మార్చ్ 4-10 కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్
1. ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజెజెబీవై) కింద నమోదు చేసుకున్న వారిలో ఎంత శాతం మహిళలు ఉన్నారు?
1) 55.55
2) 46.83
3) 40.70
4) 58.90
- View Answer
- సమాధానం: 3
2. ‘రోగ్ డ్రోన్స్’ను ఎదుర్కోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) శక్తితో పనిచేసే డ్రోన్‌ను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏది?
1) ఐఐటి–ఖరగ్‌పూర్
2) ఐఐటి–మద్రాస్
3) ఐఐటి–కాన్పూర్
4) ఐఐటి– ఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
3. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ మిషన్ శక్తి’ పేరుతో స్వయం సహాయక బృందాలకు ప్రత్యేక విభాగాన్ని కలిగి ఉన్న దేశంలోనే మొదటి రాష్ట్రం ఏది?
1) మధ్యప్రదేశ్
2) తెలంగాణ
3) పంజాబ్
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 4
4. ఆస్ట్రేలియాలో జరిగిన ఐíసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2020 7వ ఎడిషన్‌ను గెలుచుకున్న దేశం ఏది?
1) ఇండియా
2) ఆస్ట్రేలియా
3) ఇంగ్లాండ్
4) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 2
5. ఏ ప్రపంచ సంస్థతో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కలిసి ‘పనికి సంబంధించిన భవిçష్యత్తు: భారతదేశ శ్రామికశక్తిలో మహిళలు’ అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది?
1) ప్రపంచ వాణిజ్య సంస్థ
2) అంతర్జాతీయ ద్రవ్యనిధి
3) ఐక్యరాజ్యసమితి
4) ప్రపంచ బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
6. దేశవ్యాప్తంగా స్వయం సహాయక బృందాలు తయారుచేసిన ఉత్పత్తుల ఇ–మార్కెటింగ్ కోసం దీన్‌దయాల్ అంత్యదయో యోజన– నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్స్ మిషన్‌తో ఏ ఇ–కామర్స్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఇండియామార్ట్
2) మినత్రా
3) ఫ్లిప్‌కార్ట్
4) అమెజాన్
- View Answer
- సమాధానం: 4
7. 10వ ఫిక్కీ–ఐబీఎ బ్యాంకర్స్ సర్వే 2019 జూలై–డిసెంబర్ ప్రకారం కింది ఏ రంగం అధిక పనికిరాని ఆస్తులను (ఎన్‌పిఎ) నమోదు చేసింది?
1) వ్యవసాయ రంగం
2) కార్పొరేట్ రంగం
3) తయారీ రంగం
4) మౌలిక సదుపాయాల రంగం
- View Answer
- సమాధానం: 4
8. ప్రపంచంలో 500 టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా ఎవరు నిలిచారు?
1) విరాట్ కోహ్లీ
2) డ్వేన్ బ్రావో
3) క్రిస్ గేల్
4) కీరోన్ పోలార్డ్
- View Answer
- సమాధానం: 4
9. 2023లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) సమావేశానికి ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది?
1) బెంగళూరు
2) కోల్‌కతా
3) హైదరాబాద్
4) ముంబై
- View Answer
- సమాధానం: 4
10. డీప్ టెక్ స్టార్టప్‌లకు మద్దతుగా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఐ–టీఐసీ, ఐఐటి హైదరాబాద్
2) ఐ–టీఐసీ, ఐఐటి మద్రాసు
3) ఇ–టీఐíసీ, ఐఐటి బొంబాయి
4) ఇ–టీఐసీ, ఐఐటి ఢిల్లీ
- View Answer
- సమాధానం: 1
11. 2020 ఏప్రిల్ 1 నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఏ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ విలీనం కానుంది?
1) ఆంధ్ర బ్యాంక్
2) కెనరా బ్యాంక్
3) సిండికేట్ బ్యాంక్
4) అలహాబాద్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
12. కరోనావైరస్ ‘గ్లోబల్ ట్రేడ్ ఇంపాక్ట్ (కోవిడ్–19) ఎపిడెమిక్’ అనే నివేదిక ప్రకారం చైనా ఉత్పత్తి మందగించడం వల్ల ఎక్కువగా ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థ (విలువ ప్రకారం) ఏది?
1) వియత్నాం
2) యూరోపియన్ యూనియన్
3) యూఎస్ఎ
4) దక్షిణ కొరియా
- View Answer
- సమాధానం: 2
13. 2019 సంవత్సరానికి గాను ‘మష్రూమ్ మహిళ’గా పేరు పొందిన ఆమె ‘నారి శక్తి పురస్కార్’ను పొందింది? ఆమె పేరు?
1) రాణి ఇందిరా
2) బినాదేవి
3) కాత్యాయిని
4) రష్మి ఉర్ధ్వర్ధేసి
- View Answer
- సమాధానం: 2
14. ఈ–గవర్నెన్స్ గురించి అవగాహన కల్పించడానికి ‘ఐయామ్ ఆల్సో డిజిటల్’ అనే డిజిటల్ అక్షరాస్యత డ్రైవ్‌ను ఏ రాష్ట్రం ప్రారంభించనుంది?
1) కేరళ
2) కర్ణాటక
3) తెలంగాణ
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 1
15. 2020 ఫిబ్రవరి 29 నుంచి అందరికీ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్న మొదటి దేశం ఏది?
1) ఐస్లాండ్
2) ఆస్ట్రియా
3) యూఏఈ
4) లక్సెంబర్గ్
- View Answer
- సమాధానం: 4
16. ఏటా జాతీయ భద్రతా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) మార్చి 18
2) ఏప్రిల్ 2
3) మార్చి 4
4) ఫిబ్రవరి 28
- View Answer
- సమాధానం: 3
17. భారతదేశంలో జనరిక్ జౌషధాల వాడకం గురించి అవగాహన కల్పించడానికి ‘జాన్ ఆషాది దివాస్’ 2020ను ఏ రోజున జరుపుకున్నారు?
1) ఫిబ్రవరి 28
2) మార్చి 29
3) మార్చి 7
4) ఏప్రిల్ 4
- View Answer
- సమాధానం: 3
18. ఎగుమతి ప్రోత్సాహకంలో సాంకేతిక అభివృద్ధి పరంగా వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎపిఇడిఎ)తో ఒప్పందం కుదుర్చుకున్న భారతీయ సంస్థ ఏది?
1) ఐఐటి–కోల్‌కతా
2) ఐఐటి–కాన్పూర్
3) ఐఐటి–మద్రాస్
4) ఐఐటి– ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
19. గూగుల్ క్లౌడ్ తన రెండో క్లౌడ్ ప్రాంతాన్ని 2021లో భారతదేశంలోని ఏ నగరంలో ప్రారంభించాలని యోచిస్తోంది?
1) లక్నో
2) బెంగళూరు
3) న్యూఢిల్లీ
4) చెన్నై
- View Answer
- సమాధానం: 3
20. విమానంలోని ప్రయాణికులకు వై–ఫై సదుపాయాలను కల్పించనున్న భారతదేశంలోని మొదటి విమాన సంస్థ ఏది?
1) విస్తార
2) గోఎయిర్
3) స్పైస్‌జెట్
4) ఇండిగో
- View Answer
- సమాధానం: 1
21. 2020 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థ కోసం నాబార్డ్ ఎంత మొత్తాన్ని మంజూరు చేసింది?
1) 2.32 లక్షల కోట్లు
2) 1.21 లక్షల కోట్లు
3) 1.46 లక్షల కోట్లు
4) 1.12 లక్షల కోట్లు
- View Answer
- సమాధానం: 3
22. భారత నూతన ఆర్థిక కార్యదర్శిగా ఎవరిని నియమించారు?
1) ఆతను చక్రవర్తి
2) దేబాషిష్ పండా
3) సందీప్ కుమార్
4) అజయ్ భూషణ్ పాండే
- View Answer
- సమాధానం: 4
23. ఇండియా స్మార్ట్ యుటిలిటీ వీక్ (ISUW) 2020 సందర్భంగా ఇంటిగ్రేటెడ్ లోకల్ ఎనర్జీ సిస్టమ్స్‌లో పనిచేయడానికి ఏ ప్రపంచ సమూహంతో భారత్ చేరింది?
1) ఏసియన్ (ASEAN)
2) జీ–20 దేశాలు
3) యూరోపియన్ యూనియన్
4) జీ–7 దేశాలు
- View Answer
- సమాధానం: 3
24. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా 2020 మార్చి 1 – 10 వరకు భారత రైల్వే నిర్వహించిన లింగ సమానత్వ ప్రచారం పేరు ఏమిటి?
1) ‘ఆమెకు స్ఫూర్తి కలిగించండి
2) ‘ఆమె సమానం’
3) ‘ఆమె స్ఫూర్తినిస్తుంది
4) ‘ప్రతి ఒక్కరూ సమానంగా’
- View Answer
- సమాధానం: 4
25. అతిపెద్ద, పురాతన ‘చాప్చర్ కుట్’ అనే పండుగను ఏ రాష్ట్రం నిర్వహించింది?
1) నాగాలాండ్
2) అస్సాం
3) ఒడిశా
4) మిజోరాం
- View Answer
- సమాధానం: 4
26. క్యూఆర్–ఆధారిత మెట్రో టికెటింగ్ వ్యవస్థను ప్రారంభించడానికి పేటీఎంతో ఏ మెట్రో రైలు ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఢిల్లీ మెట్రో
2) కోల్‌కతా మెట్రో
3) హైదరాబాద్ మెట్రో
4) నమ్మా బెంగళూరు మెట్రో
- View Answer
- సమాధానం: 3
27. ‘రామ్ వన్ గమన్ మార్గం’ (రాముడు తన 14 సంవత్సరాల అడవి జీవితంలో తీసుకున్న మార్గం) ప్రాజెక్ట్ కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి ఆమోదించిన రాష్ట్రం?
1) మధ్యప్రదేశ్
2) బిహార్
3) జార్ఖండ్
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
28. స్లోవేనియా ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు?
1) బోరుట్ పహోర్
2) జానెజ్ జాన్సా
3) మిరో సెరార్
4) కార్ల్ ఎర్జావేక్
- View Answer
- సమాధానం: 2
29. తప్పిపోయిన పశువులను దత్తత తీసుకునే రైతులకు నెలవారీ గ్రాంటుగా రూ.900లను ఇస్తామని నిర్ణయించిన రాష్ట్రం ఏది?
1) ఆంధ్రప్రదేశ్
2) ఒడిశా
3) పంజాబ్
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
30. 2018లో ఆర్బీఐ సర్క్యులర్‌ను రద్దు చేయడం ద్వారా క్రిప్టోకరెన్సీలో వర్తకంపై నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసినందున క్రిప్టోకరెన్సీ ఏ సాంకేతిక పరిజ్ఞానంపై నడుస్తుంది?
1) క్లౌడ్ కంప్యూట్
2) సైబర్ టెక్
3) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
4) బ్లాక్‌చెయిన్
- View Answer
- సమాధానం: 4
31. టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డు 2019 లో ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో ఎవరిని సత్కరించారు?
1) బజరంగ్ పునియా
2) మేరీ కోమ్
3) రోహిత్ శర్మ
4) పివీ సింధూ
- View Answer
- సమాధానం: 4
32. 1976 సంవత్సరానికి ‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్’గా ఎవరిని గౌరవించారు?
1) ప్రతిభా పాటిల్
2) కల్పన చావ్లా
3) ఇందిరా గాంధీ
4) సుచేత కృపాలని
- View Answer
- సమాధానం: 3
33. కొత్త బోయింగ్ –777 వీవీఐపీ విమానాలు, క్షిపణి రక్షణ సూట్ల కోసం రూ.1200 కోట్ల విలువైన ఒప్పందంపై భారతదేశం ఏ దేశంతో సంతకం చేసింది?
1) యూఎస్ఎ
2) ఆస్ట్రియా
3) రష్యా
4) ఇరాన్
- View Answer
- సమాధానం: 1
34. ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసిజి)లో మొదటి మహిళా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డిఐజీ) ఎవరు?
1) రుచీ శర్మ
2) నూపూర్ కులశ్రేస్త
3) ప్రియా జింగాన్
4) మితాలి మధుమిత
- View Answer
- సమాధానం: 2
35. 2019లో ‘నారి శక్తి పురస్కార్’ పొందిన భారత వైమానిక దళం (ఐఎఎఫ్) మొదటి మహిళా ఫైటర్ పైలట్లు ఎవరు?
1) మోహనా జితార్వాల్
2) అవని చతుర్వేది
3) భవన కాంత్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
36. 2020 మార్చి 6 నుంచి 8 వరకు 3 రోజుల పాటు ‘నమస్తే ఓర్చా’ పండుగను ఏ రాష్ట్రం నిర్వహించింది?
1) ఒడిశా
2) ఉత్తరప్రదేశ్
3) ఛత్తీస్‌గఢ్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
37. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) 2021 మొదటి అర్ధభాగంలో ప్రారంభించనున్న మిషన్ ఏది?
1) ఆదిత్య–ఎల్ 1 మిషన్
2) మంగళయన్–2 మిషన్
3) చంద్రయాన్–3 మిషన్
4) శుక్రయాన్ మిషన్
- View Answer
- సమాధానం: 3
38. టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డు 2019 లో ఐకాన్ ఆఫ్ ది సెంచరీ స్పెషల్ అవార్డుతో ఎవరిని సత్కరించారు?
1) ధ్యాన్ చంద్
2) సునీల్ ఛెత్రి
3) సచిన్ టెండూల్కర్
4) బల్బీర్ సింగ్
- View Answer
- సమాధానం: 4
39. 2019 సంవత్సరానికిగాను నారి శక్తి పురస్కార్ అవార్డు పొందిన 103 ఏళ్ల అథ్లెట్ పేరు ఏమిటి?
1) మన్ కౌర్
2) కృష్ణ పూనియా
3) ఎంఏ ప్రజూషా
4) సీమా పునియా
- View Answer
- సమాధానం: 1
40. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి ‘స్మృతి ఇరానీ విడుదల చేసిన ‘క్రానికల్స్ ఆఫ్ చేంజ్ ఛాంపియన్స్’ పుస్తకాన్ని ఏ పథకం ఆధారంగా రూపొందించారు?
1) పిల్లల అభివృద్ధి పథకం
2) నారి శక్తి పథకం
3) బేటి బచావో బేటి పడావో పథకం
4) నిర్భయ పథకం
- View Answer
- సమాధానం: 3
41. హాకీ ఇండియా 3 వ వార్షిక అవార్డులు 2019 లో ‘ది వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో ఎవరిని సత్కరించారు?
1) హర్మన్‌ప్రీత్ సింగ్
2) రాణి రాంపాల్
3) మన్‌ప్రీత్ సింగ్
4) వివేక్ సాగర్ ప్రసాద్
- View Answer
- సమాధానం: 2
42. యూఎన్ మహిళలు, ప్లాన్ ఇంటర్నేషనల్ సహకారంతో ‘బాలికల కోసం కొత్త యుగం: 25 సంవత్సరాల పురోగతి’ అనే నివేదికను ఏ సంస్థ విడుదలచేసింది?
1) ప్రపంచ బ్యాంక్
2) ఐక్యరాజ్యసమితి
3) ఐక్యరాజ్యసమితి పిల్లల నిధి (యునిసెఫ్)
4) అంతర్జాతీయ మహిళా ఫోరం (ఐడబ్ల్యూఎఫ్)
- View Answer
- సమాధానం: 3
43. తాజా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20ఐ ర్యాంకింగ్ 2020లో ఏ భారత క్రికెటర్ నెం.1 బ్యాట్స్ వుమెన్ అయ్యింది?
1) పూనమ్ యాదవ్
2) షఫాలి వర్మ
3) మిథాలీ రాజ్
4) స్మృతి మంధనా
- View Answer
- సమాధానం: 2
44. సంఘీభావం, సహకారాన్ని ప్రోత్సహించడానికి 2020 మార్చి నెలలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) అధ్యక్ష పదవిని చేపట్టిన దేశం?
1) ఫ్రాన్స్
2) ఎస్టోనియా
3) చైనా
4) బెల్జియం
- View Answer
- సమాధానం: 3
45. వాల్యూమ్ పరంగా ఫార్మాస్యూటికల్ మార్కెట్లో భారతదేశం ర్యాంక్ ఎంత?
1) 3
2) 7
3) 8
4) 9
- View Answer
- సమాధానం: 1
46. ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్స్ ఆడిన అతి పిన్న వయస్కుడు?
1) సందీప్ లామిచనే
2) హార్దిక్ పాండ్యా
3) షఫాలి వర్మ
4) రషీద్ ఖాన్
- View Answer
- సమాధానం: 3
47. ఎస్ బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టడానికి, దాని పునర్నిర్మాణ పథకంలో పాల్గొనడానికి ఏ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆసక్తి చూపించింది?
1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
3) పంజాబ్ నేషనల్ బ్యాంక్
4) బ్యాంక్ ఆఫ్ బరోడా
- View Answer
- సమాధానం: 1
48. 2020 సెప్టెంబర్‌లో బిమ్స్టెక్ (BIMSTEC) సమ్మిట్ 5వ ఎడిషన్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు?
1) బ్యాంకాక్, థాయ్‌లాండ్
2) న్యూఢిల్లీ, భారత్
3) కొలంబో, శ్రీలంక
4) ఖాట్మండు, నేపాల్
- View Answer
- సమాధానం: 3
49. గైర్సేన్ పట్టణాన్ని వేసవి రాజధానిగా ప్రకటించిన రాష్ట్రం ఏది?
1) మణిపూర్
2) ఉత్తరాఖండ్
3) అరుణాచల్‌ప్రదేశ్
4) హిమాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
50. ఏటా మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం (ఐడబ్లు్యడి) నేపథ్యం ఏమిటి?
1) ‘‘మహిళల జీవితాలను మార్చే గ్రామీణ మరియు పట్టణ కార్యకర్తలు’’
2) ‘‘సమానంగా ఆలోచించండి, స్మార్ట్‌గా నిర్మించండి, మార్పు కోసం కొత్తదనం’’
3) ‘‘నేను ఈ తరం సమానత్వం: మహిళల హక్కులను గ్రహించడం’’
4) ‘‘2030 నాటికి ప్లానెట్ 50–50: స్టెప్ ఇట్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ
- View Answer
- సమాధానం: 3
51. 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులో ఉన్న 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మేళనానికి కేంద్ర మంత్రివర్గం ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు ఆమోదం తెలిపింది?
1) 2
2) 4
3) 5
4) 3
- View Answer
- సమాధానం: 2
52. నావల్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2020 ను చైనా (వుహాన్) నుంచి ఏ దేశానికి మార్చారు?
1) కౌలాలంపూర్, మలేషియా
2) న్యూఢిల్లీ, ఇండియా
3) మనీలా, ఫిలిప్పీన్స్
4) టోక్యో, జపాన్
- View Answer
- సమాధానం: 3
53. ఇండో–పసిఫిక్ విజన్‌ను బలపర్చడానికి ఏ గ్రూప్/ఆర్గనైజేషన్‌లో భారత్ ఇటీవల ఐదో అబ్జర్వర్‌గా చేరింది?
1) యూరోపియన్ యూనియన్
2) జీ–7 దేశాలు
3) ఇండియన్ ఓషన్ కమిషన్
4) ఆసియా, పసిఫిక్ గ్రూప్
- View Answer
- సమాధానం: 3
54. 206 మిలియన్ డాలర్లకు ఏ డెలివరీ వ్యాపార సంస్థను జోమాటో కొనుగోలు చేసింది?
1) ఉబెర్‌ఈట్స్
2) స్విగ్గీ
3) ఫుడ్‌పాండా
4) జస్ట్ఈట్
- View Answer
- సమాధానం: 1
55. ఇండియన్ కోస్టల్ గార్డ్ 9వ ఎడిషన్ రెస్క్యూ వ్యాయామం ‘SAREX-2019’ నిర్వహించిన రాష్ట్రం ఏది?
1) కర్ణాటక
2) కేరళ
3) గోవా
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
56. ఉక్రెయిన్ ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు?
1) డెనిస్ షిమ్గల్
2) ఒలెక్సీ హోన్చారుక్
3) మైఖైలో ఫెడోరోవ్
4) అర్సెన్ అవకోవ్
- View Answer
- సమాధానం: 2
57. ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ ఫెయిర్ ‘ఆహార్ 2020’ 35వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) లక్నో
2) పుణె
3) కోల్‌కతా
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
58. 2020 అక్టోబర్‌లో ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్య సదస్సు (జీవవైవిధ్యంపై సమావేశం– COP15)కు ఆతిథ్యమివ్వనున్న దేశం?
1) భార త్
2) జపాన్
3) జర్మనీ
4) చైనా
- View Answer
- సమాధానం: 4
59. ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం స్టాండ్ అప్ ఇండియా పథకం కింద ఖాతాదారులలో ఎంత శాతం మహిళలు ఉన్నారు?
1) 78%
2) 75%
3) 72%
4) 81%
- View Answer
- సమాధానం: 4
60. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (WIPO) కొత్త డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) డేరెన్ టాంగ్
2) టెడ్రోస్ అధనామ్
3) పీటర్ సదర్లాండ్
4) రాబర్టో అజెవాడో
- View Answer
- సమాధానం: 1