Skip to main content

అక్టోబర్ 2017 రాష్ట్రీయం

తెలంగాణలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Current Affairs
తెలంగాణలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. రైల్వే లోకోమోటివ్‌‌స తయారీలో ఖ్యాతి గడించిన ప్రముఖ హైదరాబాదీ కంపెనీ మేధా సర్వో డ్రైవ్‌‌స రూ.600 కోట్ల నుంచి రూ.800 కోట్ల పెట్టుబడితో సంగారెడ్డి జిల్లాలోని కొండకల్ గ్రామంలో ఈ పరిశ్రమను స్థాపించనుంది. ఈ పరిశ్రమతో 2 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో మేధా సర్వో డ్రైవ్‌‌స సంస్థ యాజమాన్యం అక్టోబర్ 27న హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : మేధా సర్వో డ్రైవ్స్ సంస్థ
ఎక్కడ : సంగారెడ్డి జిల్లా

‘మిషన్ కాకతీయ’తో వ్యవసాయాదాయంలో పెరగుదల
తెలంగాణలో చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ వల్ల చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయాధారిత ఆదాయం పెరిగిందని నాబార్డ్ కు చెందిన ‘నాబ్కాన్’ సంస్థ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో సాగు, పంటల విస్తీర్ణం, దిగుబడి, రసాయన ఎరువుల వినియోగం, చేపల పెంపకం, రైతుల ఆదాయం తదితర అంశాలపై రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
సర్వే ముఖ్యాంశాలు
  • 2016 ఖరీఫ్‌లో పూర్వ ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల పరిధిలో 51.5% సాగు విస్తీర్ణం పెరగగా వ్యవసాయ ఆదాయంలో 47.4 శాతం పెరుగుదల కనిపించింది.
  • చెరువుల నుంచి తీసిన పూడిక మట్టితో రసాయనిక ఎరువుల వాడకం 35 నుంచి 50 శాతం తగ్గగా రసాయనిక ఎరువుల కొనుగోళ్లపై 27.6 శాతం ఆర్థిక భారం తగ్గింది.
  • చెరువు ఆయకట్టు పరిధిలోని కుటుంబాల సరాసరి ఆదాయం 78.5 శాతం పెరగ్గా.. వ్యవసాయ ఆదాయం 47.4 శాతం పెరిగింది.
  • భూగర్భ జల మట్టాల్లో సరాసరి పెరుగుదల 2013-14లో 6.91 మీటర్లు ఉంటే.. 2016-17లో అది 9.02 మీటర్లకు పెరిగింది. 17 శాతం ఎండిపోయిన బావులు, బోరు బావులు పునర్జీవం పొందాయి.
  • చెరువుల్లో చేపల ఉత్పత్తి 2013-14లో పోలిస్తే 2016-17లో 36 నుంచి 39 శాతానికి పెరిగింది.
  • పథకం అమలుకు ముందు 63% మంది చెరువులు బాగా లేవని చెప్పగా మొదటి దశ తర్వాత 46.7 శాతం మంది చెరువులు చాలా బాగున్నాయన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిషన్ కాకతీయ వల్ల వ్యవసాయాదాయంలో పెరుగుదల
ఎప్పుడు : 2016-17లో
ఎవరు : నాబ్కాన్, నాబార్డు
ఎక్కడ : ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాలు

ఆధార్ నమోదులో హైదరాబాద్ టాప్
ఆధార్ నమోదులో హైదరాబాద్ నగరం దేశంలోనే అగ్రస్థానాన్ని కై వసం చేసుకుంది. నగరంలో ఉన్న జనాభా కంటే దాదాపు 17.66% అధికంగా ఆధార్ యూఐడీలు జారీ అయినట్లు యూఐడీఏఐ వెల్లడించింది. 2011 నాటికి హైదరాబాద్ జనాభా 93 లక్షలుకాగా.. 2017 సెప్టెంబర్ చివరి నాటికి ఆధార్ జారీ అయిన వారి సంఖ్య 1.09 కోట్లకు చేరింది.
ఆధార్ నమోదు శాతంలో దేశ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో నిలవగా.. ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలు వరుసగా తర్వాతి స్థానాలు పొందాయి. ఢిల్లీలోనూ జనాభా కంటే 16 శాతం అధికంగా ఆధార్ నమోదైంది.
మెట్రో నగరాల్లో ఆధార్ నమోదు తీరు

నగరం

జనాభా

ఆధార్ నమోదు

శాతం

హైదరాబాద్

93,06,636

1,09,50,043

117.66

ఢిల్లీ

1,81,10,349

2,10,95,906

115.00

ముంబై

1,24,78,447

1,20,57,231

96.62

బెంగళూర్

95,88,910

78,71,589

82.09

చెన్నై

46,81,087

38,34,893

81.92

కోల్‌కతా

44,86,679

35,74,553

79.67

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆధార్ నమోదులో హైదరాబాద్ నగరం టాప్
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : యూఐడీఏఐ
ఎక్కడ : మెట్రోనగరాల్లో

ఎమ్మేల్యే పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా
తెలుగుదేశం పార్టీ నేత అనుముల రేవంత్‌రెడ్డి శాసనసభ సభ్యత్వంతో పాటు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు అక్టోబర్ 28న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుని కలిసి రాజీనామా లేఖలను అందించారు. కేసీఆర్ నియంతృత్వ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించేందుకు, కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణలో భాగంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎమ్మేల్యే పదవికి రాజీనామా
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : రేవంత్ రెడ్డి

ఖమ్మంలో రైతుల కోసం కో ఆపరేషన్ స్టార్ ఆస్పత్రి
ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో అత్యాధునిక హంగులతో.. కార్పొరేట్ స్థాయిలో రైతుల కోసం ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. పూర్తి మల్టీ స్పెషాలిటీ వసతులతో కో ఆపరేషన్ స్టార్ (సీ-స్టార్) పేరుతో నెహ్రూనగర్‌లో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు అంతస్తుల్లో ఈ ఆస్పత్రిని నిర్మించారు. పూర్వపు ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రాథమిక సహకార సంఘాల్లో ఉన్న 1.60 లక్షల మంది సభ్యులు స్వచ్ఛంద వాటా ధనం రూ.5 కోట్ల నిధులతో ఆస్పత్రి నిర్మితమైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైతుల కోసం కో ఆపరేషన్ స్టార్ ఆస్పత్రి
ఎవరు : కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో
ఎక్కడ : ఖమ్మంలో

ఏపీ స్థానికత మరో రెండేళ్లు పెంపు
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి ఏపీకి తరలివచ్చే వారికి స్థానికత కల్పించడానికి ఉన్న గడువును మరో రెండేళ్లు పెంచే ప్రతిపాదనకు రాష్ట్రపతి అక్టోబర్ 30న ఆమోదముద్ర వేశారు. తొలుత విధించిన గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగియగా మరో రెండేళ్లు పెంచాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది.

ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తుల విభజన
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియలో భాగంగా న్యాయమూర్తుల పోస్టులు, కేటాయింపులను కేంద్రం అక్టోబర్ 24న ఖరారు చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ప్రభుత్వాధికారులను జనాభా ప్రాతిపదికన 58ః42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలకు కేటాయించారు. కాగా, న్యాయాధికారులు, న్యాయమూర్తుల విభజనకు 60ః40 నిష్పత్తిని తీసుకున్నారు. ఇందులో భాగంగా ఏపీకి 37, తెలంగాణకు 24 న్యాయమూర్తుల పోస్టులు మంజూరయ్యాయి.

కొత్తగా 3 పట్టణాభివృద్ధి సంస్థలు
తెలంగాణలో కొత్తగా మూడు పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అక్టోబర్ 24న ఉత్తర్వులు జారీ చే సింది. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరపాలక సంస్థల పరిధిలోని గ్రామాలను కలిపి వీటిని ఏర్పాటు చే శారు.

ప్రయాణికుల సేవల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ టాప్
Current Affairs అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా హైదరాబాద్‌లో జీఎంఆర్ సంస్థ నిర్మించిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్) ఏఎస్‌క్యూ సర్వే(ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ)-2016లో ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సేవల విభాగంలో కోటిన్నర మంది ప్రయాణికులకు నాణ్యమైన సేవలను అందించడం ద్వారా ఈ గుర్తింపు సాధించింది. ఈ మేరకు అక్టోబర్ 18న జరిగిన 27వ ఆఫ్రికా వరల్డ్ యాన్యువల్ జనరల్ అసెంబ్లీలో ఎయిర్‌పోర్ట్ సీఈవో జీకే కిషోర్ ట్రోఫీని అందుకున్నారు. ఈ ట్రోఫీని 2016 నుంచి అందిస్తున్నారు.
ఏఎస్‌క్యూ సర్వే గణాంకాల ప్రకారం జీహెచ్‌ఐఏఎల్ స్కోరు 2009లో 4.4గా ఉండగా 2016 నాటికి 4.9 కి పెరిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏఎస్‌క్యూ సర్వేలో తొలి స్థానంలో శంషాబాద్ విమానాశ్రయం
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎవరు : ఎయిర్ పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వే - 2016

నెల్లికల్ అడవిలో పర్యాటక వ్యూ పాయింట్
నాగార్జునసాగర్ సందర్శకుల కోసం మరో పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. గతవారం శ్రీశైలం దగ్గర ఆక్టోపస్ వ్యూ పాయింట్‌ను ప్రారంభించిన రాష్ర్ట అటవీ శాఖ ఈసారి నాగార్జున సాగర్ సమీపంలో వాచ్‌టవర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పర్యావరణ అనుకూల పర్యాటక రంగం(ఎకో టూరిజం) అభివృద్ధిలో భాగంగా ఈ వాచ్‌టవర్‌ను నిర్మించింది. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ రోడ్డులో సాగర్ చేరుకోవడానికి ఐదు కిలోమీటర్ల ముందే.. నెల్లికల్ అడవి బ్లాక్‌లో దీనిని ఏర్పాటు చేశారు. సముద్రమట్టానికి 1,050 అడుగుల ఎత్తులో ఉండే ఈ వాచ్‌టవర్ నుంచి అడవి, కృష్ణా నదీ అందాలను, నాగార్జునసాగర్ డ్యామ్ బ్యాక్‌వాటర్‌ను కూడా చూడవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నెల్లికల్ అడవిలో పర్యాటక వ్యూ పాయింట్
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం

నవంబర్ రెండో వారంలో అరకులో బెలూన్ ఫెస్టివల్
విశాఖ జిల్లాలోని అరకులోయ ‘హాట్ బెలూన్ ఫెస్టివల్’కు వేదిక కానుంది. రాష్ట్రంలో తొలిసారిగా నవంబర్ 14, 15, 16 తేదీల్లో 3 రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరగనుంది. ఫెస్టివల్‌లో పాల్గొనడానికి 10 నుంచి 12 విదేశీ సంస్థలు రానున్నాయి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, యువతకు అడ్వెంచర్స్ (సాహసాల) వైపు ఆసక్తి పెంచడానికి వీటిని విదేశాల్లో నిర్వహిస్తుంటారు. మన దేశంలో పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే ప్రదేశాల్లో కొన్నేళ్ల నుంచి ఈ బెలూన్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. దీనికి పర్యాటకుల నుంచి ఆదరణ లభించడంతో ఏపీలోనూ బెలూన్ ఫెస్ట్ నిర్వహించాలని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీలో తొలిసారి హాట్ బెలూన్ ఫెస్టివల్
ఎప్పుడు : నవంబర్ 14 -16
ఎవరు : రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ
ఎక్కడ : అరకు

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన
వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అక్టోబర్ 22న సీఎం శంకుస్థాపన చేశారు. ఐటీ టవర్స్, వరంగల్ ఔటర్ రింగురోడ్డు, కాజీపేట ఆర్వోబీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ పనులను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. టెక్స్‌టైల్ పార్కుకి శంకుస్థాపన జరిగిన రోజే 22 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయని సీఎం తెలిపారు. వీటి ద్వారా 3,900 కోట్లు పెట్టుబడులు రాబోతున్నట్లు వివరించారు. 27,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని, పరోక్షంగా మరో 50,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకి శంకుస్థాపన
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
ఎక్కడ : శాయంపేట, వరంగల్

ఏపీలో పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్
ఆంధ్రప్రదేశ్‌లో ముడి చమురు శుద్ధి కేంద్రం, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ను ఏర్పాటు చేసేందుకు కువైట్‌కు చెందిన ఆల్ ఆర్ఫాజ్ గ్రూప్ అంగీకారం తెలిపింది. అబుదాబిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో భాగంగా అక్టోబర్ 23న ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి బోర్డు (ఈడీబీ), ఆల్ ఆర్ఫాజ్ గ్రూప్ హోల్డింగ్ మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీలో పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్‌కు ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : కువైట్‌కు చెందిన ఆల్ ఆర్ఫాజ్ గ్రూప్‌తో

దేశంలో తొలి ‘హరిత’ స్టేషన్‌గా సికింద్రాబాద్
Current Affairs సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దేశంలోనే తొలి ‘హరిత రైల్వేస్టేషన్’గా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, భారత పరిశ్రమల సమాఖ్య (ఐజీబీసీ-సీఐఐ)ల గుర్తింపు పొందింది. దేశంలో ఈ తరహా గుర్తింపు విధానాన్ని ఈ ఏడాదే ప్రవేశపెట్టగా.. తొలిసారే సికింద్రాబాద్ స్టేషన్ దాన్ని సొంతం చేసుకుంది. నిర్దేశిత ప్రామాణికాల ఆధారంగా సిల్వర్ రేటింగ్ సాధించి... దేశంలోనే ఉన్నత ప్రమాణాలతో కొనసాగుతున్న రైల్వేస్టేషన్లలో ఒకటిగా నిలిచింది. ఈ మేరకు ఆక్టోబర్ 5న జైపూర్‌లో జరిగిన గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్-2017లో ఈ గుర్తింపును ప్రకటించారు.
ఎందుకీ అవార్డు?
  • స్టేషన్‌లో కొంతకాలంగా పర్యావరణ అనుకూల చర్యలు
  • పదో నంబర్ ప్లాట్‌ఫారంవైపు ఉండే మార్గాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దిన అధికారులు. సేంద్రియ ఎరువుల వినియోగంతో 408 రకాల మొక్కలు పెంపకం.
  • సౌర విద్యుత్ వినియోగం పరిధిలోకి 41.2 శాతం స్టేషన్ స్థలం.
  • 2016లో 500 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసి రోజుకు 2,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి. ఫలితంగా ఏటా రూ.73 లక్షలు ఆదా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో తొలి హరిత స్టేషన్‌గా సికింద్రాబాద్
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : ఐజీబీసీ-సీఐఐ
ఎందుకు : పర్యావరణ హిత చర్యలకు గాను

జేఎన్‌టీయూహెచ్‌లో నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ల్యాబ్
జేఎన్‌టీయూహెచ్ సెంటర్ ఫర్ స్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్‌ఎస్‌ఎస్) ప్రయోగశాలను వైస్‌చాన్‌‌సలర్ వేణు గోపాల్‌రెడ్డి, నోవాటెల్ సాఫ్ట్‌వేర్ డెరైక్టర్ మైఖెల్ కినాహాన్‌లు అక్టోబర్ 12న ప్రారంభించారు. జేఎన్‌టీయూహెచ్, హెక్సాగన్ కేపబిలిటీ సెంటర్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ప్రకృతి వనరుల నిర్వహణలో ఉపగ్రహ ఆధారిత నావిగేషన్‌లో విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించేందుకు నూతన ప్రయోగశాల ఉపయోగపడుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ల్యాబ్
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎక్కడ : జేఎన్‌టీయూహెచ్
ఎందుకు : విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించేందుకు

నల్లమలలో ‘ఆక్టోపస్’ పర్యాటక ప్రాంతం
ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో కొత్త పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. నల్లమల అటవీ అందాలు, కృష్ణా తీర సొగసులు, లోయల అందాలను తిలకించేందుకు వీలుగా ఆక్టోపస్ వ్యూ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే కృష్ణా నదీ ఆక్టోపస్‌లా మెలికలు తిరిగి కనిపిస్తుండటంతో ఆ పేరు పెట్టినట్లు అటవీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్-శ్రీశైలం హైవే మార్గంలో మన్ననూర్ నుంచి 42 కి.మీ. దూరంలో, దోమలపెంటకు 5 కి.మీ. ముందు ఈ వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆక్టోపస్ పేరుతో పర్యాటక వ్యూ పాయింట్ ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : ఆమ్రాబాద్ టైగర్ రిజర్వులో

‘గోరటి’కి సుద్దాల పురస్కారం
కలం యోధుడు సుద్దాల హనుమంతు, జానకమ్మ 2017 సంవత్సరం జాతీయ పురస్కారాన్ని ప్రజాకవి గోరటి వెంకన్న అందుకున్నారు. సుద్దాల ఫౌండేషన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అక్టోబర్ 13న అవార్డు ప్రదానోత్సవం జరిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుద్దాల హనుమంతు, జానకమ్మ జాతీయ అవార్డు - 2017
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : గోరటి వెంకన్న

ఏపీలో అన్న విలేజ్ మాల్స్‌గా రేషన్ షాపులు
రేషన్ షాపులను విలేజ్ మాల్స్‌గా మార్చాలంటూ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తొలి విడతలో 6,500 రేషన్ షాపులను ‘అన్న విలేజ్ మాల్స్’గా మార్చాలని సూచించారు. ఈ మేరకు తయారు చేసిన ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిలయన్‌‌స, ఫ్యూచర్ గ్రూప్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ మాల్‌్ంను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, ప్రత్యేక లోగో తయారుచేయాలని ఆదేశించారు.
200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ‘అన్న విలేజ్ మాల్’ కోసమయ్యే వ్యయంలో 25 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మరో 25 శాతం వ్యయాన్ని ‘ముద్ర’ నుంచి డీలర్‌కు రుణంగా ఇప్పిస్తుంది. ఈ విలేజ్ మాల్స్‌లో డ్వాక్రా, మెప్మా, జీసీసీ ఉత్పత్తులతో పాటు రైతుల నుంచి కొనుగోలు చేసే వివిధ వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతారు. ఇక రేషన్ బియ్యం వద్దనుకునే తెల్ల కార్డుదారులకు.. అంతే విలువైన ఆహార పదార్థాలను విలేజ్ మాల్స్ నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని సీఎం ఆదేశించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అన్న విలేజ్ మాల్స్‌గా రేషన్ షాపులు
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో

తుంగభద్ర బోర్డు చైర్మన్‌గా రంగారెడ్డి
తుంగభద్ర బోర్డు చైర్మన్‌గా డి.రంగారెడ్డిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన తుంగభద్ర బోర్డు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఏపీలోని వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేటకి చెందిన రంగారెడ్డి గతంలో బెంగళూరు, ఢిల్లీలోని సెంట్రల్ వాటర్ బోర్డులో వివిధ హోదాల్లో పనిచేశారు. బోర్డు చైర్మన్‌గా ఆయన 2-3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తుంగభద్ర బోర్డు చైర్మన్‌గా రంగారెడ్డి
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

విశాఖలో టీయూ 142 యుద్ధ విమాన మ్యూజియం
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో టీయూ - 142 యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 16న శంకుస్థాపన చేశారు. నౌకదళానికి చెందిన టీయూ - 142 యుద్ధ విమానం కార్గిల్ యుద్ధంతో పాటు పలు ఆపరేషన్లలో 29 సంవత్సరాలు కీలక సేవలందించింది. ఇదే ప్రదేశంలో కురుసురా జలాంతర్గామి మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టీయూ 142 యుద్ధ విమాన మ్యూజియంకు శంకుస్థాపన
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
ఎక్కడ : విశాఖపట్నంలో

షార్‌లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు
ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లో ఉపరాష్ర్టపతి ఎం.వెంకయ్య నాయుడు అక్టోబర్ 4న ప్రారంభించారు. 10వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఉత్సవాల్లో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం ఫలితాలను దేశంలోని సగటు మానవుడికి అందుబాటులోకి తీసుకొస్తున్న ఇస్రోను వసుధైక కుటుంబం లాంటిదని అభివర్ణించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు
ఎప్పుడు : అక్టోబర్ 4 - 10 వరకు
ఎక్కడ : సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

నారాయణమూర్తికి కుమురం భీం పురస్కారం
Current Affairs కుమురం భీం జాతీయ పురస్కారానికి ప్రముఖ తెలుగు నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి ఎంపికయ్యారు. భీం వర్ధంతి సందర్భంగా 2017 సంవత్సరానికి నారాయణమూర్తిని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు అవార్డు కమిటీ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి అక్టోబర్ 5న ప్రకటించారు. అవార్డు కింద 51 వేల రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందచేస్తారు. నారాయణమూర్తి ప్రజలను చైతన్యపరిచేలా పలు చిత్రాలు నిర్మించారు. అర్ధరాత్రి స్వతంత్రం, అడవి దివిటీలు, లాల్‌సలాం, దండోరా, ఎర్రసైన్యం, చీమలదండు, దళం, చీకటి సూర్యులు, ఊరు మనదిరా, వేగు చుక్కలు, అరణ్యం, ఎర్రోడు, సింగన్న, వీర తెలంగాణ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.
గతంలో ఈ అవార్డును కుమురం భీం చిత్రం నిర్మాత, దర్శకుడు అల్లాణి శ్రీధర్, గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అందుకున్నారు. తెలంగాణ టెలివిజన్ డెవలప్‌మెంట్ ఫోరమ్, ఆదివాసీ సాంస్కృతిక పరిషత్, గోండ్వానా కల్చరల్ ప్రొటెక్షన్ ఫోర్స్, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ఏటా ఈ అవార్డుని ప్రదానం చేస్తున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కుమురం భీం పురస్కారం 2017
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : ఆర్ నారాయణమూర్తి

కాళేశ్వరంపై స్టే విధించిన ఎన్జీటీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అక్టోబర్ 5న స్టే విధించింది. కాళేశ్వరం నిర్మాణానికి అటవీ, పర్యావరణ అనుమతులు లేవని, నిర్మాణ పనులను ఆపాలని కోరుతూ సిద్దిపేటకు చెందిన హయాతుద్దీన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అనుమతులు లేకుండా 672.60 హెక్టార్ల అటవీ భూములను వినియోగిస్తూ ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ వాదించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీటికే అధిక ప్రాధాన్యం ఇస్తుంది కాబట్టి తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు ఎలాంటి పర్యావరణ అనుమతులు అవసరం లేదని వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై స్టే
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్
ఎందుకు : తెలంగాణ ప్రభుత్వం అటవీ చట్టాలను ఉల్లంఘిస్తుందని దాఖలు చేసిన పిటిషన్ ను విచారించి

మాస్టర్ కార్డుతో ఏపీ ఒప్పందం
నగదు రహిత లావాదేవీలను సురక్షితంగా జరపడం, రైతులు సులువుగా నగదు రహిత లావాదేవీలు జరిపేలా అవగాహన చేపట్టడం కోసం మాస్టర్ కార్డు అనే సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అక్టోబర్ 5న ఢిల్లీలో జరిగిన సమావేశంలో మాస్టర్ కార్డు సీఈవో అజయ్ భంగా, ఏపీ రాష్ట్ర ఐటీ సలహాదారు జేఏ చౌదరి ఎంవోయూ పై సంతకాలు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాస్టర్ కార్డు సంస్థతో ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

హైదరాబాద్‌లో యూట్యూబ్ పాప్-అప్ స్పేస్
ఆన్‌లైన్ వీడియో కమ్యూనిటీ వేదిక యూట్యూబ్ భారత్‌లో తొలిసారిగా పాప్-అప్ స్పేస్‌ను నిర్వహించింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో అక్టోబర్ 6, 7 తేదీల్లో జరిగిన కార్యక్రమంలో వీడియోల చిత్రీకరణలో శిక్షణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి కంటెంట్ రూపుదిద్దుకుంటోందో వివరించారు. మహాతల్లి, తెలుగువన్, వైవా, చాయ్ బిస్కట్, కంత్రీ గైస్, కిరాక్ హైదరాబాదీస్, ఖేల్‌పీడియో వంటి 700 మందికి పైగా యూట్యూబ్ క్రియేటర్లు ఇందులో పాల్గొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా శాశ్వత ప్రాతిపదికన 9 యూట్యూబ్ స్పేసెస్ ఉండగా, భారత్‌లో ముంబైలో ఏర్పాటు చేశారు. ఇందులో 7,500 మందికిపైగా క్రియేటర్లు ఉన్నారు. దేశంలో చిత్రిస్తున్న యూట్యూబ్ వీడియోల్లో హిందీ తర్వాతి స్థానాన్ని తెలుగు కై వసం చేసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్‌లో యూట్యూబ్ పాప్-అప్ స్పేస్
ఎప్పుడు : అక్టోబర్ 6, 7
ఎక్కడ : రామోజీ ఫిల్మ్ సిటీ
ఎవరు : యూట్యూబ్
ఎందుకు : వీడియోల చిత్రీకరణపై శిక్షణ ఇవ్వడానికి

అరకు మీదుగా జాతీయ రహదారి
ఆంధ్ర కశ్మీర్‌గా పిలువబడే అరకు మీదుగా కొత్త జాతీయ రహదారి నిర్మాణం జరగనుంది. ఈ మేరకు చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్-16) మార్గంలో మరో రహదారి 516-ఈ ను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. రాజమండ్రి నుంచి రంపచోడవరం, కొయ్యూరు, లంబసింగి, పాడేరు, అరకు, ఎస్.కోట మీదుగా విజయనగరం వరకు రూ.4 వేల కోట్లతో రెండు వరుసల జాతీయ రహదారిని నిర్మిస్తారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
అరకు మీదుగా జాతీయ రహదారి నిర్మాణం
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ఏజెన్సీ ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచడంతోపాటు పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి

గోరటి వెంకన్నకు సుద్దాల పురస్కారం
సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారానికి 2017 సంవత్సరానికి ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న ఎంపికయ్యాడు. ఈ మేరకు అక్టోబర్ 13న సుద్దాల హనుమంతు జయంతి సందర్భంగా గోరటి వెంకన్నకు పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సినీగేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ తెలిపారు. 2010 నుంచి ఏటా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఈ పురస్కారాలను అందజేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
సుద్దాల పురస్కారం 2017
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : గోరటి వెంకన్న

తెలంగాణలో షూటింగ్‌లకు సింగిల్ విండో విధానం
తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో టీఎస్‌బాక్స్ ఆఫీస్.ఇన్’ ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్, షూటింగ్‌ల కోసం సింగిల్ విండో అనుమతుల విధానాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్టోబర్ 7న ప్రారంభించారు. తద్వారా సినిమాల కోసం ప్రత్యేకంగా ఈ విధానాలను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
సింగిల్ విండో విధానం ద్వారా నిర్మాతలు షూటింగ్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి ఏడు రోజుల్లోపు అనుమతులు మంజూరవుతాయి. ఏడురోజుల్లో అనుమతి రాకపోతే అనుమతి వచ్చినట్లుగానే పరిగణించి షూటింగ్ ప్రారంభించుకోవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టీఎస్‌బాక్సాఫీస్.ఇన్ ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎందుకు : ఆన్‌లైన్ టికెటింగ్, షూటింగ్‌లకు సింగిల్ విండో అనుమతులకు

అనంతగిరిలో ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటు
ఔషధ మొక్కలకు నిలయమైన అనంతగిరిలో ఆయుష్ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వికారాబాద్‌కు సమీపంలోని అనంతగిరిలో ఏర్పాటు చేయనున్న ఆ ఆస్పత్రిలో ఆయుర్వేదం, హోమియో, యునానీ, నేచురోపతి వంటి ప్రత్యామ్నాయ వైద్యసేవలను అందించనున్నారు. అనంతగిరిలో 140 ఎకరాల విస్తీర్ణంలో టీబీ ఆస్పత్రి ఉంది. దీనిలోని 28 ఎకరాలను ఆయుష్ ఆస్పత్రి కోసం ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో రూ.6 కోట్లతో 50 పడకల ఆస్పత్రిని నిర్మించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం మరికొన్ని నిధులను కేటాయించనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అనంతగిరిలో ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటుకు నిర్ణయం
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : వికారాబాద్

ఆంధ్రప్రదేశ్‌లో హెల్మెట్ ధరిస్తేనే పెట్రోలు
Current Affairs హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పెట్రోలు బంకుల్లో పెట్రోలు నిరాకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ ఇక తప్పనిసరని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు నివారించడంలో అలసత్వం ప్రదర్శించడానికి వీల్లేదని సెప్టెంబర్ 27న సచివాలయంలో జరిగిన సమీక్షలో బాబు పేర్కొన్నారు. రహదారి భద్రత పరికరాల కొనుగోలుకు రూ.10 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు..
  • రాష్ట్రంలోని అన్ని వాహనాలకు జీపీఎస్ అమర్చటంపై పరిశీలన.
  • ప్రమాదం జరిగిన వెంటనే దగ్గరలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, ట్రామాకేర్ సెంటర్ల వివరాలు తెలిసేలా ప్రత్యేక యాప్ రూపకల్పన.
  • ప్రమాద సమయాల్లో వెంటనే చేరుకునేలా రహదారుల భద్రతకు వినియోగిస్తున్న వాహనాలు, 108 వాహనాలకు జియో ట్యాగింగ్.
  • బ్లాక్ జోన్స్ గా గుర్తించిన రహదారులపై ఇబ్బందులను సత్వరమే సరిచేయాలి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హెల్మెట్ ఉంటేనే పెట్రోల్
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబు

గార్లలో దశమి రోజు జాతీయ జెండా ఆవిష్కరణ
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో సెప్టెంబర్ 30న విజయదశమి రోజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గార్ల మండల కేంద్రంలో నిజాం నవాబు కాలం నుంచి జెండా ఆవిష్కరణ ఆనవాయితీగా వస్తోంది. అప్పట్లో స్థానిక మసీదు సెంటర్‌లో నిజాం అధికారిక జెండాను ఆవిష్కరించేవారు. నిజాం పాలన ముగిసిన తర్వాత 1952లో సదరు గద్దెపై కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కమ్యూనిస్టులు కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో కోర్టు సదరు గద్దెపై దేశభక్తికి చిహ్నంగా జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించింది. దీంతో 1958లో తొలిసారి అప్పటి మున్సిపల్ చైర్మన్ మాటేడి కిషన్‌రావు జాతీయ జెండాను ఎగుర వేశారు. నాటి నుంచి నేటి వరకు గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ (మొదటి పౌరుడు) అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విజయదశమి రోజు జాతీయ జెండా ఆవిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎక్కడ : మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో
ఎందుకు : నిజాం నవాబు కాలం ఆనవాయితీ

ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర ఉత్పత్తుల వర్సిటీ
రాష్ట్రంలో చేపలు, సముద్ర ఉత్పత్తుల యూనివర్సిటీని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కంపెనీలో ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు 51% పెట్టుబడి పెడతారు. మిగతా 49% ప్రభుత్వం గ్రాంటుగా ఇస్తుంది. భీమవరం, అమలాపురంలలో 200 ఎకరాల్లో ఈ వర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదించారు. రూ. 300 కోట్లు అవుతుందని అంచనా. ఈ వర్సిటీ ఏర్పాటుకు ఆనంద్ గ్రూప్ ప్రధాన పెట్టుబడిదారుగా అవంతి ఫీడ్‌‌స, యుఎన్‌ఓ ఫీడ్‌‌స, దేవి సీ ఫుడ్‌‌స, మత్స్య రైతులు వి.రామ చంద్రరాజు, జి.సుబ్బరాజు, రొయ్యల రైతు ఐ.పీ.ఆర్ మోహనరాజు, ఆనంద్ రాజులు ముందుకు వచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర ఉత్పత్తుల యూనివర్సిటీ
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : ఏపీ ప్రభుత్వం
ఎక్కడ : భీమవరం, అమలాపురంలో

ఏపీలో ఒకే రోజు లక్ష ఇళ్లలో సామూహిక గృహప్రవేశం
ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన 1,01,396 ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అక్టోబర్ 2న ప్రారంభించారు. అలాగే.. పీఎంజేజేబీవై చంద్రన్న బీమాను ప్రారంభించారు. స్వచ్ఛాంధ్ర మిషన్ తృతీయ వార్షికోత్సవంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇళ్లను వేగంగా పూర్తి చేయించి సంక్రాంతి, క్రిస్మస్, జూన్ 8న ఇదే తరహాలో సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తామని వివరించారు. వచ్చే మార్చిలోగా రాష్ట్రంలో నూటికి నూరు శాతం మలవిసర్జన రహిత(ఓడీఎఫ్) గ్రామాలుగా సాధిస్తామని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఒకే రోజు లక్ష ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబు
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో
Published date : 14 Oct 2017 12:53PM

Photo Stories