కరెంట్అఫైర్స్(ఫిబ్రవరి–2ndవీక్) బిట్‌బ్యాంక్
1. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెట్ డైరెక్టర్‌గా భారత మాజీ క్రికెటర్ ఎవరు నియమితులయ్యారు?
1) దినేశ్ మోంగియా
2) రాబిన్ సింగ్
3) హెమాంగ్ బదాని
4) అనిల్ కుంబ్లే
- View Answer
- సమాధానం: 2
2. 2020 ఫిబ్రవరిలో రైతులకు సహాయం చేయడానికి 11 వ్యవసాయ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏది?
1) తెలంగాణ
2) ఒడిశా
3) ఆంధ్రప్రదేశ్
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
3. భారీ పోర్టును ఏ రాష్ట్రంలోని వధావన్ వద్ద నిర్మించడానికి కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది?
1) గుజరాత్
2) కర్ణాటక
3) గోవా
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 4
4. అరుదైన న్యూరోడీజెనరేటివ్ వ్యాధి ‘అమియోట్రోíపిక్ లాటరల్ స్లీ్కరోసిస్’ (ఎఎల్ఎస్) లేదా లౌ గెహ్రిగ్స్ వ్యాధిను నయం చేసే ఒక అణువును ఏ భారతీయ సంస్థ కనుగొంది?
1) ఐఐటీ మద్రాస్
2) ఐఐటీ బొంబాయి
3) ఐఐటీ హైదరాబాద్
4) ఐఐటీ కొలకతా
- View Answer
- సమాధానం: 3
5. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) 2020లో ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ అవార్డును గెలుచుకున్నవారు?
1) లక్ష్యా సేన్
2) ప్రణవ్ జెర్రీ చోప్రా
3) ప్రియాన్షు రజావత్
4) అస్మిత చలిహా
- View Answer
- సమాధానం: 3
6. సాలిస్బరీ మైదానంలో ‘అజేయ వారియర్’ మిలిటరీ వ్యాయామం 5వ ఎడిషన్‌ను ఏ రెండు దేశాలు కలిసి నిర్వహించాయి?
1) ఇండియా–సింగపూర్
2) ఇండియా–యూఎస్ఎ
3) ఇండియా–యూకె
4) ఇండియా–రష్యా
- View Answer
- సమాధానం: 3
7. రూ.25లకే భోజనాన్ని సరఫరా చేసే 1000 కుడుంబశ్రీ హోటళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఏ భారత రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది?
1) కర్ణాటక
2) ఒడిశా
3) తమిళనాడు
4) కేరళ
- View Answer
- సమాధానం: 4
8. విలేజ్ మ్యాపింగ్ (2020 ఫిబ్రవరి) కోసం తొలిసారిగా డ్రోన్లను ఏ రాష్ట్రంలో ఉపయోగించారు?
1) హర్యానా
2) పంజాబ్
3) మధ్యప్రదేశ్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
9. రెండు నగరాల మధ్య సత్సంబంధాల కోసం 2020 ఫిబ్రవరి 15–16 తేదీలలో మొదటి ‘జెరూసలెం–ముంబై పండుగ’ ఏ నగరంలో జరిగింది?
1) న్యూఢిల్లీ
2) ముంబై
3) జెరూసలెం
4) టెలి అవీవ్
- View Answer
- సమాధానం: 2
10. వన్య వలస జాతుల పరిరక్షణను ఉద్దేశించి జరిగిన 13వ ‘కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీస్’ (సీఓపీ–13)కి ఆతిథ్యమిచ్చిన భారతదేశ నగరం ఏది?
1) లక్నో
2) అహ్మదాబాద్
3) చెన్నై
4) గాంధీనగర్
- View Answer
- సమాధానం: 4
11. హౌసింగ్, అర్బన్ మంత్రిత్వ శాఖ ప్రకారం స్మార్ట్ సిటీ అభివృద్ధికి ఏ నగరం వారణాసికి ‘సోదర నగరంగా’ పనిచేస్తుంది?
1) డియూ
2) సూరత్
3) అహ్మదాబాద్
4) అమృత్సర్
- View Answer
- సమాధానం: 4
12. కావేరీ డెల్టా ప్రాంతాన్ని రక్షిత ప్రత్యేక వ్యవసాయ ప్రాంతంగా ప్రకటించిన రాష్ట్రం/ కేంద్రపాలితప్రాంతం ఏది?
1) పుదుచ్చేరి
2) కేరళ
3) కర్ణాటక
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 4
13. 200 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్‌తో డీఆర్డీఓ తయారుచేస్తున్న బాలిస్టిక్ క్షిపణి పేరు ఏమిటి?
1) ప్రాణేష్
2) ప్రహార్
3) అగ్ని
4) నిర్భయ్
- View Answer
- సమాధానం: 1
14. ఆస్కార్ ఉత్తమ చలన చిత్ర విభాగంలో అవార్డు గెలుచుకున్న చిత్రం ఏది?
1) పారాసైట్
2) జోకర్
3) వాటర్
4) మ్యారేజ్ స్టోరీ
- View Answer
- సమాధానం: 1
15. కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) అరవింద్ కేజ్రీవాల్
2) గౌతమ్ గంభీర్
3) నరేశ్ గౌర్
4) మనీశ్ సిసోడియా
- View Answer
- సమాధానం: 1
16. ‘బ్లూ రివల్యూషన్–బియాండ్ ప్రొడక్షన్ టు వాల్యూ ఎడిషన్’ అనే నేపథ్యంతో ఇండియా ఇంటర్నేషనల్ సీçఫుడ్ షో (ఐఐఎస్ఎస్) 2020, 22వ ఎడిషన్‌ను నిర్వహించిన రాష్ట్రం ఏది?
1) ముంబాయి, మహారాష్ట్ర
2) కొచ్చి, కేరళ
3) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
4) మంగళూరు, కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
17. 2016–18 మధ్య ‘భారతదేశంలో తప్పిపోయిన మహిళలు, పిల్లలు’ గురించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధికంగా తప్పిపోయిన మహిళలు ఉన్న రాష్ట్రం ఏది?
1) మధ్యప్రదేశ్
2) తమిళనాడు
3) ఉత్తరప్రదేశ్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 4
18. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ వ్యవస్థను 1.867 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో భారతదేశానికి విక్రయించడానికి ఏ దేశం ఆమోదం తెలిపింది?
1) రష్యా
2) చైనా
3) ఇజ్రాయిల్
4) యూఎస్ఎ
- View Answer
- సమాధానం: 4
19. ఎకె–47 బుల్లెట్‌ను 10 మీటర్ల కన్నా తక్కువ దూరం నుంచి ఆపగలిగే ప్రపంచంలోనే మొదటి బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్‌ను అభివృద్ధి చేసిన భారత ఆర్మీ మేజర్ పేరు ఏమిటి?
1) నితీశ్ కుమార్ సింగ్
2) గిరీశ్ చంద్ర జోషి
3) అనూప్ మిశ్రా
4) అశ్విన్ నాగ్‌పాల్
- View Answer
- సమాధానం: 3
20. ఐసీసీ అండర్–19 ప్రపంచకప్ 2020, 13వ ఎడిషన్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించిన దేశం?
1) ఆస్ట్రేలియా
2) న్యూజిలాండ్
3) పాకిస్తాన్
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 4
21. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన డెఫ్ ఎక్స్పో–2020, 11వ ఎడిషన్‌లో ఇండియన్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్, ఒక ప్రైవేట్ సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన తక్కువ ఖర్చుతో కూడిన గన్‌షాట్ లొకేటర్ల ను ప్రదర్మించారు? దాని పేరు ఏమిటి?
1) పార్త్
2) ఎకో
3) ప్రిథ్వ్
4) మిక్
- View Answer
- సమాధానం: 1
22. భారతదేశం 2020 సంవత్సరానికి 2 మిలియన్ మెట్రిక్ టన్నుల యురల్స్ గ్రేడ్ ముడి చమురును దిగుమతి చేసుకోవడానికి ఏ దేశానికి చెందిన మొదటి టెర్మ కాంట్రాక్టుపై సంతకం చేసింది?
1) ఒమన్
2) యూఏఈ
3) యూఎస్ఎ
4) రష్యా
- View Answer
- సమాధానం: 4
23. మాజీ మేజర్ జనరల్ ఖాసిం సులేమానికి అంకితం చేసిన బాలిస్టిక్ క్షిపణి ‘రాడ్–500’ ను ఏ దేశం ఆవిష్కరించింది?
1) ఇరాన్
2) ఇరాక్
3) సిరియా
4) టర్కీ
- View Answer
- సమాధానం: 1
24. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఎల్పీజీ కనెక్షన్లతో 2020 జనవరి 1 వరకు ఎంత శాతం మంది ప్రజలు ఉన్నారు?
1) 87.8%
2) 82.4%
3) 99.6%
4) 96.9%
- View Answer
- సమాధానం: 4
25. 2020–21 ఆర్థిక సంవత్సరపు జీడీపీ వృద్ధిరేటును ఆర్బీఐ ఎంతగా అంచనావేసింది?
1) 5.0%
2) 5.6%
3) 7.1%
4) 6.0%
- View Answer
- సమాధానం: 4
26. లక్ష్మణ్ జులా అనే వేలాడే వంతెన స్థానంలో భారతదేశంలోనే తొలిసారిగా గాజు నేల వంతెనను నిర్మించనున్న రాష్ట్రం ఏది?
1) ఉత్తరప్రదేశ్
2) మధ్యప్రదేశ్
3) హిమాచల్‌ప్రదేశ్
4) ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం: 4
27. రోగి భద్రత, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కోసం ఎఐఐఎంఎస్ మంగళగిరితో కలిసి పనిచేయనున్న సంస్థ ఏది?
1) ఐఐఎస్సీ బెంగళూరు
2) ఐఐఎస్ఈఆర్ తిరుపతి
3) ఐఐటీ మద్రాస్
4) ఐఐటీ బొంబాయి
- View Answer
- సమాధానం: 3
28. ముంబైలోని మహీంద్రా హాకీ స్టేడియంలో జరిగిన 54వ ‘అఖిల భారత బాంబే గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్’ టైటిల్‌ను గెలుచుకున్న జట్టు ఏది?
1) దక్షిణ మధ్యరైల్వే
2) ముంబై కస్టమ్స్
3) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
4) ఇండియన్ నేవీ
- View Answer
- సమాధానం: 4
29. ఏటా ఫిబ్రవరి13న జరుపుకునే ప్రపంచ రేడియో దినోత్సవం నేపథ్యం ఏమిటి?
1) సంభాషణ, శాంతి
2) రేడియో, ఆటలు
3) రేడియో, వైవిధ్యం
4) రేడియో ఈజ్ యూ
- View Answer
- సమాధానం: 3
30. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం, ప్రధానమంత్రి జనధన్ యోజన (పిఎంజెడీవై) కింద 2020 జనవరి వరకు తెరిచిన బ్యాంక్ ఖాతాల సంఖ్య?
1) 27 కోట్లు
2) 31 కోట్లు
3) 36 కోట్లు
4) 38 కోట్లు
- View Answer
- సమాధానం: 4
31. స్వీడన్, ఫ్రాన్స్ వినియోగదారులకు విదేశీ ఉపగ్రహాలను నిర్మించిన తొలి భారతీయ ఏరోస్పేస్ ప్రైవేట్ సంస్థ ఏది?
1) లార్సెన్ – టోబ్రో
2) అనంత్ టెక్నాలజీస్
3) ట్రాన్స్పేస్ టెక్నాలజీస్
4) ధ్రువ స్పేస్
- View Answer
- సమాధానం: 2
32. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) –2020 టైటిల్‌ను గెలుచుకున్న జట్టు ఏది?
1) హైదరాబాద్ హంటర్స్
2) బెంగళూరు రాప్టర్స్
3) ముంబై రాకెట్స్
4) నార్త్ఈస్టర్న్ వారియర్స్
- View Answer
- సమాధానం: 2
33. అరుణ్ నదిపై భారతదేశం మద్దతుతో ఎన్పిఆర్ 100 బిలియన్ల ఖర్చుతో, 900 మెగావాట్ల హైడ్రో ప్రాజెక్ట్‌ను నిర్మించారు. అరుణ్–3 హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది?
1) మాల్దీవులు
2) శ్రీలంక
3) భూటాన్
4) నేపాల్
- View Answer
- సమాధానం: 4
34. జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) మార్చి 8
2) ఫిబ్రవరి 13
3) ఫిబ్రవరి 8
4) మే 19
- View Answer
- సమాధానం: 2
35. వలస జాతుల పరిరక్షణ కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీస్ 13వ ఎడిషన్ కోసం ఎంపికచేసుకున్న అధికారిక చిహ్నం ఏది?
1) ఆసియా ఏనుగు
2) భారతదేశపు బట్టమేక పక్షి
3) సముద్ర తాబేలు
4) అమూర్ ఫల్కన్
- View Answer
- సమాధానం: 2
36. నావల్ కరోనా వైరస్ (ఎన్సీఓవీ) వ్యాప్తిని ఎదుర్కోవడానికి 2 మిలియన్ డాలర్లను స్పాన్సర్ చేయడానికి ఏ బ్యాంక్/సంస్థ ఆమోదం తెలిపింది?
1) వర్క్ బ్యాంక్
2) న్యూ డెవలప్మెంట్ బ్యాంక్
3) ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్
4) ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్
- View Answer
- సమాధానం: 3
37. దక్షిణ అమెరికాలోని ఎల్తైన పర్వతం మౌంట్ అకాంకాగ్వాను అధిరోహించి ప్రపంచంలోనే అతి చిన్న వయస్కురాలుగా రికార్డు నెలకొల్పిన బాలిక?
1) జోర్డన్ రొమిరో
2) మలావత్ పూర్ణ
3) బచేంద్రి బాల్
4) కామ్య కార్తికేయన్
- View Answer
- సమాధానం: 4
38. 2019 సంవత్సరానికిగాను పురుషుల కోచ్‌ల విభాగంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికైనవారు?
1) పుల్లెల గోపీచంద్
2) రమాకాంత్ అచేరికర్
3) బిశ్వేశ్వర్ నంది
4) రవిశాస్త్రి
- View Answer
- సమాధానం: 1
39. ప్రపంచ యునాని దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు?
1) ఫిబ్రవరి 10
2) ఫిబ్రవరి 11
3) ఫిబ్రవరి 13
4) ఫిబ్రవరి 14
- View Answer
- సమాధానం: 2
40. నావల్ కరోనా వైరస్ (ఎన్సీఓవీ) వ్యాప్తిని పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆరోగ్య సంస్థ, రిపబ్లిక్ ఆఫ్ చైనాతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ఏ దేశాల సమూహం ప్రకటించింది?
1) జీ7
2) జీ20
3) ఏసియన్
4) సార్క్
- View Answer
- సమాధానం: 1
41. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విడుదలచేసిన ఆత్మకథ ‘ఎ చైల్డ్ ఆఫ్ డెస్టినీ’ పుస్తక రచయిత ఎవరు?
1) కోనేరు రామకృష్ణారావు
2) సల్మాన్ రష్దీ
3) విక్రమ్ సేథ్
4) అమితవ్ ఘోష్
- View Answer
- సమాధానం: 1
42. 2020 నాటికి సముద్ర ఆహార ఎగుమతి లక్ష్యంలో భారత్ నిర్దేశించుకున్న లక్ష్యం ఏమిటి?
1) 5 బిలియన్ డాలర్లు
2) 10 బిలియన్ డాలర్లు
3) 1 బిలియన్ డాలర్
4) 500 మిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 2
43. యునెస్కో డైరెక్టరేట్ జనరల్ ఆడ్రీ అజౌలే భారతదేశాన్ని సందర్శించిన సందర్భంగా యునెస్కో ప్రపంచ వారసత్వ నగర ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్న నగరం ఏది?
1) చెన్నై
2) హైదరాబాద్
3) జైపూర్
4) అహ్మదాబాద్
- View Answer
- సమాధానం: 3
44. అసెంబ్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఎఎ), నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ (ఎన్ఆర్సి), నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పిఆర్)కు వ్యతిరేకంగా తీర్మానం చేసిన మొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది?
1) న్యూఢిల్లీ
2) పుదిచ్చేరి
3) జమ్మూ–కశ్మీర్
4) చండీఘర్
- View Answer
- సమాధానం: 2
45. ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తుల మత స్వేచ్ఛను పరిరక్షించేందుకు 27 దేశాలు కలిసి అంతర్జాతీయ మత స్వాతంత్య్ర కూటమి (ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం అలయెన్స్)గా ఏర్పడినట్లు ఏ దేశం ప్రకటించింది?
1) భారత్
2) చైనా
3) ఆస్ట్రియా
4) యూఎస్ఎ
- View Answer
- సమాధానం: 4
46. కింది ఏ రాష్ట్రంలో జరిగిన బోడో శాంతి ఒప్పంద ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు?
1) మేఘాలయ
2) సిక్కిం
3) అస్సాం
4) నాగాలాండ్
- View Answer
- సమాధానం: 3
47. ఆస్కార్ ఉత్తమ ఒరిజనల్ స్క్రీన్‌ప్లే అవార్డు గెలుచుకున్న మొదటి ఆసియా చిత్ర నిర్మాత ఎవరు?
1) ఆంగ్ లీ
2) బాంగ్ జూన్–హో
3) ఇస్మాయిల్ మర్చంట్
4) విలియం కింగ్
- View Answer
- సమాధానం: 2
48. ఇటీవల 69.3 కిలోమీటర్ల మెట్రోరైల్ మార్గం కారణంగా దేశంలో రెండో అతిపెద్ద మెట్రోరైల్ నెట్‌వర్క్‌గా అవతరించిన మెట్రో?
1) ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్
2) నమ్మా మెట్రో
3) హైదరాబాద్ మెట్రోరైల్
4) చెన్నై మెట్రో రైల్
- View Answer
- సమాధానం: 3
49. 2020 జనవరి 17–ఫిబ్రవరి9 మధ్య జరిగిన ఐసీసీ అండర్–19 ప్రపంచకప్ 2020, 13వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) భారత్
2) ఆస్ట్రేలియా
3) దక్షిణాఫ్రికా
4) ఇంగ్లండ్
- View Answer
- సమాధానం: 3
50. ఇటీవల తొలి ‘దిశ’ మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 2