కరెంట్అఫైర్స్(ఫిబ్రవరి–4thవీక్) బిట్‌బ్యాంక్
1. 600 కిలోమీటర్ల పరిధితో అణు సామర్థ్యం గల ఎయిర్ లాంచ్డ్ క్రూయిజ్ క్షిపణి 'Ra-ad-II' ను ఏ దేశం పరీక్షించింది?
1) ఇరాన్
2) పాకిస్తాన్
3) ఇరాక్
4) సిరియా
- View Answer
- సమాధానం: 2
2. రూ. 15,337 కోట్లు నిధులతో 3 సంవత్సరాలలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం 'నాడు- నేడు ' పథకాన్ని ప్రారంభించింది?
1) కర్ణాటక
2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 2
3. తమ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జ్ఞాపకార్థం ఫిబ్రవరి 24ను 'స్టేట్ గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ డే'గా నిర్వహించనున్నట్లు ప్రకటించిన రాష్ట్రం ఏది ?
1) తెలంగాణ
2) పశ్చిమ బెంగాల్
3) తమిళనాడు
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
4. 24 సికోర్స్కీ MH-60R సీహాక్ మల్టీ-రోల్ హెలికాప్టర్లను ఏ దేశం నుండి కొనుగోలు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది?
1) యుఎస్ఎ
2) యుకె
3) రష్యా
4) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 1
5. ఏ రోజున కేంద్ర వ్యాయామ దినోత్సవం నిర్వహిస్తారు?
1) జనవరి 26
2) ఏప్రిల్ 15
3) ఫిబ్రవరి 24
4) మే 12
- View Answer
- సమాధానం: 3
6. పాలు ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం ద్వారా 108 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచేలా ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పశుసంవర్ధక, డెయిరీ శాఖ ప్రకటించింది?
1) 2021
2) 2022
3) 2024
4) 2025
- View Answer
- సమాధానం: 4
7. ఇటీవల విజయవంతంగా పరీక్షించిన మొట్టమొదటి అధిక ఎత్తులో ఒత్తిడిని తట్టుకొనగలిగే సామర్థ్యం కలిగి సౌరశక్తితో పనిచేసే మానవరహిత విమానం ఏది ?
1) PHASA - 22
2) PHASA - 32
3) PHASA - 35
4) PHASA - 44
- View Answer
- సమాధానం: 3
8. ప్రతి సంవత్సరం ఏ రోజున సాయిల్ హెల్త్ కార్డ్ (SHC) రోజును నిర్వహిస్తారు?
1) ఫిబ్రవరి 16
2) ఫిబ్రవరి 17
3) ఫిబ్రవరి 18
4) ఫిబ్రవరి 19
- View Answer
- సమాధానం: 4
9. ఏటా ఫిబ్రవరి 21న పాటించే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం (IMLD) యొక్క థీమ్ ఏమిటి?
1) ““Indigenous languages development”
2) “no discrimination on the basis of language”
3) “Towards Sustainable Multilingual Education”
4) “Languages without Borders”
- View Answer
- సమాధానం: 4
10. ఆర్మీలోని మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు ఏ ధర్మాసనం ఆమోదించింది?
1) జస్టిస్ ఎస్ఏ బొబ్డే
2) జస్టిస్ డివై చంద్రచూడ్
3) జస్టిస్ అజయ్ రాస్తోగి
4) 2 మరియు 3 రెండూ
- View Answer
- సమాధానం: 4
11. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2020 లో ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్న బాలీవుడ్ నటుడు ఎవరు ?
1) షారుఖ్ ఖాన్
2) హృతిక్ రోషన్
3) సల్మాన్ ఖాన్
4) అక్షయ్ కుమార్
- View Answer
- సమాధానం: 2
12. 2019-20 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 1వ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డిబిటి) చెల్లింపుల పనితీరు రేటింగ్‌లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది ?
1) ఉత్తరాఖండ్
2) ఉత్తర ప్రదేశ్
3) గుజరాత్
4) హర్యానా
- View Answer
- సమాధానం: 4
13. వృద్ధులకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది?
1) వైయస్ఆర్ నేస్తం పథకం
2) వైయస్ఆర్ ఆసరా పథకం
3) వైయస్ఆర్ కంటి వెలుగు పథకం
4) వైయస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం
- View Answer
- సమాధానం: 3
14. డబ్ల్యూహెచ్ఓ-యునిసెఫ్-లాన్సెట్‌కు చెందిన 'చైల్డ్ ఫ్లోరిషింగ్ ఇండెక్స్' రూపొందించిన “A future for the world’s children?” నివేదికలో భారతదేశం ర్యాంక్ ఎంత?
1) 128
2) 129
3) 130
4) 131
- View Answer
- సమాధానం: 4
15. నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు కొత్తగా కనుగొన్న నత్త జాతులకు ఎవరి పేరు పెట్టారు?
1) సచిన్ టెండూల్కర్
2) దివినా మాలౌమ్
3) మలాలా యూసఫ్‌జాయ్
4) గ్రేటా థన్‌బెర్గ్
- View Answer
- సమాధానం: 4
16. 2022 కామన్వెల్త్ ఆర్చరీ మరియు షూటింగ్ ఛాంపియన్షిప్లను నిర్వహించబోయే నగరం ఏది?
1) ముంబై
2) ఛండీగఢ్
3) భువనేశ్వర్
4) చెన్నై
- View Answer
- సమాధానం: 2
17. ప్రపంచ భాషా డేటాబేస్ ఎథ్నోలాగ్ యొక్క 22 వ ఎడిషన్ ప్రకారం ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో ఏ భారతీయ భాష ఇంగ్లీష్, మాండరిన్ల తర్వాత స్థానంలో ఉంది?
1) బెంగాలీ
2) హిందీ
3) తమిళ
4) గుజరాతీ
- View Answer
- సమాధానం: 2
18. లోసర్ పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు?
1) ఛత్తీస్‌గఢ్
2) హిమాచల్ ప్రదేశ్
3) పంజాబ్
4) హర్యానా
- View Answer
- సమాధానం: 2
19. బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు విభాగం ఉత్తర ప్రదేశ్‌లోని ఏ నగరంలో 4,000 సంవత్సరాల పురాతన హస్తకళల గ్రామాలను కనుగొంది?
1) లక్నో
2) వారణాసి
3) మీరట్
4) కాన్పూర్
- View Answer
- సమాధానం: 2
20. రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ?
1) మహంత్ చంపంత్ రాయ్
2) స్వామి గోవింద్ దేవ్ గిరి
3) మహంత్ నృత్య గోపాల్ దాస్
4) స్వామి పరాశరన్
- View Answer
- సమాధానం: 3
21. కెవి చౌదరి స్థానంలో కొత్త చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (CVC)గా ఎవరు నియమితులయ్యారు?
1) సుధీర్ భార్గవ
2) బిమల్ జుల్కా
3) సురేష్ పటేల్
4) సంజయ్ కొఠారి
- View Answer
- సమాధానం: 4
22. ఎర్నెస్ట్ & యంగ్ (EY) ఎంటర్ప్రెన్యూర్ అవార్డులు 2019 యొక్క 21 వ ఎడిషన్‌లో జీవితకాల సాధన అవార్డును ఎవరు పొందారు?
1) ముఖేష్ అంబానీ
2) అజీమ్ ప్రేమ్‌జీ
3) రితేష్ అగర్వాల్
4) ఆది గోద్రేజ్
- View Answer
- సమాధానం: 4
23. భారత్ స్టేజ్ - VI ఇంజిన్లకు వెళ్లడం ద్వారా భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైన పెట్రోల్ మరియు డీజిల్‌ను ఏ తేదీ నుండి పొందుతుంది ?
1) 1 ఏప్రిల్, 2020
2) 31 మార్చి, 2020
3) 1 జూలై, 2020
4) 15 ఆగస్టు, 2020
- View Answer
- సమాధానం: 1
24. జాతీయ జలవిద్యుత్ కార్పొరేషన్ (NHPC) చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (CMD) గా ఎవరు నియమితులయ్యారు?
1) అభయ్ కుమార్ సింగ్
2) సందీప్ శర్మ
3) రమేష్ సింగ్
4) పవన్ శర్మ
- View Answer
- సమాధానం: 1
25. 'జెండర్ జస్ట్ వరల్డ్' అనే థీమ్‌తో అంతర్జాతీయ న్యాయ సమావేశం 2020 ఏ రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగింది?
1) న్యూ ఢిల్లీ
2) ఆంధ్రప్రదేశ్
3) మహారాష్ట్ర
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 1
26. ESPN వార్షిక అవార్డులు 2019 లో 'స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ (ఫిమేల్)' అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
1) పివి సింధు
2) దుతీ చంద్
3) కోనేరు హంపి
4) మనసి జోషి
- View Answer
- సమాధానం: 1
27. ఫిబ్రవరి 2020 లో వరుసగా రెండవసారి అష్రఫ్ ఘనిని అధ్యక్షుడిగా ఎన్నుకున్న దేశం ఏది ?
1) ఖతార్
2) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
3) కువైట్
4) ఆఫ్ఘనిస్తాన్
- View Answer
- సమాధానం: 4
28. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాల కోసం విభిన్న సామర్థ్యం గల వ్యక్తులకు శిక్షణ అందించడానికి మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ప్రభుత్వ రంగ బ్యాంకు?
1) ఇండియన్ బ్యాంక్
2) ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్
3) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) కార్పొరేషన్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
29. న్యూ ఢిల్లీలో జరిగిన 2019 సంవత్సరానికి ఎర్నెస్ట్ & యంగ్ (EY) ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 21వ ఎడిషన్‌ను ఎవరు గెలుచుకున్నారు?
1) సిద్ధార్థ లాల్
2) కిరణ్ మజుందార్ -షా
3) విజయ్ శేఖర్ శర్మ
4) సచిన్ బన్సాల్
- View Answer
- సమాధానం: 2
30. సుస్థిర అభివృద్ధి కోసం నీలి ఆర్థిక వ్యవస్థపై సహకారం కోసం భారతదేశం ఏ దేశంతో లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI)పై సంతకం చేసింది ?
1) నార్వే
2) శ్రీలంక
3) మాల్దీవులు
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 1
31. 'గంగా కయాక్ పండుగ' యొక్క 8 వ ఎడిషన్‌ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు?
1) ఉత్తర ప్రదేశ్
2) బీహార్
3) ఉత్తరాఖండ్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 3
32. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) సుప్రతీం బండియోపాధ్యాయ
2) పంకజ్ జైన్
3) అరవింద్ సింగ్
4) అజయ్ భూషణ్ పాండే
- View Answer
- సమాధానం: 1
33. 'ఫిట్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా ఇండియన్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్పొరేషన్ దేశంలోనే మొదటి స్క్వాట్ యంత్రాన్ని ఏ స్టేషన్లో ఏర్పాటు చేసింది?
1) ఛత్రపతి శివాజీ టెర్మినస్
2) విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్
3) ఎం.జి.ఆర్. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్
4) ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్
- View Answer
- సమాధానం: 4
34. 2022 ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (AFC) మహిళల ఆసియా కప్‌కు ఆతిథ్యమిచ్చిన మొదటి దక్షిణాసియా దేశం ఏది?
1) నేపాల్
2) ఇండియా
3) బంగ్లాదేశ్
4) మాల్దీవులు
- View Answer
- సమాధానం: 2
35. భారత్ ఆతిథ్యమిస్తున్న U-17 మహిళల ప్రపంచ కప్ 2020 టోర్నమెంట్ స్లోగన్ఏది?
1) “Play with an Open Heart”
2) “Kick Off the Dream”
3) “Be Brave, Be Bold”
4) “The Wings of Women’s pride”
- View Answer
- సమాధానం: 2
36. తొలిసారిగా నిర్వహించిన 2 రోజుల భారత్- బంగ్లా పర్యాటక ఉత్సవం ఏ నగరంలో జరిగింది?
1) కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
2) ఇటానగర్ , అరుణాచల్ ప్రదేశ్
3) డిస్పూర్ , అస్సాం
4) అగర్తాలా , త్రిపుర
- View Answer
- సమాధానం: 4
37. రెగ్యులర్ ప్యాసింజర్ బస్సు సర్వీసు కోసం భారతదేశం ఇటీవల ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
1) మయన్మార్
2) భూటాన్
3) నేపాల్
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 1
38. డెయిరీ రంగంలోని రైతులకు వడ్డీ రాయితీని 2% నుంచి ఎంత శాతానికి పెంచడానికి మంత్రివర్గం ఆమోదించింది
1) 2.25%
2) 2.5%
3) 3.0%
4) 3.5%
- View Answer
- సమాధానం: 2
39. విద్యార్థుల హాస్టల్ మరియు మెస్ ఖర్చుల నిర్వహణకు ఆర్థిక సహాయం అందించడానికి ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
1) తమిళనాడు
2) ఒడిశా
3) ఆంధ్రప్రదేశ్
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 3
40. 'లివా మిస్ దివా యూనివర్స్ 2020' టైటిల్ గెలుచుకున్నది ఎవరు?
1) అడ్లైన్ కాస్టెలినో
2) ఆశా భట్
3) నేహా జైస్వాల్
4) వర్తిక సింగ్
- View Answer
- సమాధానం: 1
41. స్వీడన్ యొక్క రిక్స్ బ్యాంక్ (సెంట్రల్ బ్యాంక్) డిజిటల్ కరెన్సీ పరీక్షను ప్రారంభించినందున ప్రపంచంలోని మొదటి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పేరు ఏమిటి ?
1) ఇ-రూపాయ
2) ఇ-రింగిట్
3) ఇ- క్రోన్
4) ఇ- క్రోనా
- View Answer
- సమాధానం: 4
42. భారతీయ సంతతికి చెందిన ఎస్టేట్ కార్మికుల కోసం ప్లాంటేషన్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
1) నేపాల్
2) శ్రీలంక
3) బంగ్లాదేశ్
4) భూటాన్
- View Answer
- సమాధానం: 2
43. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) యొక్క 9 వ రక్షణ మరియు భద్రతా నిపుణుల సమూహ సమావేశం ఏ దేశంలో జరిగింది?
1) న్యూ ఢిల్లీ, ఇండియా
2) బీజింగ్, చైనా
3) మాస్కో, రష్యా
4) ఇస్లామాబాద్, పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 4
44. ఈశాన్య సరిహద్దు రైల్వే భారతదేశంలో ఎత్తైన పైర్ వంతెనను ఏ రాష్ట్రంలో నిర్మించింది ?
1) అస్సాం
2) మేఘాలయ
3) సిక్కిం
4) మణిపూర్
- View Answer
- సమాధానం: 4
45. వలస జాతుల పరిరక్షణపై 13 వ COP (CMS COP13) సమావేశంలోని రక్షిత జాబితాలో చేర్చిన భారతీయ వలస జాతులు ఏవి?
1) బెంగాల్ ఫ్లోరికాన్
2) ఆసియా ఏనుగు
3) గ్రేట్ ఇండియన్ బస్టర్డ్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
46. ఆరోపణలు ఫిక్సింగ్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 7 సంవత్సరాల పాటు క్రికెట్ ఆడకుండా నిషేధించిన యూసుఫ్ అబ్దుల్రాహిమ్ అల్ బలూషి ఏ దేశానికి చెందినవాడు?
1) పాకిస్తాన్
2) బంగ్లాదేశ్
3) యు.ఎ.ఇ.
4) ఒమన్
- View Answer
- సమాధానం: 4
47. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన మహిళా పారిశ్రామికవేత్తల కోసం జాతీయ సేంద్రీయ ఆహార ఉత్సవం యొక్క థీమ్ ఏమిటి?
1) Healthy food, Organic food
2) Unleashing India’s Organic Market Potential
3) Organic market for women entrepreneurs
4) Good for Women; Good for India; Good for You
- View Answer
- సమాధానం: 2
48.ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) ప్రకటించిన ఏ కేటగిరీ జాబితాలో, పాకిస్తాన్ మరో 4 నెలలు కొనసాగుతుంది?
1) గ్రే జాబితా
2) బ్లాక్ లిస్ట్
3) వైట్ లిస్ట్
4) రెడ్ లిస్ట్
- View Answer
- సమాధానం: 1
49. ఏషియన్ ఫుట్‌బాల్ క్లబ్ ఛాంపియన్స్ లీగ్ గ్రూప్ దశకు అర్హత సాధించి ఆ రికార్డు సాధించిన మొదటి భారతీయ ఫుట్‌బాల్ క్లబ్‌గా పేరొందింది?
1) మోహున్ బాగన్ ఎ.సి.
2) బెంగళూరు ఎఫ్.సి.
3) చెన్నైయిన్ ఎఫ్.సి.
4) ఎఫ్.సి. గోవా
- View Answer
- సమాధానం: 4
50. “ Realizing Opportunities of the 21st Century for All” అనే థీమ్‌తో జి-20 ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం-2020నకు ఏ అరబ్
దేశం ఆతిథ్యం ఇచ్చింది?
1) యు.ఎ.ఇ.
2) కువైట్
3) ఖతార్
4) సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 4
51. 1000 పబ్లిక్ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్ లిమిటెడ్ (EESL)తో ఏ భారతీయ పి.ఎస్.యు. అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) కోల్ ఇండియా లిమిటెడ్
2) నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్
3) భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్
4) భారత్ సంచార్ నిగం లిమిటెడ్
- View Answer
- సమాధానం: 4
52. బొగ్గు దిగుమతిని భారత్ ఏ ఆర్థిక సంవత్సరం నుంచి నిలిపివేస్తుంది?
1) 2020-2021
2) 2021-2022
3) 2022-2023
4) 2023-2024
- View Answer
- సమాధానం: 4
53. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) ప్రకారం 2019-20 సంవత్సరానికి భారత జి.డి.పి. ఎంత?
1) 5.0%
2) 4.9%
3) 4.6%
4) 4.5%
- View Answer
- సమాధానం: 2
54. 14,100 టన్నుల లిథియం నిల్వలను అటామిక్ ఎనర్జీ కమిషన్ పరిశోధకులు ఇటీవల ఏ ప్రాంతంలో కనుగొన్నారు?
1) గుంటూరు, ఆంధ్రప్రదేశ్
2) నయవేలి , తమిళనాడు
3) మాండ్యా , కర్ణాటక
4) ఉదయపూర్, రాజస్థాన్
- View Answer
- సమాధానం: 3
55. మంత్రివర్గం ఆమోదించిన 2020-2021 నుండి 2024-2025 మధ్య స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) యొక్క రెండవ దశకు మొత్తం వ్యయం ఎంత ?
1) 1,21,700 కోట్లు
2) 78, 256 కోట్లు
3) 52,497 కోట్లు
4) 1,40,881 కోట్లు
- View Answer
- సమాధానం: 4
56. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన(PMUY) పథకం అమలు కారణంగా ఏ రాష్ట్రంలో 100% ఎల్పీజీ కనెన్షన్లు అందించడం సాధ్యమైంది?
1) హిమాచల్ ప్రదేశ్
2) గోవా
3) హర్యానా
4) ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం: 1
57. సుధీర్ భార్గవ తర్వాత భారత కొత్త చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (CIC)గా ఎవరు నియమితులయ్యారు?
1) సురేష్ పటేల్
2) సంజయ్ కొఠారి
3) కెవి చౌదరి
4) బిమల్ జుల్కా
- View Answer
- సమాధానం: 4