Andhra Pradesh: పౌర సేవలు పేరుతో ప్రారంభించిన నూతన పోర్టల్ ఉద్దేశం?
సింగిల్ విండో విధానంలో పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సేవలను ఒకే చోట అందించేలా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఆన్‌లైన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఏపీఐఐసీని పరిశ్రమల శాఖతో అనుసంధానం చేయడం ద్వారా భూమి కోసం దరఖాస్తు దగ్గర నుంచి కంపెనీ వాటాల విక్రయం వరకు అన్ని సేవలను ఒకే క్లిక్‌తో పొందే అవకాశం కల్పించింది. ‘పౌర సేవలు’ పేరుతో ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన నూతన పోర్టల్‌ను రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్ ఏప్రిల్ 4న గుంటూరు జిల్లా, మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ప్రారంభించారు. www. apindustries. gov. inకు ఏపీఐఐసీ సేవలు అనుసంధానించినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తొలిదశలో 14 సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
AP New Districts List: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల సమగ్ర స్వరూపం ఇదే.. అతి పెద్ద జిల్లాగా..
స్కిల్డు ఫోర్సు కార్యక్రమం ఉద్దేశం?
దేశంలోని లక్ష మందికి పైగా విద్యార్థులకు వివిధ నైపుణ్యాల్లో శిక్షణ కోసం ఇంటర్న్‌షిప్‌ను అందించనున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రకటించింది. స్కిల్డు ఫోర్సు పేరిట ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు తెలిపింది. అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ టెక్నాలజీ సంస్థ అయిన సిస్కో, మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఫర్ రూరల్ ఎడ్యుకేషన్(ఎంజీఎన్‌సీఆర్‌ఈ), ఆరెస్‌బీ ట్రాన్స్‌మిషన్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వంటి సంస్థల ద్వారా ఈ శిక్షణ ఇప్పించనుంది.
Andhra Pradesh: వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల ప్రధాన ఉద్దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) అభివృద్ధి చేసిన ‘పౌర సేవలు’ వెబ్‌సైట్ ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ
ఎక్కడ : ఏపీఐఐసీ కార్యాలయం, మంగళగిరి, గుంటూరు జిల్లా
ఎందుకు : సింగిల్ విండో విధానంలో పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సేవలను ఒకే చోట అందించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్