Skip to main content

Andhra Pradesh : రాజీనామా చేసిన ఏపీ మంత్రులు వీరే..

సాక్షి, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది.
ap cabinet ministers
AP Cabinet Ministers

ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులంతా రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. 

చివరి కేబినెట్‌ భేటీ సందర్భంగా.. 
కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ ఆమోదం తెలిపింది. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ విజయవంతంగా చేసినందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌కి అభినందనలు తెలుపుతూ కేబినెట్‌ తీర్మానం చేసింది. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు..

AP CM YS Jagan


మంత్రుల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తొలి విడత కేబినేట్‌లో అవకాశం ఇచ్చినట్లు సీఎం జగన్‌ తెలిపారు.. ఇప్పుడు వారంతా  పార్టీ బాధ్యతల్లోకి వెళ్తారని, తమకున్న విశేష అనుభవాన్ని పార్టీ కోసం వినియోగించుకోవాలని సూచించారు. అందరికీ జిల్లాల్లో పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు.
 

మూడేళ్లపాటు ప్రభుత్వంలో మా బాధ్యతలను మేం నిర్వహించామని మంత్రులు ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వివరించారు. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లామన్న సంతృప్తి మాలో ఉందని మంత్రులు తెలియజేశారు. ఇక మిగిలిన రెండేళ్లపాటు పార్టీ కోసం పనిచేసి.. పార్టీని పటిష్టం చేస్తామని మంత్రులు సీఎం జగన్‌తో అన్నారు.

Published date : 07 Apr 2022 06:10PM

Photo Stories