మవారి తొలి దర్శన భాగ్యాన్ని అందుకున్నారు.
Also read: BRICS: సార్వభౌమత్వాన్ని గౌరవించుకుందాం - బ్రిక్స్ శిఖరాగ్ర భేటీ తీర్మానం
Published date : 24 Jun 2022 04:47PM